Friday, 19 April 2019

నేటి నుండి ఎస్సై రాత పరీక్షలు:ఈ నెల 22 నుండి కానిస్టేబుల్ పరీక్ష హాల్ టిక్కెట్లు


తెలంగాణా రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగానికి తుది రాత పరీక్షలు  ఈ రోజు నుండి ప్రారంభం అవుతాయి.ఇవి శని ,ఆది వారాల్లో జరుగుతాయి.శనివారం ఉదయం 10 am నుండి 1 pm వరకు ,ఆర్థమేటిక్, మెంటల్ ఎబిలిటీ,పరీక్ష మధ్యాహ్నం  2pm నుండి 5 pm వరకు ఇంగ్లీష్ పరీక్ష ,ఆదివారం ఉదయం జనరల్ స్టడీస్, మధ్యాహ్నం తెలుగు పరీక్షలు ఉంటాయి.ఈ పరీక్షల ద్వారా 1217 ఎస్సై పోస్టులు భర్తీ అవుతున్నాయి.
ఇక కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఈ నెల 28 న జరుగుతాయి.వీరికి ఈ నెల 22 నుండి హాల్ టికెట్లు ఇవ్వబడును.హాల్ టికెట్ డౌన లోడ్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే support@tslprb కి మెయిల్ చేయొచ్చు.

సందర్శించండి
www.paatshaalaindia.blogspot.com


Monday, 15 April 2019

టీ ఎస్ ఎడ్-సెట్ అప్లికేషన్ చివరితేదీ పొడిగింపు



తెలంగాణా రాష్ట్రం లో 2019 ఎడ్-సెట్ అప్లికేషన్ తేదీని  ఎటువంటి అపరాధరుసుము లేకుండా అప్లై చేయడానికి ఈ నెల 20 వ తేదీ వరకు పాడించారు.ఇంతకు ముందు ఈ గడువు ఈ నెల 10 వ తేదీ చివరి తేదీ గా ఉండేది.ప్రస్తుతం 500 రూపాయల అపరాధ రుసుము తో 25 వ తేదీ వరకు 1000 రూపాయల అపరాధ రుసుము తో 30 వ తేదీ వరకు, 2000 రూపాయల అపరాధ రుసుము తో వచ్చే నెల 4 వ తేదీ వరకు గడువు గలదు.
డిగ్రీ పూర్తయి టీచర్ ట్రైనింగ్ చేయాలనుకునేవారు ఈ ఎంట్రన్స్ రాయాలి.ఇందులో వచ్చిన రాంక్ ఆధారంగా సీటు కేటాయింపు ఉంటుంది.ఈ సంవత్సరం కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్ష ను నిర్వహిస్తుంది.ఈ పరీక్ష తేదీ 31/05/2019 ఉదయం 11 గంటల నుండి 1 గంటల వరకు మరియు 3 గంటల నుండి  గంటల వరకు .
 కాగా ఈ పరీక్షకు అప్లయ్ చేయడానికి ఫీజ 650 రూపాయలు కాగా ,SC,ST అభ్యర్థులకు 450 రూపాయలు 





తెలంగాణ ఇంటర్ ఫలితాల అఫీషియల్ తేదీ ప్రకటించిన ఇంటర్ బోర్డు


తెలంగాణ లో ఇంటర్ ఫలితాల పై నెలకొన్న సందిగ్ధం తొలగి పోయింది.ఫలితాల పై వివిధ రకాల తేదీల ని నెట్ లో , సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టడం తో ,విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు.ఈ నేపథ్యం లో ఇంటర్ బోర్డు ఈ నెల 18 వ తేదీన ప్రకటించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.దీంతో ఇంటర్ ఫలితాలపై ఊహాగానాలకు తెర పడింది.రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఫలితాల కోసం  ఎదురు చూస్తున్నారు.

ఫలితాల కోసం
www.bie.gov.in సైట్ ను సందర్శించండి.