Saturday, 26 January 2019

ఆస్త్రేలియన్ ఓపెన్ విజేత నవోమీ ఒసాకా : నెంబర్ వన్ స్థానం కైవసం.


మొట్ట మొదటి ఆసియన్ గా చరిత్ర లిఖించిన నవోమీ:


ఆస్త్రేలియన్ ఓపెన్ మహిళ ల సింగిల్స్   ఫైనల్లో ,హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో చివరికి జపాన్ యువ సంచలనం నవోమీ ఒసాకా ,చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి ,పెట్రా క్విటోవా పై  చెమటోడ్చి నెగ్గింది.సుమారు రెండు గంటల 27 నిమిషాల   పాటు సాగిన ఫైనల్లో, ఒసాకా విజయం సాధించింది.ఆమె 7-6,5-7,6-4 స్కోరు తో విజయం సాధించింది.గత ఎద్కాది యూఎస్ ఓపెన్  ఫైనల్లో సెరీనా పై నెగ్గినప్పుడు ,ఎదో యాదృచ్చికంగా అలా జరిగి ఉంటుంది అని అనుకున్న వారికి ,ఈ విజయం తో ఒసాకా సమాధానం చెప్పినట్లయింది.దీంతో ఏటీపీ ర్యాంకింగ్స్ లో ఆమె ఒకటో ర్యాంకును సొంతం చేసుకుంది.ఈ ఘనత సాధించిన తొలి ఆసియన్ గా చరిత్ర సృష్టించింది.అంతేకాకుండా నెంబర్ వన్ ర్యాంకును చేరుకున్న అతి పిన్న వయస్కులలో రెండో వ్యక్తి ఒసాకా(21 ఏళ్ల 104 రోజులు ).గతం లో కరోలిన్ వోజ్నియాకి అతి చిన్న వయసులో ఈ ఫీట్ సాధించింది.(20 ఏళ్ల 92 రోజులు )  

మెన్స్ సింగిల్స్ ఫైనల్లో దిగ్గజాల పోరు.
పురుషుల సింగిల్స్ లో సెర్బియా స్టార్   నోవాక్ జేకోవిచ్ , స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ల మద్య ఈ రోజు జరుగబోవు ఫైనల్ చాలా రసవత్తరంగా జరగబోతుంది.

సుప్రీం కోర్టు తీర్పు తో విశ్వ విద్యాలయాల్లో అద్యాపకుల భర్తీకి మార్గం సుగమం


అద్యాపకుల భర్తీ లలో యూనివర్సిటీ యే రిజర్వేషన్ లకు ప్రాతిపదిక గా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తిరస్కరించింది.గతం లో UGC నిబంధనల ప్రకారం,యూనివర్సిటీ ల  లో అద్యాపకుల భర్తీకి యూనివర్సిటీ మొత్తాన్ని రిజర్వేషన్ ల కు ప్రాతిపదికగా ఉండేది.అయితే ,దీన్ని సవాలు చేస్తూ BHU కి చెందిన వివేకానంద తివారీ అలహాబాద్ హైకోర్టు లో ,పిటిషన్ దాఖలు చేయగా , రిజర్వేషన్ లు అనేవి డిపార్టుమెంటు ప్రాతిపదికగా ఉండాలి   , అని  2015  ఏప్రిల్ 7 న తీర్పు ఇచ్చింది.  వేసింది.దీని పై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు లో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది.దీని పై సుప్రీం స్పందిస్తూ అలహా బాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.ఒక అద్యాపకుడు మరో సబ్జెక్టు లో పాఠాన్ని ఎలా బోధించడం వీలు కాదో ,అలాగే ,ఒక డిపార్టుమెంట్ లోని రిజర్వేషన్ ని ,మరొక డిపార్టుమెంట్ లో వర్తించడం వీలు కాదని తీర్పునిచ్చింది.దీనితో ఇన్నాళ్ళుగా  ఆగి పోయిన  , యూనివర్సిటీ అద్యాపకుల భర్తీ  ఇక తిరిగి ప్రారంభం కానుంది.త్వరలోనే మళ్ళీ ప్రక్రియ మొదలు కావచ్చు.అయితే దీని పై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ తీర్పువల్ల రిజర్వుడు అభ్యర్థులు నష్ట పోతారని అంటున్న్నారు.ఎందుకంటే ఒక దేపార్టు మెంటు లో ఒకే పోస్టు ఖాళీగా ఉన్నప్పుడు ,అది ఓపెన్ కేటగిరీ అయితే మిగితా ,కేటగిరీ అభ్యర్హులు నష్టపోతారని అంటున్నారు. 

వివిధ సబ్జెక్ట్ ల లో లెక్చరర్ పోస్టుల తుది ఫలితాలను ప్రకటించిన tspsc



తెలంగాణా గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టులకు నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్ పీఎస్సీ) ప్రకటించింది. ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థుల సాధించిన మార్కుల వివరాలను తమ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచింది.
బొటనీ, కామర్స్, మైక్రో బయాలజీ, జువాలజీ, సోషియాలజీ, తెలుగు సబ్జెక్టులకు సంబంధించి 255 పోస్టులకు
 టీఎస్ పీఎస్సీ ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ పూర్తిచేసింది. 

Friday, 25 January 2019

'పద్మ' అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా దేశ అత్యున్నత అవార్డులు అయిన 'పద్మ' అవార్డులను ప్రకటించింది. మన  రాష్ట్రం నుండి  సినీ గేయ రచయిత 'సిరివెన్నెల'సీతారామశాస్త్రి మరియు ఫుట్ బాల్ క్రీడాకారుడు సునీల్ చెత్రి, వాటి వివరాలు.




గణతంత్ర వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ ఫోస దంపతులు


హాస్టల్ వెల్ ఫేర్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వెబ్ ఆప్షన్ లు రద్దు:



హాస్టల్ వెల్  ఫేర్  ఆఫీసర్ల భర్తీ కి సంబంధించి tspsc నిర్వహించిన పరీక్ష లో ఎంపికైన SC, ST, BC  ఏజెన్సీ ప్రాంత      అభ్యర్థులు , సరైన కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించక పోవడం వల్ల వారు ఇంతకు ముందు  ప్రిఫరెన్స్ ఆఫ్ ప్లేస్ కి సంబంధించి ఇచ్చిన వెబ్ ఆప్షన్ లు రద్దు చేస్తున్నట్లు TSPSC కార్యదర్శి శ్రీమతి వాణీ ప్రసాద్ తెలిపారు. కావున అభ్యర్థులు రోసారి వెబ్ ఆప్షన్ లు ఇవ్వాలని ఆమె తెలిపారు.

70 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు



“పాఠశాల” పాఠకులకు మరియు సమస్త భారతావనికి 70 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య భారతదేశం అనేక మతాలు, కులాలు, జాతులు కలిగిన దేశం అయినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అందుకే స్వాతంత్ర్యాన్ని పొందిన తరువాత భారతీయులందరికి సమన్యాయం, సమాన హక్కులు మరియు స్వేచ్ఛ ను అందించటం కోసం 1947 ఆగస్టు 29 న డా. బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా కమిటీ అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలనలోకి తీసుకొని అనేక సవరణలతో పొందుపరిచిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఆ తదుపరి 1950 జనవరి 26 న రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుంటు ప్రతి సంవత్సరం ఈ రోజు జాతీయ జెండాకు వందనం చేస్తూ త్యాగధనులను గుర్తుచేసుకుంటున్న పండుగే మన ఈ గణతంత్రం. అనేక సంవత్సరాల బానిసత్వము నుండి దేశానికి విముక్తి కలిగించి ఈ రోజు మనము పొందుతున్న స్వేచ్ఛ హక్కుల కోసం ఎందరో మరెందరో త్యాగధనులు భావితరాల కోసం విదేశీ తూటాలకు ఎదురుగా నిలిచి రక్తం కారుతున్నా, కొరడా దెబ్బలకు చర్మం పగులుతున్న , ప్రాణాలు పోతున్న ఎంతోమంది తలలు వాల్చితే అందిన ఫలాలు ఇవి. ఈ 70 వసంతాల గణతంత్ర స్వరాజ్యంలో ఎందరో మహానుభావులు దేశకీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల ముందు రెపరెప లాడించిన అద్భుత ఘట్టాలు చాల. ఇంకో వైపు చుస్తే 70 వసంతాల గణతంత్రన్ని ఘనంగా జరుపుకుంటున్న భారతావని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే వుంది. ఆ త్యాగధనుల త్యాగాలను మరచి ప్రస్తుత సమాజం కులం కోసం మతం కోసం స్వార్ధపూరిత రాజకీయాలతో నవభారతం ప్రయాణిస్తుంది. ఆగష్టు 15 మరియు జనవరి 26 న మాత్రమే జెండాకు వందనం చేయకుండా ఇది మాతరం వందేమాతరం అంటూ కుల, మత, స్వార్ధ రాజకీయాలను మాని ఇది నా దేశం ఇవి నా పరిసరాలు సమస్త దేశ ప్రజలు నా సోదరి సోదరీమణులు అనే విశాల దృక్పధంతో ప్రతి భారతీయుడు ఆలోచించిన రోజు మనం వేసే ప్రతి అడుగు చేసే ప్రతి ఆలోచన భావితరాలకు మార్గదర్శకంగా మారినపుడు రోజు గణతంత్రమే ప్రతి రోజు స్వాతంత్య్రమే. జై హింద్.

ప్రణభ్ ముఖర్జీ, భూపేన్ హజారికా , నానాజీ దేశ్ ముఖ్ లకు భారత రత్న

 


భారత ప్రభుత్వం ఈ సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవం సందర్బంగా భారత రత్న అవార్డులను ప్రకటించింది.భారత మాజీ రాష్ట్ర పతి,ఆర్థిక వేత్త శ్రీ ప్రణభ్ ముఖర్జీ, ప్రముఖ కవి గాయకుడు,నటుడు,నిర్మాత భూపేన్ హజారికా(మరణాంతరం),మరియు సామజిక కార్యకర్త నానజీ దేశ్ ముఖ్ అలియాస్ చందికా దాస్ అమృత్ రావ్ దేశ్ ముఖ్ (మరణాంతరం) ల కు దేశానికి వారు చేసిన సేవలకు గుర్తింపు గా దేశ అత్యున్నత పురస్కారం అయిన భారత రత్న అవార్డ్ ను ప్రకటించింది.

పూరీ జగన్నాథ్, రామ్ ల “ఇస్మార్ట్ శంకర్” షూటింగ్ ప్రారంభం


పూరీ జగన్నాథ్ ఇప్పుడు లైం లైట్ లో లేని దర్శకుడు, ఇప్పుడు డిమాండ్ లేని దర్శకుడు కావచ్చు.అతని గత కొన్ని చిత్రాలు సరిగా ఆడకపోయి ఉండొచ్చు. కానీ అతడు ఎపుడు కూడా బ్యాడ్ మూవీ తీయ లేదు.ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది అంతే.అతడు తీసిన బుజ్జి గాడు, నేనింతే,ఏక్  నిరంజన్  దేవుడు చేసిన మనుషులు,పైసా వసూల్ వరకు చూస్తే ఈ సినిమాలు కమర్షియల్ గా క్లిక్ కాలేదు.కానీ ఈ సినిమాలు టీవీ లో వస్తే ఎవ్వరూ వదలకుండా  చూస్తారు.అంతెందుకు ప్రభాస్ తన సినిమాల్లో తనకు బాగా నచ్చిన సినిమాల్లో ‘బుజ్జిగాడు’ అని చెప్తాడు.ఇక విషయానికొస్తే పూరిజగన్నాథ్ త్వరలోనే హీరో  రామ్ తో ఒక కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతు న్నాడు. ఆ చిత్రం టైటిల్ గా ‘ismart shankar’(ఇస్మార్ట్ శంకర్) అని పెట్టాడు.ఈ సినిమా షూటింగ్ నిన్న లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో రామ్ లుక్ పూర్తిగా కొత్త గా ఫుల్ మాస్ గా ఉంది.హెయిర్ స్టైల్ పూర్తిగా కొత్తగా ఉంది.చూస్తుంటే ఈ సినిమా తో పూరి, రామ్ లు ఇద్దరూ మంచి హిట్ కొట్టే లాగే ఉన్నారు.ఈ కార్యక్రమం లో ఛార్మీ పాల్గొన్నది All the best both of you..పూరి &రాం from THRIBHUVANA VIJAYAM.

Thursday, 24 January 2019

త్వరలో 4600 గురుకుల పోస్టుల భర్తీ


తెలంగాణా ప్రభుత్వం 2019-20 విద్యా సంవత్సరం నుండి 119 గురుకులాలను ప్రారంభించబోతుండటం వల్ల వాటికి చాలా పోస్టుల అవసరం ఏర్పడనున్న నేపధ్యంలో, ప్రభుత్వం   4600 పోస్టులు భర్తీ చేయబోతుంది.ఇందులో టీచింగ్ ,నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి.ఈ పోస్టులకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది ప్రభుత్వం.కాబట్టి ఇది నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. కాబట్టి అభ్యర్థుల కు PAATSHAALA శుభాకాంక్షలు....

మహిళా లెక్చరర్ పోస్టుల నియామకాల పై ఉన్న స్టే ఎత్తేసిన హై కోర్టు:ఫలితాలు తుది తీర్పుకు లోబడే .


తెలంగాణా మహిళా గురుకుల  డిగ్రీ కళాశాల లో అద్యాపకుల నియామాకాల పై గతం లో విధించిన స్టే ను ఎత్తి వేసింది.తెలంగాణా మహిళా డిగ్రీ కళాశాలల్లో 546   అద్యాపకుల  పోస్టుల భర్తీ కి tspsc నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించి ,తొలి విడత ఫలితాలు విడుదల చేయగా ,నోటిఫికేషన్ లో BC రిజర్వేషన్ లు 29 % పాటించ లేదని ఒక మహిళా అభ్యర్థి పిటిషన్ వేయడం తో నవంబర్ లో ఈ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించింది.అయితే tspsc ఇచ్చిన వివరణ తో ఏకీభవించిన న్యాయస్థానం ,స్టే ను ఎత్తి వేసింది,అయితే నియామకాలు తుది తీర్పు కు లోబడి ఉండాలని,పొలిటికల్ సైన్స్ లో ఒక పోస్టు ఖాళీగా ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది.దీంతో అద్యాపకుల నియామకాల కు ఉన్న అడ్డంకులు తొలగి పోయాయి.

Wednesday, 23 January 2019

JEE మెయిన్స్ ఫలితాలు విడుదల

JEE మెయిన్ 2019 పరీక్ష తుది కీ  విడుదల అయ్యింది.ప్రాథమిక కీ పై వచ్చిన అభ్యంతరాలను ఆధారంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  వారు ఈ తుది కీ రూపొందించారు.తుది కీ వల్ల చాలా మంది మార్కులు మారి పోయే అవకాశం ఉంది 


Tuesday, 22 January 2019

ఐసీసీ అవార్డులను కొల్ల గొట్టిన కోహ్లీ: రికార్డ్ స్థాయిలో ఐసీసీ వార్షిక అవార్డులకు ఎంపిక

  • అభినవ బ్రాడ్ మన్ కింగ్ కోహ్లీ అవార్డులలో రికార్డ్
  • ఐసీసీ వార్షిక అవార్డు ల లో క్లీన్ స్వీప్


భారత్ క్రికెట్ కెప్టెన్ కింగ్ కోహ్లీ ఈ సంవత్సరం ఐసీసీ వార్షిక అవార్డులను సాధించాడు.2018-19 సంవత్సరానికి గాను,ఉత్తమ వన్డే ,టెస్టు ఆటగాడిగా అవార్డును గెలుచుకొన్నాడు.అంతే కాకుండా ఐసీసీ "క్రికెట్ ఆఫ్ ద ఇయర్" అవార్డు" అయిన సర్ గారీ ఫీల్డ్ సోబర్స్ అవార్డు ను వరుసగా రెండో సంవత్సరం కూడా గెలుచుకొన్నాడు. ఇది ఒక రికార్డ్.ఐసీసీ ' ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ ' రిషబ్ పంత్ గెలుచుకొన్నాడు

Monday, 21 January 2019

డిగ్రీ లో ఆన్ లైన్ కోర్సులు : వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు


  • శ్రీకారం చుట్ట నున్న కళాశాల విద్యా శాఖ 

  • 2019-2020 విద్యా సంవత్సరం నుండి అమలు

  • సిలబస్ రూపకల్పనలో అంబేడ్కర్ వర్సిటీ తో ఒప్పందం

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ కళాశాల విద్యాశాఖ ,త్వరలోనే డిగ్రీ లో ఆన్ లైన్ కోర్సులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.ఈ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేయబోతున్న ట్లు కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.ఇది కేంద్ర ప్రభుత్వ పథకమైన SWAYAM( Study Webs of Active learning for Young Aspiring Minds)  పథకం లో
భాగమైన MOOCS(Massive Open Online Courses )
విధానంలో అందించ బోతున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా ముందుగా సివిల్ సర్వీస్ పరీక్ష కు సన్నద్ధం కావడానికి తోడ్పడే సబ్జెక్టు లను ముందు గా చేర్చబోతున్నారు.ముఖ్యంగా జాగ్రఫీ,సైకాలజీ,పబ్లిక్అడ్మినిస్ట్రేషన్,జియాలజీ,సోషియాలజీ,లిటరేచర్ సబ్జెక్ట్ లను ముందుగా ఆన్ లైన్ ద్వారా అందించ బోతున్నారు.దీనివల్ల ఒక విద్యార్థి ,తన రెగులర్ డిగ్రీ సబ్జెక్ట్ ల కు అదనంగా పై సబ్జెక్టు లలో ఏదైనా ఒకటి గానీ అంతకన్నా ఎక్కువ సబ్జెక్టు లను ఆన్ లైన్ లో నేర్చుకుని,ఆన్ లైన్ లో పరీక్ష ఉత్తీర్ణత సాధిస్తే,తన రెగులర్ సబ్జెక్టు మెమో లో ఈ ఆన్ లైన్ సబ్జెక్టు మార్కులు కూడా కలిపి సర్టిఫిగ్ట్ వస్తుంది.ఈ విధానాన్ని అమలు చేయడానికి ఇప్పటికే ,సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్  లకు JNTUH లో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది.

PGT అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన 23 వ తేదీ నుండి



తెలంగాణా గురుకుల విద్యా సంస్థల నియామక మండలి (TREIRB)నిర్వహించిన PGT సాంఘిక శాస్త్రం లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను website లో ఉంచారు.ఎంపికైన వారికి ఈ నెల 23 నుండి ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుందని సంస్థ చైర్మన్ RS. ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు.

Sunday, 20 January 2019

ప్రతీ పౌరుడికీ నెల నెలా జీతం: త్వరలోనే ప్రారంభం..!ఏ రాష్ట్రంలో తెలుసా..?


సార్వత్రిక కనీస ఆదాయ పథకం (UBI-Universal Basic Income) అంటే ప్రతీ పౌరునికి ప్రతీ నెలా కొంత మొత్తం లో సొమ్మును అంద జేయడం ఈ పథకం ఉద్దేశ్యం. ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేయబోతున్న రాష్ట్రం సిక్కిం.దేశం లోని చిన్న రాష్ట్రాల లో ఒకటైన సిక్కిం ఆ రాష్ట్ర పౌరులకు అందరికీ పేద ధనిక తేడా లేకుండా కొంత ఆదాయాన్ని అంద జేస్తామని ప్రకటించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ ఛామ్లింగ్ ఈ మేరకు ఒక ప్రకటనలో భాగంగా ,ముందుగా ఒక ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టి,2022 సంవత్సరం వరకు రాష్ట్రం మొత్తం అమలు చేయనున్నామని తెలిపారు.సిక్కిం రాష్ట్ర జనాభా 6,10,577 కాగా ఈ పథకం ప్రకారం ఒక్కొక్క పౌరుడికీ ఎంత మొత్తంలో ప్రతీ నెలా ఇవ్వగలమో ఆర్థిక వేత్తలతో   సంప్రదింపులు జరుపుతోంది సిక్కిం ప్రభుత్వం.ప్రతీ పౌరుడూ ఆకలితో ,కనీస అవసరాల లేమితో ఇబ్బందులు పడకూడదనే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. చాలా చిన్న రాష్ట్రమైన సిక్కిం చాలా విషయాలలో పెద్ద రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.ఇప్పటికే ఈ రాష్ట్రంలో ప్రతీ పౌరుడికీ ఇల్లు నిర్మించి ఇచ్చింది.98% అక్షరాస్యత ను సాధించింది.దేశ సగటు పేదరికం 30% కాగా సిక్కిం లో 8 % మాత్రమే.ఈ UBI పథకం అమలు జరిగితే ప్రపంచంలో నే దీన్ని  అమలు చేసిన  ఏకైక రాష్ట్రం , సిక్కిం అవుతుంది. ఎన్నో ధనిక దేశాలు సైతం దీనినిమలు చేయడానికి వెనుక

టీఆర్టీ ఫలితాలు విడుదల

Tspsc ,టీఆర్టీ ఫలితాలను విడుదల చేసింది

JEE mains ఫలితాలు విడుదల

JEE మెయిన్స్ లో మెరిసిన తెలుగు తేజాలు