ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2 వ తేదీ ని ప్రపంచ చిత్తడి నేలల(Wet lands) దినోత్సవం గా జరుపుకుంటారు.వెట్ ల్యాండ్స్ అనేవి లోతు తక్కువ ఉండే నీరు గల ప్రాంతాలు.ఇవి జీవ వైవిద్యానికి(bio diversity) కేంద్రాలు.ఈ ప్రదేశాల లో చాలా జల చర మరియు ఉభయ చర జీవనాన్ని గడిపే మొక్కలు,జంతువులు ఉంటాయి.ఈ చిత్తడి నేలలు ముఖ్యంగా నదీ పరీవాహక ప్రదేశాలు, సముద్ర తీర ప్రాంతాల కు సమీపంగా ఉంటాయి.ఇవి నదుల గుండా వచ్చే కాలుష్య కారక పదా ర్థాలను, తమలో ఇముడ్చు కుంటాయి,సముద్ర భారీ అలల నుండి సునామీ ల నుండి తీర ప్రాంతాలను రక్షిస్తాయి,అదే విధంగా నదుల వరదల నుండి ,కాపాడుతాయి.అయితే మానవుడు తన ఆవాసాల కోసం ఇలాంటి చిత్తడి నేలల ను పూడ్చి గృహాలు నిర్మించుట వల్ల చిత్తడి నేలలు కనుమరుగు అవుతున్నాయి.దీనికి మంచి ఉదాహరణ ముంబై ,కోల్ కత వంటి నగరాలు.దీని వల్ల బయో డైవర్సిటీ తీవ్రంగా నష్టపోతుండటం వల్ల 1971 ఫిబ్రవరి 2 వ తారీఖు న ఇరాన్ దేశం లోని రాంసార్ పట్టణంలో చిత్తడి నేలల సంరక్షణకు ఒక సదస్సు జరిగింది.దీనిలో అన్ని దేశాలు చిత్తడి నేలలను రక్షించడానికి అంగీకరించాయి.అప్పటి నుండి ఫిబ్రవరి 2 వ తారీఖు ను అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవం గా జరుపుకుంటున్నారు.
Saturday, 2 February 2019
నేడు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం
By . at February 02, 2019
No comments

0 comments:
Post a Comment