ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో భాగంగా , రెండో విడత ధ్రువ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల కు ఈ నేల 5 వ తారీఖున ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుందని TSPSC కార్యదర్శి వాణీ ప్రసాద్ తెలిపారు. ఈ ప్రాక్రియ పూర్తి కాగానే వీరికి 6 వ తేదీ నుండి నెహ్రూ జూలాజికర్ పార్క్ లో దేహ ధారుడ్య పరీక్షలు (Physcal tests) నిర్వ హించుతామని తెలిపారు.
Saturday, 2 February 2019
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టు లకు 5 న ధ్రువ పత్రాల పరిశీలన
By . at February 02, 2019
No comments
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో భాగంగా , రెండో విడత ధ్రువ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల కు ఈ నేల 5 వ తారీఖున ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుందని TSPSC కార్యదర్శి వాణీ ప్రసాద్ తెలిపారు. ఈ ప్రాక్రియ పూర్తి కాగానే వీరికి 6 వ తేదీ నుండి నెహ్రూ జూలాజికర్ పార్క్ లో దేహ ధారుడ్య పరీక్షలు (Physcal tests) నిర్వ హించుతామని తెలిపారు.
నేడు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం
By . at February 02, 2019
No comments
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2 వ తేదీ ని ప్రపంచ చిత్తడి నేలల(Wet lands) దినోత్సవం గా జరుపుకుంటారు.వెట్ ల్యాండ్స్ అనేవి లోతు తక్కువ ఉండే నీరు గల ప్రాంతాలు.ఇవి జీవ వైవిద్యానికి(bio diversity) కేంద్రాలు.ఈ ప్రదేశాల లో చాలా జల చర మరియు ఉభయ చర జీవనాన్ని గడిపే మొక్కలు,జంతువులు ఉంటాయి.ఈ చిత్తడి నేలలు ముఖ్యంగా నదీ పరీవాహక ప్రదేశాలు, సముద్ర తీర ప్రాంతాల కు సమీపంగా ఉంటాయి.ఇవి నదుల గుండా వచ్చే కాలుష్య కారక పదా ర్థాలను, తమలో ఇముడ్చు కుంటాయి,సముద్ర భారీ అలల నుండి సునామీ ల నుండి తీర ప్రాంతాలను రక్షిస్తాయి,అదే విధంగా నదుల వరదల నుండి ,కాపాడుతాయి.అయితే మానవుడు తన ఆవాసాల కోసం ఇలాంటి చిత్తడి నేలల ను పూడ్చి గృహాలు నిర్మించుట వల్ల చిత్తడి నేలలు కనుమరుగు అవుతున్నాయి.దీనికి మంచి ఉదాహరణ ముంబై ,కోల్ కత వంటి నగరాలు.దీని వల్ల బయో డైవర్సిటీ తీవ్రంగా నష్టపోతుండటం వల్ల 1971 ఫిబ్రవరి 2 వ తారీఖు న ఇరాన్ దేశం లోని రాంసార్ పట్టణంలో చిత్తడి నేలల సంరక్షణకు ఒక సదస్సు జరిగింది.దీనిలో అన్ని దేశాలు చిత్తడి నేలలను రక్షించడానికి అంగీకరించాయి.అప్పటి నుండి ఫిబ్రవరి 2 వ తారీఖు ను అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవం గా జరుపుకుంటున్నారు.
Friday, 1 February 2019
బడ్జెట్ 2019 ముఖ్యాంశాలు
By . at February 01, 2019
No comments
ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి ఆధ్వర్యం లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ - 2019 ను కేంద్ర తాత్కాలిక ఆర్ధిక మంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అరుణ్ జైట్లీ కి అనారోగ్యం కారణంగా, ఆర్ధిక మంత్రి హోదాలో ఆయన తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.- ఆదాయపు పన్ను పరిమితి రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు
- స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలకు పెంపు
- ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే రూ.6.5 లోపు ఆదాయపు పన్ను మినహాయింపు
- వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా భారత్
- 2030 కల్ల ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగంలో భారత్‌దే అగ్రస్థానం
- రానున్న 8 ఏళ్లలో 10 ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్ధిక వ్యవస్థ
- నల్ల ధనాన్ని అరికట్టేందుకు చేసిన దాడుల్లో 50 వేల కోట్ల రూపాయలు సీజ్ చేశాం
- వచ్చేఆర్థిక సంవత్సరం నుండి 24 గంటల్లోనే ఐటీఆర్ ప్రాసెస్, రిఫండ్
- గతేడాది దాఖలైన రిటర్న్స్‌లో 94 శాతం యథాతథంగా ఆమోదించారు
- సినిమా నిర్మాణానికి సింగిల్ విండో అనుమతులు
- సినిమా థియేటర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు
- ఎలక్ట్రానిక్ వాహనాలకు దేశంలోనే బ్యాటరీల తయారీ.. దీని వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది
- మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం
- ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.15,166 కోట్లు కేటాయింపు
- ఐదేళ్లలో 34 కోట్ల జన్‌ధన్ ఖాతాలు ప్రారంభం.
- ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయం రూ.12 లక్షల కోట్లు
- 80 శాతం పెరిగిన ట్యాక్స్‌పేయర్లు
- * పన్ను మినహాయింపు నూ. 50 వేలు పెంపు
- * ఆదాయపు పన్ను పరిమితి రూ. 3 లక్షలకు పెంపు
- * త్వరలో 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు' ప్రారంభం
- * ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో మొబైల్ డేటా, వాయిస్ కాల్స్
- * సోలార్ విద్యుదుత్పత్తిలో 10 రెట్ల వృద్ధి
- * ప్రధాన మంత్రి శ్రమ యోగి బంధన్ పేరుతో పింఛన్ పథకం
- * రైల్వే రంగానికి రూ. 64,587 కోట్లు
- * ఆవుల సంరక్షణకు కమిషన్ ఏర్పాటు
- * రైల్వేల చరిత్రలో ఇది ప్రమాదాలు తక్కువగా ఉన్న ఏడాది
- * బ్రాడ్‌గేజ్‌లో కాపలా లేని గేట్లను తొలగించాం
- * సాగర్‌మాల కింద పోర్టుల ద్వారా సరకు రవాణా
- * బ్రహ్మపుత్ర ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరకు రవాణా
- * రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్లు
- * వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం ఇప్పటికే రూ.35 వేల కోట్లు చెల్లించాం
- * పీఎం కౌషల్ వికాస్ యోజన కింద కోటిమంది యువతకు శిక్షణ
- * దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లు
- * సైనికులకు ప్రత్యేక అలవెన్సులు
- * అంగన్‌వాడీ సిబ్బంది వేతనం 50 శాతం పెంపు
- * ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టపోయిన వారి రుణాల రీషెడ్యూలింగ్
- * రీ షెడ్యూల్ చేసిన రుణాలపై 2 శాతం వడ్డీ తగ్గింపు
- * ఆవుల సంరక్షణకు ప్రత్యేక పథకం
- * కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణాలు
- * రుణాలు సకాలంలో చెల్లించిన వారికి రాయితీలు
- * గ్రామీణులకు కొత్తగా 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు
- * కార్మిక ప్రమాద బీమా రూ.లక్షన్నర నుంచి రూ. 6 లక్షలకు పెంపు
- * *గ్రాట్యుటీ పరిధి రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంపు*
- * ముద్ర స్కీం కింద రుణాలకు రూ. 7 లక్షల కోట్లు
- * 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగం కార్మికులకు నెలకు రూ.3 వేల పెన్షన్
- * అసంఘటిత కార్మికులు పెన్షన్ కోసం రూ.60 జమ చేయాల్సి ఉంటుంది
- * ఈఎస్‌ఐ లిమిట్‌ను రూ.15 వేల నుంచి 21 వేలకు పెంపు
- * రూ.15 వేల నెల జీతం వుండే వేతన జీవులకు కొత్త పథకం
- * ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పేరుతో కొత్త స్కీమ్
- * నెలకు రూ. 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది
- * ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి రూ.75 వేల కోట్లు
- * పాడి, మత్స్య రైతులకు 2 శాతం వడ్డీకే రుణం
- * కొత్త పెన్షన్ విధానాన్ని సరళీకరిస్తాం
- * పెన్షన్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు
- * 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి
- * 2018 డిసెంబర్ నుంచి ఈ కార్యక్రమం అమలు
- * గోకుల్ మిషన్‌కి రూ. 750 కోట్లు
- * గో ఉత్పాదకత పెంచడం కోసం రాష్ట్రీయ కామ్‌ధేన్ అయోగ్
- * 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు రూ. 6 వేలు సాయం
- * ప్రతి ఏడాది రూ. 6000 పెట్టుబడి సాయం
- * చిన్న రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బు వెళుతుంది. మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల ద్వారా డబ్బు అందుతుంది
- * ఎఫ్‌డీఐ విధానాన్ని పూర్తిగా సరళీకరించాం
- * బ్యాంకుల విలీనాన్ని చేపట్టాం
- * రాష్ట్రాలకిచ్చే వాటాను పెంచాం
- * గ్రామాల్లో 95 శాతం పారిశుద్ధ్యం
- * బొగ్గు, స్పెక్ట్రం వేలంలో పారదర్శకతకు ప్రాధాన్యం
- * ఆయుష్మాన్ భారత్‌తో పేద, మధ్య తరగతికి రూ. 3 వేల కోట్లు ఆదా
- * కొత్తగా 7 ఎయిమ్స్ ఆస్పత్రులు తీసుకొచ్చాం
- * హర్యానాలో కొత్త ఎయిమ్స్ రాబోతోంది.
- * 22 రకాల పంటలకు మద్ధతు ధర పెంచాం
- * అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం
- * ఉపాధి హామీ రూ.60 వేల కోట్లు
- * గ్రామ సడక్ యోజనకు రూ. 19 వేల కోట్లు
- * నాలుగేళ్లలో 1.53 కోట్ల ఇళ్లు నిర్మించాం
- * మార్చి వరకు దేశంలో అన్ని ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు
- * ఎల్‌ఈడీ బల్బులతో దేశంలో రూ. 50 వేల కోట్లు ఆదా చేశాం
- * రూ. 3 లక్షల కోట్ల మొండి బకాయిలను రికవరీ చేశాం
- * బ్యాంకులకు రూ. 2.6 లక్షల కోట్ల మూలధన సాయం అందించాం
- * ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఇబ్బందులను అధిగమిస్తున్నాయి
- * అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం
- *TPUS వరంగల్ రూరల్*
- * అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం
- * ఆరో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించాం
- * 2018-19కి ద్రవ్యలోటు అంచనా 3.4 శాతం
- * కరెంట్ అకౌంట్ లోటును 5.6 నుంచి 2.5 శాతానికి తగ్గించాం
- * మా ప్రభుత్వంలో ధరల నడ్డి విరిచాం
- * మా హయాంలో ద్రవ్యోల్బణం దిగివచ్చింది
- * జీడీపీ వృద్ధి రేటులో గణనీయమైన పురోగతి
- * మా ప్రభుత్వం ప్రతీ పథకాన్ని నిజాయితీగా అమలు చేస్తోంది
- * గడిచిన ఐదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించాం
- * మోడీ సారథ్యంలో సుస్థిర పాలన అందించాం.
- * 2020లోగా నవభారతాన్ని చూడబోతున్నారు
- * విధాన నిర్ణయాల్లో వేగం పెంచాం
- * దేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా గాడినపడుతోంది.
- * రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్నదే మా లక్ష్యం
- * అందరికీ ఇల్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించడమే లక్ష్యం
Thursday, 31 January 2019
SI దేహదారుఢ్య పరీక్షలు ఫిబ్రవరి 11 నుండి ప్రారంభం
By . at January 31, 2019
No comments
తెలంగాణా స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ SI ఉద్యోగాల ఎంపిక లో భాగంగా ఈ నెల 11 వ తేదీ నుండి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించ నున్నది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డు లు ఈ నెల 5 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు బోర్డ్ వెబ్సైట్ లో అందు బాటు లో ఉంటాయి.దేహదారుఢ్య పరీక్షలు హైదరాబాద్ లో 3 కేంద్రాలు,వరంగల్,కరీంనగర్ ,సంగారెడ్డి ఖమ్మం,మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో జరుగుతాయి.ఇంతకు ముందు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు మళ్లీ చేసుకోవాలి.డౌన్లోడ్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే 93937 11110,9391005006 నంబర్ ల కి కాల్ చేయాలి.
Wednesday, 30 January 2019
సర్కారు కు 7 వ వేతన సవరణ తుది నివేదిక ను అంద జేసిన కమిషన్: త్వరలోనే జీతాల పెంపు
By . at January 30, 2019
No comments
తెలంగాణా రాష్ట్రంలోని, డిగ్రీ కాలేజీ ల లో మరియు యూనివర్శిటీ ల లో పనిచేస్తున్న అధ్యాపకుల కు, యూజీసీ 7 వ వేతన సవరణ ప్రకారం ,జీతాల ను పెంచడానికి వేసిన కమిషన్ నివేదిక ను ఉన్నత విద్యా మండలి ,ప్రభుత్వానికి సమర్పించింది.ఈ నివేదిక అమలుకు ,ప్రభుత్వానికి అదనంగా 100 కోట్ల భారం పడనుంది.అయితే 7 వ వేతన సవరణ 2016 జనవరి నుండి అమలు చేయాల్సి ఉంటుంది ,కావున ఉద్యోగులకు 2016 జనవరి నుండి బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది.దీనికి ప్రభుత్వ ఖజానా పై 240 కోట్ల భారం పడనుంది.ఇక ప్రభుత్వం ఈ కమిషన్ నివేదికను ఆమోదించ గానే ,అధ్యాపకుల కు వేతనాలు పెరుగుతాయి.దీని ప్రకారం ప్రతీ అధ్యాపకునికి 15000 నుండి 25000 పెరుగుదల ఉండొచ్చని అంచనా.
Tuesday, 29 January 2019
పార్ట్ టైం అధ్యాపకుల జీతం రెట్టింపు పెంపు
By . at January 29, 2019
No comments
7 వ వేతన సవరణ ప్రకారం నెట్ లేదా సెట్ లేదా పీహెచ్డీ వంటి అర్హతలు గలిగిన ,యూనివర్సిటీ ల లో పని చేసే పార్ట్ టైం అధ్యాపకులు,అతిథి అధ్యాపకుల వేతనాలను పెంచుతూ యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. గతం లో అర్హత గల పార్ట్ టైం ,గెస్ట్ లెక్చరర్ ల కు ఒక పీరియడ్ కి 700 రూ. అర్హత లేని వారికి 600 రూ. ఉండేది.ఇప్పుడు వారి కి ఒక పీరియడ్ కి 1500 రూ. పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవలే అధ్యాపకుల కు జీతాలు పెంచుతూ యూజీసీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
మాజీ రక్షణ మంత్రి, నిజాయితీ కి నిలువెత్తు రూపం జార్జి ఫెర్నాండెజ్ అనారోగ్యంతో మృతి
By . at January 29, 2019
No comments
దేశ మాజీ రక్షణ మంత్రి ,పార్లమెంటేరియన్ , ప్రముఖ కార్మిక నాయకుడు,నిజాయితీ కి మారు పేరు ,శ్రీ జార్జ్ ఫెర్నాండెజ్ గారు 88 ఏళ్ళ వయసులో మరణించారు.ఆయన 8 ఏళ్ల నుండి అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతున్నారు.ఆయనకు ,భార్య ,కుమారుడు ఉన్నారు.కుమారుడు న్యూయార్క్ లో ఉన్నాడు అతడు రాగానే అంత్య క్రియలు జరుపుతారు. బీహార్ ప్రభుత్వం 2 రోజులు సంతాప దినాలుగా ప్రమతించింది.ప్రధాని క్రింది
విధంగా ట్వీట్ చేశారు.
Monday, 28 January 2019
ఎస్ ఐ పోస్టుల భర్తీ పై ఉన్న స్టే ను ఎత్తి వేసిన హైకోర్టు.
By . at January 28, 2019
No comments
ఎస్ ఐ పోస్టుల నియామకాల పై ఉన్న స్టే ను రాష్ట్ర హై కోర్టు ఎత్తి వేసింది.గతంలో సింగిల్ జడ్జి ఇచ్చి న స్టే ను హై కోర్టు కొట్టి వేసింది.2015 మే 31 న విడుదల చేసిన నోటిఫికేషన్ పై , 6 ప్రశ్నలు తప్పుగా ఇచ్చారు అని కేసు ను కొందరు వేయగా ,ఈ పిటిషన్ పై సింగిల్ జడ్జి స్టే విధించగా ,ఇప్పుడు అది క్లియర్ కావడం తో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే శారీర దారుడ్య పరీక్షలు ఉంటాయి.
గురుకులా లలో 3689 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు
By . at January 28, 2019
No comments
తెలంగాణా లోని 119 బీసి గురుకులా ల లో, 3689 వివిధ రకాల ఉద్యోగాల ను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.వీటిలో 1071 టీజీటీ, 833 జె ఎల్ ,833 పీజీటీ,119 ప్రిన్సిపాల్,119 ఫిసికల్ డైరెక్టర్,119 లైబ్రేరియన్,119 క్రాఫ్ట్ ,119 స్టాఫ్ నర్స్,119 సీనియర్ అసిస్టెంట్,119 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేశారు.వీటితో పాటు 595 పొరుగు సేవల పోస్టులు కూడా మంజూరు చేశారు.వీటిని వచ్చే విద్యా సం వత్సరం నుండి దశల వారీగా భర్తీ చేస్తారు.
Sunday, 27 January 2019
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత..జెకోవిచ్
By . at January 27, 2019
No comments
![]() |
| విజయానంతరం ట్రోఫీని ముద్దాడుతున్న జెకోవిచ్ |
గాయంతో ఆటకు దూరమై తిరిగి మళ్ళీ రాకెట్ పట్టి నపుడు మునుపటి లా ఆడతాడా..అనే సందేహాలను పటా పంచలు చేస్తూ,వింబుల్డన్, యూఎస్ ఓపెన్ లను వరుసగా గెలిచిన నోవాక్ జెకోవిచ్ , ఆస్ట్రేలియన్ ఓపెన్ ను కూడా గెలుచుకొన్నాడు.ఇక్కడ ఆదివారం మెల్బోర్న్ పార్క్ లో ని రాడ్ లేవర్ ఎరీనా లో, ఏకపక్షంగా సాగిన ఫైనల్లో వరల్డ్ నెంబర్ వన్ సెర్బియా ప్లేయర్ నోవాక్ జెకోవిచ్, రెండో ర్యాంకర్, రఫెల్ నాదల్(స్పెయిన్) పైన 6-3,6-2,6-3 తో వరుస సెట్లలో గెలిచాడు. ఈ విజయం తో కెరీర్ లో 15 గ్రాండ్ స్లాం టైటిల్స్ నెగ్గి ఓవరాల్ గా మూడో స్థానాననికి చేరుకున్నాడు.జెకో కన్నా నాదల్ 17,ఫెదరర్ 20 టైటిళ్ల తో తొలి రెండు స్థానాలలో ఉన్నారు.ఈ గెలుపుతో పీట్ సంప్రాస్ 14 టైట్లిళ్ల రికార్డు ను బద్దలు కొట్టాడు.అంతే కాకుండా మెల్ బోర్న్ పార్క్ లో 6 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ ని నెగ్గిన ఫెదరర్, రాయ్ ఎమర్సన్ రికార్డును 7 టైటిల్ లు నెగ్గి బద్దలు కొట్టాడు జెకో.
Visit us for more updates@ www.thribhuvanavijayam.com





















