Wednesday, 22 May 2019

రీశాట్-2బీఆర్1 ఉపగ్రహాన్ని విజయవంతం గా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన PSLV-C46 : ఇస్రో మరో అద్భుత విజయం


దేశ రక్షణ కు ,ప్రకృతి విపత్తుల నివారణకు, అటవీ, వ్యవసాయ రంగాల్లో ఉపయోగపడే ఉపగ్రహం రీశాట్-2బీఆర్1 ను నిన్న 5.30 గంటలకు PSLV-C46  వాహక నౌక ద్వారా  ఏపీ లోని నెల్లూరు జిల్లా లోని శ్రీహరి కోట నుండి ఇస్రో విజయవంతం గా ప్రవేశ పెట్టింది. శ్రీహరి కోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రవేశ పెట్టారు. ఈ ఉపగ్రహం బరువు 615 కిలోలు.దీన్ని 555 కి.మీ .ఎత్తులోని,కక్ష్య లో ప్రవేశ పెట్టడానికి 15 నిమిషాల 29 సెకన్ల సమయం పట్టింది.ఇది అత్యాధునిక కృత్రిమ రాడార్ ఇమేజింగ్ ,భూ పరిశీలన ఉపగ్రహం. దీని కాల పరిమితి 5 ఏళ్ళు. దేశ సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఇది సులభంగా పసిగడుతుంది.వాతావరణం పరిస్థితులను చాలా ఖచ్చితమైన ఫోటో లను ఇది తీయగల్గుతుంది.దీనిలో వాడిన ప్రాసెసర్ పేరు 'విక్రమ్'.

మరిన్ని వార్తల కొరకు సందర్శించండి...
www.paatshaalaindia.blogspot.com

ఎడ్ సెట్ హాల్ టికెట్లు నేటి నుండి వెబ్ సైట్ లో అందుబాటు.


తెలంగాణలో బీఈడీ ప్రవేశ పరీక్ష ఎడ్ సెట్ రాసే అభ్యర్థులు నేటి నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఎడ్ సెట్ కన్వీనర్ మృణాళిని తెలిపారు.దీనికోసం అభ్యర్థులు ఎడ్ సెట్ వెబ్ సైట్ www.edcet.tsche.ac.in   నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. కాగా ఎడ్ సెట్ పరీక్ష ఈ నెల 31 వ తేదీన జరుగనుంది.ఉదయం సోషల్ ,ఇంగ్లీష్,ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ లు, మధ్యాహ్నం,బయో సైన్స్,మాథ్స్ సబ్జెక్టు లకు   పరీక్షలు జరుగుతాయి.నిమిషం ఆలస్యం నిబంధన ఉంది.ఈ పరీక్షను 52,380 మంది రాయబోతున్నారు.మొత్తం 83 కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుంది.

డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాల ప్రక్రియ నోటిఫికేషన్ (DOST)విడుదల:


ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు,  డిగ్రీ లో ప్రవేశాల కోసం ‘దోస్త్‌’ (Degree online Services ,Telangana-DOST)నోటిఫికేషన్‌ విడుదలైంది.  ఈ నోటిఫికేషన్ ను దోస్త్ కమిటీ బుధవారం సాయంత్రం ప్రకటించింది.
ఈ ప్రక్రియ 3  దశలలో పూర్తి కానుంది.
ఈ ప్రక్రియ 1ఈ నెల 23 నుండి వచ్చే నెల 29 వరకు కొనసాగుతుంది. జులై 1 నుండి తరగతులు ప్రారంభం అవుతాయి.

ఆన్‌లైన్‌  ప్రవేశాలకు సంబంధించిన ముఖ్య విషయాలు.

ప్రతి అభ్యర్థి తన ఆధార్ నంబర్ ని మొబైల్ తో లింక్ చేసుకోవాలి.

 ఈ నెల 23 నుంచి జూన్‌ 3 వరకు దోస్త్‌ రిజిస్ట్రేషన్లు

 ఈ నెల 25 నుంచి జూన్‌ 3 వరకు  వెబ్‌ ఆప్షన్లకు అవకాశం

 జూన్‌ 10 వరకు మొదటి విడత సీట్ల కేటాయింపు

జూన్‌ 10 నుంచి జులై 15 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు

 జూన్‌ 20న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

 జూన్‌ 20 నుంచి 26 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు

జూన్‌ 29న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

 జులై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం