Saturday, 11 May 2019

ఎంసెట్ 2019 ప్రాథమిక కీ విడుదల


TS ఎంసెట్ కీ ని JNTU విడుదల చేసింది.ఇది ప్రాథమిక కీ మాత్రమే.కీ తో పాటు విద్యార్థుల రెస్పాన్స్ షీటు మరియు మాస్టర్ ప్రశ్న పత్రం లను కూడా వెబ్ సైట్ లో ఉంచింది.ఈ కీ ద్వారా విద్యార్థులు తమ స్కోర్ ను తెలుసుకోవచ్చు.ఒకవేళ కీ లో ఏవైనా తప్పులు, గానీ కీ పై న ఏమైనా అభ్యంతరాలు ఉంటే విద్యార్థులు తమ అభ్యంతరాన్ని వెబ్సైట్ లో ఇచ్చిన లింక్ ద్వారా తెలుప వచ్చు.
Telangana State Engineering ,Agriculture and Medical Common Entrance Test లేదా TS EAMCET  ను JNTU హైదరాబాద్  తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరుపున  నిర్వహిస్తుంది.

Friday, 10 May 2019

ఇంటర్ తొలి విడత అడ్మిషన్స్ ఈ నెల 14 నుండి.


రాష్ట్రం లోని ఇంటర్ కళాశాలలో చేరడానికి ఈ నెల 21 వ తేదీ నుండి జూలై 1 వరకు  అప్లై చేసుకోవచ్చని ఇంటర్ కార్య దర్శి అశోక్ పేర్కొన్నారు.ఇది మొదట విడత ప్రక్రియ.రాష్త్రం లోని ఇంటర్ కాలేజీలు,గురుకుల కకలెజెలు ,ప్రైవేటు కాలేజీలు,అన్నింటికీ ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది.జూన్ 1 వ తేదీ నుండి ఇంటర్ తరగతులు ప్రారంభమవుతాయి. రెండో విడత షెడ్యూల్ మొదటి విడత పూర్తయిన  తర్వాత ప్రకటిస్తారు.ప్రతీ కళాశాలలో ఒక సెక్షన్ కి గరిష్టంగా 88 మంది విధ్యార్థులనే    తీసుకోవాలి. ప్రతీ విద్యార్ధి తమ ఆధార్ నంబర్ ని సమర్పించాలి.రాష్త్రం లోని గుర్తింపు పొందిన కళాశాలలోనే చేరాలి.వీటి వివరాలు ఇంటర్ వెబ్ సైట్ లో నుండి పొంద వచ్చు.

ఈ నెల 14 నుండి పాలీ సెట్ కౌన్సెలింగ్:పూర్తి సమాచారం



రాష్ట్రంలో ని పాలీ టెక్నిక్ కళాశాలలో 2019-20 విద్యా సంవత్సరానికి పాలీటెక్నీక్ కళాశాల ల లో ప్రవేశాలకు ఈ నెల 14 నుండి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు,ఉన్నత విద్యా కమిషనర్ శ్రీ నవీన్ మిట్టల్ తెలి పారు.
ఈ సారీ విద్యార్థులు ఈ నెల 15-18 వ తేదీల మధ్య  తమకు వీలైన తేదీలను ఎంచుకుని  గంటకు ఒక స్లాట్ చొప్పున సమయాన్ని ఎంచుకుని ధ్రువపత్రాల వెరిఫికేషన్ కు హాజరు కావచ్చు. దీని షెడ్యూల్  ఇలా ఉంది.
14 వ తేదీ: ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ఫీ చెల్లింపు,స్లాట్ బుకింగ్
15 వ తేదీ నుండి 19: వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం
19 వ తేదీన:ఇచ్చిన ఆప్షన్ లను ఫ్రీజింగ్ చేయడం.
22 వ తేదీ :సీట్ల కేటాయింపు
23-25 వ తేదీ వరకు:ట్యూషన్ ఫీ చెల్లింపు,కళాశాల ల లో చేరుతామని వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్.
జూన్ 1 నుండి :కళాశాలలు ప్రారంభం.
గత ఏడాది ఈ రాంక్ కి ఎక్కడ సీట్ వచ్చిందో తెలిపే సమాచారాన్ని   www.polycetts.nic.in  వెబ్సైట్ లో ఉంచారు.
రాంక్ కార్డు,ఆధార్,టెన్త్ మెమో,4-10 స్టడీ సర్టిఫికెట్స్,టీసీ, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్, ధృవపత్రాల పరిశీలనకు తీసుకెళ్లాలి.
రాష్ట్రంలో ఈ సారి  మొత్తం 162 పాలీటెక్నీక్ కళాశాల లలో అడ్మిషన్ లు ఇస్తారు.ఇందులో 56 ప్రభుత్వ,105 ప్రైవేట్ ,ఒకే ఒక ఎయిడెడ్ కళాశాల ఉన్నాయి.

ఈ నెల 13 న పదవ తరగతి ఫలితాలు


తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 13 వ తేదీన విడుదల చేస్తారని విద్యా శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ తెలిపారు.వీటిని 13 న ఉదయం 11.30 నిమిషాలకు విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి విడుదల చేస్తారు.మొత్తం 5.06 లక్షల విద్యార్థులు  మార్చి,ఏప్రిల్ లో పరీక్ష రాశారు.
ఫలితాలను  క్రింది వెబ్సైట్ లలో చూసుకోవచ్చు.
www.bse.telangana. gov. in
results.cgg.gov.in
www.eenadu.net
www.eenaduprathibha.net
www.manabadi.com
www.news18.com
www.jagaranjosh.com

Monday, 6 May 2019

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పాటకు జెన్నిఫర్ లోపేజ్ ఫిదా: .." వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ వరల్డ్ ఫైనల్ " లో అదరగొట్టిన గబ్బర్ సింగ్ పాట

" వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ వరల్డ్ ఫైనల్   "  అనే  ఫేమస్   అమెరికన్ డ్యాన్స్ ప్రోగ్రాం లో ఫైనలిస్ట్ లు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "సర్దార్ గబ్బర్ సింగ్ " సినిమాలోని పాటను  ఒక వీరోచిత ఫైట్ రూపం లో ప్రదర్శించారు.ఈ ప్రోగ్రాం కి జడ్జ్ గా వచ్చిన హాలీవుడ్ ఆండాల తార ,సింగర్ , జెన్నిఫర్ లోపేజ్ ఫిదా ఐపాయింది.ఈ ప్రదర్శన తర్వాత డ్యాన్సర్ లను ఎంతో మెచ్చుకుంది.ఇప్పుడు ఈ వీడియో ఇంటర్ నెట్ ను షేక్ చేస్తుంది....మీరూ ఒక సారి చుడండి..