ఈరోజు చొప్పదండి నియోజకవర్గం తాటిపల్లి గ్రామంలో చేపల పెంపకం కోసం యువ రైతులను ప్రోత్సహించడం జరిగింది తాటిపల్లి లోని ఖజానా చెరువు( పెద్ద చెరువు ) లో 58 వేల చేప పిల్లలను నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారు వేయడం జరిగింది ఇలాగే నియోజకవర్గంలో ఉన్న యువ రైతులను ప్రోత్సహించాలని అని గ్రామ ప్రజలు రైతులు విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు zptc,mptc,sarpanch పాల్గొన్నారు
Sunday, 20 September 2020
Tuesday, 8 September 2020
ఈనెల 16 మంది శాతవాహన యూనివర్సిటీ చివరి సంవత్సరం పరీక్షలు....!
By . at September 08, 2020
No comments
కోవిడ్19 లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ నుండి జరగాల్సిన అనేక పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేస్తారని విద్యార్థులను ప్రమోట్ చేస్తారని అనేక వాదోపవాదాలు వినిపించాయి. కానీ సుప్రీం కోర్టు తీర్పు మేరకు చివరి సెమిస్టర్ పరీక్షలు తప్పకుండా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు యూజిసి విడుదల చేసిన మార్గదర్శకాలతో అన్ని యూనివర్సిటీలు చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడానికి పరీక్షల కాలపట్టిక విడుదల చేస్తున్నాయి ఈ మేరకు శాతవాహన యూనివర్సిటీ ఈనెల 16 నుండి ఆరవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య టి. భరత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు అందుకు సంబంధించిన కాలపట్టిక ను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి రుసుము ఇదివరకే విద్యార్థులంతా చెల్లించి ఉన్నారు. పరీక్షల తేదీ ఖరారు చేయడంతో విద్యార్థులంతా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది.
Monday, 7 September 2020
రిజిస్ట్రేషన్లు అన్ని బంద్...!
By . at September 07, 2020
No comments
TS లో లో అన్ని రకాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇవాల్టి నుండి ఈ-స్టాంపుల విక్రయాలను నిలిపివేయగా... చలానాలు చెల్లించిన వారికి ఇవాళ ఒక్కరోజు రిజిస్ట్రేషన్లకి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కొత్త రెవెన్యూ చట్టం త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇకపై రిజిస్ట్రేషన్లు కొత్త చట్టం ప్రకారం జరిగే అవకాశం ఉంది
Thursday, 3 September 2020
దేశంలో ఒక్కరోజే 83 వెల కరొన కేసులు నమోదు.....!
By . at September 03, 2020
No comments
గడిచిన 24 గంటల్లో భారత దేశంలో 83,883 కరోన కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,53,407వేలకు చేరింది. ఈ మేరకు గురువారం కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 1043మంది మృత్యువాతపడగా, మొత్తం 67,376మంది మరణించారు.కరోన రికవరీ రేటు 77.09 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Monday, 31 August 2020
రికార్డు స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పతనం.....!
By . at August 31, 2020
No comments
దేశీయ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పతనమైంది. కరోనా వైరస్ మహమ్మారి విలయంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదేలైంది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో తొలి త్రైమాసికంలో భారీగా క్షీణతను నమోదు చేసింది.నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతంగా ఉంది. కరోనా సంక్షోభంతో గత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికంలో నమోదైన 5.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే రికార్డు స్థాయికి క్షీణించింది. అంతకుముందు త్రైమాసికం (2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో జీడీపీ 3.1 శాతం వృద్ధి నమోదైంది.1996లో భారతదేశం త్రైమాసిక గణాంకాలను ప్రచురించడం ప్రారంభించినప్పటి నుండి ఇదే అతి పెద్ద పతనం. తయారీ, నిర్మాణ, వాణిజ్య రంగాలు వరుసగా 39.3శాతం, 50.3 శాతం, 47 శాతం వద్ద భారీ క్షీణించాయని ఎన్ఎస్ఓ విడుదల చేసిన డేటా తెలిపింది. ప్రభుత్వ వ్యయం కూడా 10.3శాతం పడిపోయింది. జూన్ త్రైమాసికంలో వ్యవసాయ రంగం పనితీరు 3.4 శాతం వృద్ధితో మెరుగ్గా ఉంది. అనుకూలమైన రుతుపవనాలు, నిండిన జలాశయాలలో నీటి లభ్యత, ఖరీఫ్ విత్తనాలు, పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల సేకరణ బలమైన రబీ ఉత్పత్తి వ్యవసాయ వృద్ధికి తోడ్పడినట్లు తెలుస్తోంది.
భారతదేశ మొట్టమొదటి మహిళ హృదయ రోగ వైద్యురాలు మృతి.....!
By . at August 31, 2020
No comments
భారత మొట్టమొదటి మహిళా కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్ పద్మావతి (103) కన్నుమూశారు. కరోనా కారణంగా ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. వైద్యరంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలున్న పద్మావతి గత 11 రోజుల క్రితం నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. 1981లో ఆమె స్థాపించిన ఆస్పత్రిలోనే కన్నుమూయడంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. వయసుమీద పడటం, కరోనా వల్ల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి మరణించినట్లు ఆసుపత్రి సీఈవో డాక్టర్ ఓపీ యాదవ్ వెల్లడించారు. గాడ్‌మదర్ ఆఫ్ కార్డియాలజీగా పద్మావతి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆమె చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 1967తో పద్మ భూషణ్, 1992లో పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. డాక్టర్ పద్మావతి మరణంపై ఆస్పత్రి యాజమాన్యం, వైద్య నిపుణులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటి మహిళా కార్డియాలజిస్ట్‌గా పద్మావతి సేవలు చిరస్మరణీయం అని గుర్తుచేసుకున్నారు.
చైనా కవ్వింపు చర్యలకు.......గట్టిగా బదులు ఇచ్చిన భారత్...!
By . at August 31, 2020
No comments
భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడింది చైనా ఆర్మీ చర్యలకు భారత సైన్యం ఘాటుగా సమాధానమీచ్చింది తూర్పు లదాఖ్, ప్యాంగ్‌యాంగ్ త్సో సరస్సు ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్ సైనికుల కుయుక్తులను తిప్పికొట్టింది.ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రత్యర్థి దేశానికి గట్టిగా బుద్ధి చెప్పింది.ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో చుషుల్ వద్ద బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది.
Saturday, 29 August 2020
ఇకపై మాస్కులు లేకుంటే....గాలిలో ఎగరలేము...!
By . at August 29, 2020
No comments
*డిజెసిఎ కొత్త నిబంధనలు
* దేశీయంగా ప్రీ- ప్యాక్డ్ భోజనాలు, పానీయాలకు అనుమతి
దేశంలో కరోనా కట్టడికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై మాస్క్ లేకుండా ఎవరు విమాన ప్రయాణం చేయరాదని తేల్చిచెప్పిందిఅంతేకాదు విమానంలో ఫేస్ మాస్క్ ధరించడానికి నిరాకరించిన ఏ ప్రయాణీకుడినైనా విమానయాన సంస్థ నో-ఫ్లై జాబితాలో ఉంచవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ప్రస్తుత డీజీసీఏ నిబంధనల ప్రకారం విరుద్ధంగా ప్రవర్తించే ప్రయాణీకులపై చర్యలకు ఎయిర్‌లైన్స్, క్యాబిన్ సిబ్బందికి అధికారం ఉందని వెల్లడించింది.
Friday, 28 August 2020
వచ్చే నెల 14 నుండి డిగ్రీ పరీక్షలు...?
By . at August 28, 2020
No comments
తెలంగాణలో డిగ్రీ ,పీజీ పరీక్షలపై ఉన్నత విద్యా మండలి యూనివర్సిటీ రిజిస్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది సెప్టెంబర్ 14 నుండి డిగ్రీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు, యూనివర్సిటీలు పరీక్షల షెడ్యూల్ ని రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది అటు పీజీ ,డిగ్రీ బ్యాక్ లాగ్ పరీక్షలు అక్టోబర్ లో నిర్వహించాలని, ఇందుకు UGC (University Grants Commission ) అనుమతి తీసుకోవాలని నిర్ణయించింది
Wednesday, 26 August 2020
తెలంగాణ రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం......!
By . at August 26, 2020
No comments
రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది సెప్టెంబర్ 1 నుండి ప్రతి పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే కేవలం ఉపాధ్యాయులు మాత్రమే హాజరు కావలెను విద్యార్థులు ఇంటి నుండే ఆన్లైన్ క్లాసుల ద్వారా పాఠాలను వినాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది
Saturday, 22 August 2020
రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల....!
By . at August 22, 2020
No comments
TS లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. కోర్సుల ప్రవేశానికి సంబంధించి పరీక్ష షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి
ఆగస్టు 31- ఈసెట్
ఎంసెట్ ఇంజనీరింగ్-సెప్టెంబర్ 9, 10, 11, 14
ఎంసెట్ అగ్రికల్చర్- సెప్టెంబర్ 28, 29
పీజీ ఈసెట్- సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు
ఐసెట్- సెప్టెంబర్ 30, అక్టోబర్ 1
ఎడ్ సెట్- అక్టోబర్ 1,3
*✍️అంబేడ్కర్ వర్సిటీ దూరవిద్య ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల*
By . at August 22, 2020
No comments
🍁హైదరాబాద్:
*🔰డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ) కోర్సులతోపాటు పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ జి.లక్ష్మారెడ్డి తెలిపారు. మరిన్ని వివరాల కోసం www.braouonline.in లేదా www.braou.ac.in లో చూడవచ్చన్నారు.
Friday, 21 August 2020
జగిత్యాల జిల్లాలో వివాహ వేడుకకు హాజరైన 26 మందికి కరోనా పాజిటివ్...!
By . at August 21, 2020
No comments
జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడి పల్లి గ్రామంలో వివాహ వేడుక హాజరైన 26 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.ఈనెల 13న వివాహం జరుగగా.. 14వ తేదీన బల్వంతపూర్ లో రిసెప్షన్ జరిగింది ఈ రిసెప్షన్ వేడుకకు హాజరైన వారిలో ఇప్పటి వరకు 26 మందికి కరోనా సోకింది. ఇందులో బుధవారం నాడు ఇద్దరికీ పాజిటివ్ రాగ, గురువారం నాడు ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది దీంతో స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇ శుక్రవారం 104 మందికి టెస్ట్ చేయగా 26 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో వెంటనే వారిని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.
శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం....!
By . at August 21, 2020
No comments
శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం పవర్ హౌస్ మొదటి యూనిట్లో పేలుడు చెలరేగిన మంటలు 6 గురు ఉద్యోగులకు తీవ్ర గాయాలు పవర్ హౌస్ లోనే చిక్కుకుపోయిన 9 మంది ఇంజనీర్లు సొరంగ మార్గం గుండా బయటపడ్డ 15 మంది సిబ్బంది శ్రీశైలం వెళ్లిన మంత్రి జగదీశ్ రెడ్డి , జెన్కో సిఎండి సిబ్బంది రక్షించేందుకు NDRF బృందాలు ప్రయత్నం దట్టమైన పొగలు అలుము కోవడం తో సహాయ చర్యలకు ఆటంకం ఆందోళనలో ఉద్యోగుల కుటుంబ సభ్యులు సింగరేణి కార్మికుల సహాయం కోరిన మంత్రి
💠📜దోస్త్ నోటిఫికేషన్ విడుదల*..!
By . at August 21, 2020
No comments
*⏺️హైదరాబాద్: తెలంగాణలో ఆన్‌లైన్ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కన్వీనర్ లింబాద్రి వివరాలను వెల్లడించారు. ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 7 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు చేపడతామన్నారు.*
*🔰ముఖ్యమైన తేదీలు:*
*🔶ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం.*
*🔶సెప్టెంబర్ 16న మొదటి విడత సీట్ల కేటాయింపు*
*🔶సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం*
*🔶సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం.*
*🔶సెప్టెంబర్ 28న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు..*
*🔶సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు.*
*🔶సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం*
Thursday, 20 August 2020
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారలు...2020!
By . at August 20, 2020
No comments
క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి ఈ ఏడాది 5 గురు క్రీడాకారులు ఎంపికయ్యారు రోహిత్ శర్మ (క్రికెట్) ,వినేష్ పొగట్ (రెస్లింగ్) ,రాణిరాంపాల్ (హాకీ), మనీక బత్ర (టేబుల్ టెన్నిస్), మరియిప్పన్ తంగవేలు (పారాలింపిక్ హై జంప్) ఈ ఐదుగురు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 29 నా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు.
ఇకపై అన్ని ఉద్యోగాలకు ఒక్కటే టెస్ట్...!
By . at August 20, 2020
No comments
కేంద్ర కేబినెట్ 'సెట్' కు ఆమోదం తెలిపింది
నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి లైన్ క్లియర్
ఇకపై బ్యాంక్ ఉద్యోగానికి, ఒక టెస్ట్ రైల్వే ఉద్యోగానికి ఒక టెస్ట్ ఉండదు అన్ని ఉద్యోగాలకు కలిపి ఒక్కటే టెస్ట్ ఉండబోతుంది ప్రతిసారి దరఖాస్తుకు అదనపు ఫీజులు కట్టి ప్రతిసారి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు ఒక అర్హత కు సంబంధించి ఏ జాబ్ అయినా సరే ఒక ఒక టెస్ట్ రాస్తే సరిపోతుంది ఇకపై కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు( నాన్-టెక్నికల్) ఒకటే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్( సెట్- సిఈటి) కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది సెట్ నిర్వహణకు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ( ఏన్ ఆర్ ఏ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బేటి అయిన కేబినెట్ కమిటీ బుధవారం( ఎన్ ఆర్ ఏ) కు లైన్ క్లియర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ లో ఉండే ఎన్ ఆర్ ఏకు మూడేళ్లకు గాను1,517.57 కోట్లు కేటాయించింది ఈ సెట్ టెస్ట్ ఒక్కసారి రాస్తే మూడేళ్లు వర్తిస్తుందని నచ్చిన భాషలో ఈ టెస్ట్ రాసుకోవచ్చు అని కబడ్డీ తెలిపింది కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ స్థాయి అధికారి ఈ ఏజెన్సీకి చైర్పర్సన్ గా ఉంటారు
దోస్త్ నోటిఫికేషన్ నేటి నుంచి...!
By . at August 20, 2020
No comments
మొదటి విడత రిజిస్ట్రేషన్ 1 నుండి?... కొత్తగా 'ఫేస్ రికగ్నైజేషన్' టెక్నాలజీ అమలు
డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి సిద్ధమైంది యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్( డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ)-2020 నోటిఫికేషన్ గురువారం విడుదల చేయనున్నారు ఉస్మానియా కాకతీయ శాతవాహన తెలంగాణ పాలమూరు విశ్వవిద్యాలయాల పరిధిలోని వెయ్యికి పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ఈ కళాశాలలో సీట్లను దోస్త్ వెబ్ సైట్ https://dost.cogg.gov.in ద్వారా భర్తీ చేస్తారు తొలివిడత రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం 'టి యాప్ ఫోలియో 'డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా విద్యార్థుల అనుమానాలు తీర్చేందుకు ఈసారి చాట్ బోట్ అనే పద్ధతి వాట్సాప్ లో అనుమానాలు తీరుస్తారు చాట్ బోట్ వాట్సాప్ నెంబర్ 790 100 2200 ఈ నెంబర్ ని కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేశాక వాట్సాప్ ద్వారా ఏ జి అని టైప్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు
Wednesday, 19 August 2020
సెప్టెంబర్ లో హెచ్ .సి .యు ప్రవేశ పరీక్షలు...!
By . at August 19, 2020
No comments
నవంబర్ మొదటి వారంలో కొత్త విద్యార్థులకు తరగతులు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్. సి. యు)2020-21 విద్యాసంవత్సరంలో వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ కోర్సులలో ప్రవేశానికి పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24 26 తేదీలలో ప్రవేశ పరీక్ష లను నిర్వహించినట్లు బుధవారం హెచ్. సి. యు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు వెల్లడించారు. జేఈఈల నిర్వహణకు ప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో హెచ్ సి యు ఈ నూతన షెడ్యూల్ తో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు ఈ ఏడాది 62,583 మంది ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నట్లు వెల్లడించారు పరీక్షల నిర్వహణ అనంతరం ఇతర ప్రవేశ ప్రక్రియ పూర్తి చేసి నవంబర్ మొదటివారంలో కొత్త విద్యార్థుల కోసం తరగతులను ప్రారంభించాలని హెచ్ సి యు భావిస్తోందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న బ్యాచ్లలో సుమారు 2000 మంది విద్యాసంవత్సరంలో విద్యాసంవత్సరంలో వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు గురువారం నుంచి ఆన్లైన్ లో తరగతులు ప్రారంభిస్తామని అన్నారు. మరోవైపు ఆన్లైన్ సెమిస్టర్ కోసం హెచ్ సి యు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, అధ్యాపకులు, విద్యార్థులు, వివిధ విభాగాల వద్ద ఐసిటి మౌలిక సదుపాయాలను పెంచడం ద్వారా ఉపయోగించగల అభ్యాస నిర్వహణ వ్యవస్థను (ఎల్ఎంఎస్) ఏర్పాటు చేశామన్నారు.
Monday, 17 August 2020
UG,PG పరీక్షలపై హైకోర్టు నోటీసు....!
By . at August 17, 2020
No comments
TS లో UG,PG చివరి సెమిస్టర్, ప్రవేశ పరీక్షల పై హైకోర్టు లో విచారణ జరిగింది UG,PG చివరి సెమిస్టర్ పరీక్షలపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుందని హైకోర్ట్ ఏజి తెలిపారు దీంతో ప్రవేశ పరీక్షలు,UG,PG చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ పై ఈ నెల 24న విచారణ జరుపుతామన్నా హైకోర్టు... ఈనెల 23 లోపు కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది
జేఈఈ నీట్ పరీక్షలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు!
By . at August 17, 2020
No comments
సెప్టెంబర్ నెలలో ముందుగా నిర్ణయించినట్లుగా జేఈఈ, నీట్ పరీక్షలు జరుగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కరోనా భయాలతో అతి ముఖ్యమైన జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేసేందుకు నిరాకరించిందిపరీక్షల వాయిదాని కోరుతూ 11 మంది విద్యార్థులు వేసిన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ‘కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిందే. మరో ఏడాది కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవచ్చు. కావునసెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు
Sunday, 16 August 2020
తెలంగాణ లో డిజిటల్ తరగతులు వాయిదా!
By . at August 16, 2020
No comments
తెలంగాణలో రేపటి నుంచి దూరదర్శన్, టిశాట్ ఛానళ్లలో ప్రారంభం కానున్న ఇంటర్ డిజిటల్ తరగతులు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తామని పేర్కొంది కాగా ఆగస్టు 17 నుండి ఇంటర్, 20 నుండి 6th -10th, సెప్టెంబర్ 1నుండి 3rd -5th తరగతులకు డిజిటల్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే
Saturday, 15 August 2020
ధోనీతో పాటు రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై!
By . at August 15, 2020
No comments
పెద్ద తల ధోనీతో పాటు చిన్న తల రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు 2005లో అంతర్జాతీయ తొలి వన్డే మ్యాచ్ ఆడిన రైనా చాలా సందర్భాల్లో జుట్టుకు ఉపయోగపడే స్కోర్ చేశాడు భారత జట్టులో ఒక మంచి ఫీల్డర్ గా ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు సాధించాడు కానీ గత రెండేళ్లుగా జట్టులో స్థానం కోల్పోయాడు ఇక ఇప్పుడు ధోని రిటైర్మెంట్ ప్రకటించడం తో తాను కూడా రిటైర్మెంట్ ప్రకటించారు అటు ధోని ఇటు రైనా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
Wednesday, 12 August 2020
ఆందోళనకరంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
By . at August 12, 2020
No comments
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది వారి కుమారుడు అభిజిత్ ముఖర్జీ తెలిపిన వివరాల ప్రకారం ఆయన సోమవారం రోజున న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్& రిఫరల్ హాస్పిటల్లో మెదడులో రక్తం గడ్డకట్టడం తో ఆపరేషన్ నిమిత్తం చేరారు అంతేకాకుండా అతనికి కోవిడ్19 పాజిటివ్ గా ఉన్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు
ఈనెల 20 నండి దోస్త్ దరఖాస్తులు
By . at August 12, 2020
No comments
రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల ప్రవేశం కోసం ఈనెల 20 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు దోస్త్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు స్వీకరణకు సెప్టెంబర్ నెలాఖరు వరకు గడువు విధించే అవకాశాలు ఉన్నాయి అక్టోబర్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు ఈ మేరకు పూర్తి షెడ్యూల్ రెండు మూడు రోజులు విడుదలకు చర్యలు తీసుకుంటామని దీనిపై దోస్త్ కమిటీ మరోసారి సమావేశం అవుతుందని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు
Friday, 7 August 2020
కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది
By . at August 07, 2020
No comments
కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది ఎయిర్ ఇండియా కు చెందిన విమానం అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుండి రన్ వే పై కుప్పకూలింది దీనిలో దాదాపు 191 ప్రయాణికులు ప్రయాణిస్తుండగా 16 మంది మృతి చెందారని సమాచారం 131 మంది గాయాల పాలయ్యారు ఈ విమానం దుబాయ్ నుండి కేరళకు వచ్చిందని ల్యాండ్ అయ్యే సమయంలో కుప్పకూలింది అని సమాచారం
Wednesday, 5 August 2020
2019- సివిల్ సర్వీసెస్ ఫలితాలను విడుదల చేసిన యూపీఎస్సీ
By . at August 05, 2020
No comments
ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల తాజా ఫలితాల్లో 829 మంది విజయం సాధించారు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన 2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో హర్యానాకు చెందిన ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంక్ సాధించారు ఢిల్లీకి చెందిన జతిన్ కిషోర్ ద్వితీయ, ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రతిభ వర్మ తృతీయ స్థానాల్లో నిలిచారు మహిళల్లో ప్రతిభ వర్మ అగ్రస్థానంలో నిలవడం విశేషం 15 రోజుల్లో అభ్యర్థుల మార్కులను వెబ్ సైట్ లో ఉంచునట్లు యూపీఎస్సీ స్పష్టం చేసింది తెలంగాణ, ఏపీ నుండి సుమారుగా 50 మంది ఎంపికవ్వడం విశేషం
Tuesday, 4 August 2020
విద్యార్థుల కు గుడ్ న్యూస్:త్వరలోనే 'ప్రజ్ఞత' పేరుతో వీడియో పాఠాలు
By . at August 04, 2020
No comments
కేంద్ర ప్రభుత్వం 'ప్రజ్ఞత' పేరుతో
ఆన్లైన్, డిజిటల్ విద్య పై రూపొందించిన. మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం టైం టేబుల్ సిద్ధం చేస్తుంది
TS లో ఆగస్టు 15 నుండి 6 వ తరగతి నుంచి10 వ తరగతి విద్యార్థులకు వీడియో పాఠాలు ప్రసారం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే 900 పైచిలుకు డిజిటల్ పాఠాలను రూపొందించగా టిశాట్,దూరదర్శన్ యాదగిరి చానళ్ల ద్వారా పాఠాలు ప్రసారం చేయనుంది
-Sai
Friday, 10 July 2020
సంపద లో అపర కుబేరుడు బఫెట్ ను వెనక్కి నెట్టిన ముఖేష్ అంబానీ
By . at July 10, 2020
No comments
భారత కుబేరుడు ,ఆసియా లోనే అత్యధిక దన వంతుడు ముఖేశ్ అంబానీ,అమెరికా పెట్టుబడుల కుబేరుడు వారెన్ బఫెట్ ను సంపదలో వెనక్కి నెట్టి ప్రపంచ కుబేరుల జాబితాలో 8 వ స్థానం లో నిలిచాడు.బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ సంస్థ
ముఖేశ్ అంబానీ ఆస్తి విలువ 68.3బిలియన్ డాలర్లు,అంటే 5.12 లక్షల కోట్లు,కాగా బఫెట్ సంపద 67 బిలియన్ డాలర్లు.కాగా ప్రపంచం లో నే అత్యంత ధనవంతుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. (188బి.),తర్వాత బిల్ గేట్స్(115బి),బెర్నార్డ్ ఆర్నాల్డ్(92.8),మార్క్ జుకర్ బర్గ్(92.7) లు తర్వాతి స్థానాల లో ఉండగా,ముఖేశ్ అంబానీ 8వ స్థానం,బఫెట్ 9 వ స్థానాలలో ఉన్నారని బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ సంస్థ తెలిపింది.
Thursday, 9 July 2020
కరోనా వాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వ వివరణ :రాజీ పడబోం
By . at July 09, 2020
No comments
కరోనా వాక్సిన్ ఆగస్ట్ 15 వరకు వస్తుందని భారత ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్ మరియు భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాక వెలువడిన అనేక విమర్శల అనంతరం ..కేంద్ర ఆరోగ్య శాఖ ..వివరణ ఇచ్చింది.వాక్సిన్ పనితీరుని పూర్తిస్థాయిలో పరీక్షించాకే విడుదల చేస్తామని,ఇందులో ఎలాంటి తొందర పాటు చర్య ఉండబోదని ప్రకటించింది.క్లినికల్ ట్రయల్స్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయితేనే వాక్సిన్ ని విడుదల చేస్తామని ఇందులో ఏ మాత్రం రాజీ పడబోమని,ఆగస్ట్ 15 వరకు వస్తుందనే విషయం ఇప్పుడే చెప్పలేం అని ప్రకటించింది.
"జూమ్" చైనా సంస్థ కాదు : ఇది అమెరికన్ యాప్
By . at July 09, 2020
No comments
కరోనా వల్ల ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించడం వల్ల ,దాదాపు అన్ని ప్రభుత్వాలు,ఆన్ లైన్ క్లాస్ ల పై ఆధార పడ్డ విషయం అందరికి తెల్సిందే..అయితే ఈ కాలం లో అందరికీ ఎంతో ఉపయోగపడిన ,యాప్ జూమ్ యాప్.సిస్కో వెబ్ ఎక్ష్ ,గూగుల్ మీట్ వంటి యాప్ లు ఉన్నప్పటికీ ,వీటి అన్నిటికన్నా ఎక్కువ ప్రాచుర్యం పొందిన యాప్ .."జూమ్ " అయితే ఇప్పటి వరకు అందరూ కూడా ఈ యాప్ చైనీస్ కంపనీ అని అపోహ పడ్డారు.కానీ నిజానికి ఈ కంపనీ అమెరికన్ కంపనీ అట ..ఆ సంస్థ అమెరికా లోని క్యాలి ఫోర్నియాలోని శాన్ జోన్స్ నగరం లో ప్రారంభం అయిందట..ఈ విషయాన్ని"జూమ్" ఇంజినీరింగ్, ప్రాడక్ట్స్ అధ్యక్షుడు వెల్చామి శంకరలింగం తెలిపారు.అయితే ఈ సంస్థ సీయీవో పేరు ఎరిక్ ఎస్ యువాన్ ,అతను చైనా మూలాలు ఉన్న వ్యక్తి.అందువల్ల నె అందరూ ఈ కంపనీ చైనా కంపనీ అని అపోహపడ్డారని అతడు తెలిపాడు.
తెలంగాణా లో ఇంటర్ ఫెయిల్ అయిన వారికి శుభవార్త : సప్లిమెంటరీ పరీక్షలు రద్దు
By . at July 09, 2020
No comments
తెలంగాణా రాష్ట్ర విద్యా శాఖ ,ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలను రద్దు చేసింది.కరోనా వైరస్ ప్రభావం రాను రాను తీవ్రం కావడం తో ,ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు తెలంగాణా రాష్ట్ర విద్య శాఖ మంత్రి ఈ విషయాన్ని తెలియజేశారు.ఇక ఈ పరీక్ష రద్దు చేయడంతో ,ద్వితీయ సంవత్సరం పూర్తయ్యి..ఫెయిల్ అయిన విద్యార్థులను అందరినీ కంపార్ట్ మెంటల్ పాస్ చేయనున్నట్టు మంత్రి తెలిపారు.దీనివల్ల 1.47 లక్షల విద్యార్థులు లబ్ది పొందుతారు.ఈ మెమోలు ..జూలై 31 నుండి ఆయా కళాశాల లలో అందుబాటు లోకి వస్తాయి.అయితే ఇప్పటికే రీ వాల్యూయేషన్ కట్టిన వారి పలితాలు 10 రోజుల తర్వాత వెల్లడవుతాయి.
www.paatshaalaindia.blogspot.com
Friday, 13 March 2020
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం DA పెంపు
By . at March 13, 2020
No comments
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తీపికబురు అందించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర పెన్షనర్లకు 4శాతం డీఏను పెంచుతూ శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెంచిన డీఏను ఈ నెల నుంచి చెల్లిస్తామని కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
Central Government has today announced a 4% Dearness Allowance (DA) hike for the central government employees and pensioners. This 4 per cent DA hike will become applicable for the central government employees and pensioners from 1st January 2020, which means when the March 2020 salary and pension will be credited into the respective beneficiaries' accounts, they will get two months arrears (January and February) as well. This central government's decision will aid around 35 lakh existing central government employees while 25 central government pensioners.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర పెన్షనర్లకు 4శాతం డీఏను పెంచుతూ శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెంచిన డీఏను ఈ నెల నుంచి చెల్లిస్తామని కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
Central Government has today announced a 4% Dearness Allowance (DA) hike for the central government employees and pensioners. This 4 per cent DA hike will become applicable for the central government employees and pensioners from 1st January 2020, which means when the March 2020 salary and pension will be credited into the respective beneficiaries' accounts, they will get two months arrears (January and February) as well. This central government's decision will aid around 35 lakh existing central government employees while 25 central government pensioners.
Tuesday, 18 February 2020
తెలంగాణ లో ఎంసెట్ -2020 నోటిఫికేషన్ విడుదల
By . at February 18, 2020
No comments
తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ 2020
నోటిఫికేషన్ విడులైంది.ఈ మేరకు JNTU మరియు సాంకేతిక విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.Telangana State Engineering , Agricultural and Medicine Common Entance Test(EAMCET) గా పిలవబడే ఈ పరీక్ష ను JNTUH నిర్వహిస్తుంది.ఈ పరీక్ష కేవలం ONLINE లోనే రాయాల్సి ఉంటుంది.అప్లై చేయడానికి ప్రారంభ తేదీ 21 ఫిబరవరి 2020 నుండి మార్చి 30 వరకు.
పూర్తి వివరాలకు వెబ్ సైట్ ను సంద్శించండి
www.eamcet.tsche.ac.in
నోటిఫికేషన్ విడులైంది.ఈ మేరకు JNTU మరియు సాంకేతిక విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.Telangana State Engineering , Agricultural and Medicine Common Entance Test(EAMCET) గా పిలవబడే ఈ పరీక్ష ను JNTUH నిర్వహిస్తుంది.ఈ పరీక్ష కేవలం ONLINE లోనే రాయాల్సి ఉంటుంది.అప్లై చేయడానికి ప్రారంభ తేదీ 21 ఫిబరవరి 2020 నుండి మార్చి 30 వరకు.
పూర్తి వివరాలకు వెబ్ సైట్ ను సంద్శించండి
www.eamcet.tsche.ac.in
Monday, 17 February 2020
Wednesday, 12 February 2020
UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2020:నోటిఫికేషన్ విడుదల
By . at February 12, 2020
No comments
దేశం లోనే అత్యున్నత ప్రభుత్వ సర్విస్ లకు అభ్యర్థుల ను ఎంపిక చేసే ప్రతిష్టాత్మక UPSC సివిల్ సర్వీసెస్ -2020 నోటిఫికషన్నోటిఫికషన్ విడుదల అయ్యింది.
ఈ సారి మొత్తం 796 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కి కూడా ఇదే ఉమ్మడి నోటిి ఫికేషన్
ఈ పరీక్షకు అప్లై చేయడానికి ఈ రోజు నుండి మొదలు , కాగా
చివరి తేదీ మార్చి 3, 2020.
పరీక్ష జరిగే తేదీ.. మే 31,2020
అర్హత:డిగ్రీ మరియు ఫైనల్ ఇయర్ విద్యార్థులు
వయస్సు: ఆగస్టు 1 2020: నాటికి
32 సంవత్స రాలు దాట కూడదు(OBC- 35; SC,ST- 37)
ATTEMPTS: జెనరల్ అభ్యర్థులకు 6
OBC : 9;SC,ST-నో లిమిట్.
ముఖ్య మైన టేబుల్స్:
మెయిన్స్ విధానం:
పూర్తి వివరాలకు అఫిషియల్ website
www.upsc.gov.in ని సందర్శించండి
ఈ సారి మొత్తం 796 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కి కూడా ఇదే ఉమ్మడి నోటిి ఫికేషన్
ఈ పరీక్షకు అప్లై చేయడానికి ఈ రోజు నుండి మొదలు , కాగా
చివరి తేదీ మార్చి 3, 2020.
పరీక్ష జరిగే తేదీ.. మే 31,2020
అర్హత:డిగ్రీ మరియు ఫైనల్ ఇయర్ విద్యార్థులు
వయస్సు: ఆగస్టు 1 2020: నాటికి
32 సంవత్స రాలు దాట కూడదు(OBC- 35; SC,ST- 37)
ATTEMPTS: జెనరల్ అభ్యర్థులకు 6
OBC : 9;SC,ST-నో లిమిట్.
ముఖ్య మైన టేబుల్స్:
మెయిన్స్ విధానం:
ముఖ్య సమాచారం
పూర్తి వివరాలకు అఫిషియల్ website
www.upsc.gov.in ని సందర్శించండి
Sunday, 2 February 2020
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో నే 4% DA పెంచనున్న ప్రభుత్వం.
By . at February 02, 2020
No comments
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే 4%DA పెంచ నున్నట్లు ఒక ఉన్నతాధికారి 'సేన్ టైమ్స్' అనే ఆంగ్ల పత్రిక లో తెలిపారు.ఇప్పటివరకు 17% గా ఉన్న కరువు భత్యం 21% గా పెరగనుంది.దీనివల్ల 49.93 కేంద్ర ఉద్యోగులు,65.26% పెన్షనర్స్ లబ్ధి పొందుతారు.ఇది జనవరి 1 2020నుండి అమలులోకి రానుంది.
ద్రవ్యోల్బణాన్ని జనవరి 1, 2019 నుండి 31 డిసెంబర్ 2019 వరకు లెక్కగట్ట గా 4.33 అని తేలింది.కాబట్టి 4%ప్రకటించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు తెలిసింది.ఈ పెరుగుదల ప్రకటన ఫిబ్రవరిఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఉంటుందని ఆ అధికారి తెలిపారు
(సేన్ టైమ్స్ సౌజన్యం తో)
Saturday, 18 January 2020
Tuesday, 14 January 2020
తెలంగాణా గురుకుల డిగ్రీ కళాశాల లలో ప్రిన్సిపాల్ పోస్టుల కు నోటి ఫి కేషన్ విడుదల.
By . at January 14, 2020
No comments
తెలంగాణా రాష్ట్రం లోని గురుకుల డిగ్రీ డిగ్రీ కళాశాల లలోప్రిన్సిపాల్ పోస్టులను ,డైరెక్టు నియామక పద్దతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ ను తెలంగాణా రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ వారు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 19 పోస్టులు ఉన్నాయి.
అప్లికేషన్ ప్రారంభ తేదీ -23/1/2020
చివరి తేదీ-19/2/2020
విద్యార్హతలు:ఏదైనా సబ్జెక్ట్ లో పీజీ తో పాటు PhD తప్పని సరి మరియు కనీసం 5 సంవత్సరాల డిగ్రీ అధ్యపకుడిగా భోదనానుభవం..
పూర్తి వివరాలకై
www.treirb.telangana.gov.in and www.treirb.net
వెబ్సైట్ ను సందర్శించండి




















