Thursday, 24 January 2019

మహిళా లెక్చరర్ పోస్టుల నియామకాల పై ఉన్న స్టే ఎత్తేసిన హై కోర్టు:ఫలితాలు తుది తీర్పుకు లోబడే .


తెలంగాణా మహిళా గురుకుల  డిగ్రీ కళాశాల లో అద్యాపకుల నియామాకాల పై గతం లో విధించిన స్టే ను ఎత్తి వేసింది.తెలంగాణా మహిళా డిగ్రీ కళాశాలల్లో 546   అద్యాపకుల  పోస్టుల భర్తీ కి tspsc నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించి ,తొలి విడత ఫలితాలు విడుదల చేయగా ,నోటిఫికేషన్ లో BC రిజర్వేషన్ లు 29 % పాటించ లేదని ఒక మహిళా అభ్యర్థి పిటిషన్ వేయడం తో నవంబర్ లో ఈ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించింది.అయితే tspsc ఇచ్చిన వివరణ తో ఏకీభవించిన న్యాయస్థానం ,స్టే ను ఎత్తి వేసింది,అయితే నియామకాలు తుది తీర్పు కు లోబడి ఉండాలని,పొలిటికల్ సైన్స్ లో ఒక పోస్టు ఖాళీగా ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది.దీంతో అద్యాపకుల నియామకాల కు ఉన్న అడ్డంకులు తొలగి పోయాయి.

0 comments:

Post a Comment