Saturday, 1 June 2019

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 2018 డీఏ ను ప్రకటించిన ప్రభుత్వం: జీఓ విడుదల చేసిన ఆర్థిక శాఖ



  • జీవో ఏంఎస్ నం 36 ,తేది 01/06/2019 విడుదల.
  • జులై2018 నుంచి అమలు
  • పెరిగిన డిఏ  జూన్ -2019 నెల జీతంతో చెల్లింపు

తెలంగాణ   రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల  కు  జులై 2018 కరువు భత్యాన్ని  (డీఏ) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ   జీవో ఏంఎస్ నం 36 ,తేది 01/06/2019 విడుదల చేసింది.ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,పంచాయితీ రాజ్ ఉద్యోగులు ,జిల్లా పరిషత్ ఉద్యోగులు,టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది,యూనివర్సిటీ ,పాలీటెక్నీక్ అధ్యాపకులు మరియు సిబ్బంది అందరికీ వర్తిస్తుంది.
 పెరిగిన కరువు భత్యాన్ని జూన్ నెల వేతనంతో కలిపి చెల్లిస్తారు.
ప్రస్తుతం ఉద్యోగులకు 27.248% కరువు భత్యం అందుతోంది. వారికి 3.144 % పెంచారు.వెరసి, కరువు భత్యం 30.392% శాతానికి చేరింది.
 దీనిని జులై2018 నుంచి అమలు చేయనున్నారు. జులై2018 నుంచి  మే2019 వరకు డీఏ బకాయిలను జీపీఎఫ్‌ ఖాతాలో కలుపుతారు. నగదు జూన్2019 నెల వేతనంతో కలిపి ఇస్తారు.సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలు తొంబైశాతం నగదు రూపేన పదిశాతం ప్రాన్ అకౌంట్ కు జులై 2019 నెల జీతంతో కలిపి జమ చేస్తారు.

అయితే యూజీసీ పే స్కేల్ ను మరియు కేంద్ర ప్రభుత్వ స్కేల్ పొందే ఉద్యోగులకు ఈ డీఏ పెంపు తో 142% నుండి 148% పెరగనుంది.

రేపే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2019 పరీక్ష



దాదాపు 10 లక్షల మంది గ్రాడ్యుయేట్ లు రేపు అంటే జూన్ 2 న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష రాయబోతున్నారు.ఈ పరీక్ష ను దేశ వ్యాప్తంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహిస్తుంది. ఈ పరీక్ష IAS,IPS వంటి ఉద్యోగాలతో పాటు,ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) పరీక్ష కు కూడా ఉమ్మడి ప్రిలిమ్స్ పరీక్ష.దేశం లోని 72 నగరాలలో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది.  ఈ సంవత్సరం 896 పోస్టుల ను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.ఈ పరీక్ష 3 దశలుగా ఉంటుంది.1.ప్రిలిమ్స్ 2. మెయిన్స్ 3. ఇంటర్వ్యూ.
ప్రిలిమ్స్ లో రెండు పేపర్లు ఉంటాయి.అవి
ఉదయం : జనరల్ స్టడీస్ మధ్యాహ్నం: సి-సాట్
 ఈ సందర్బంగా UPSC అభ్యర్థులకు  కొన్ని ముఖ్యమైన సూచనలను విడుదల చేసింది.
1.పరీక్ష కేంద్రానికి గంట సమయం ముందుగా చేరుకోవాలి.
2.ఈ పరీక్ష కు అప్లై చేసుకున్న అభ్యర్థులకు అందరికీ ఏప్రిల్ 30 వ తేదీన e-admit card(హాల్ టికెట్) లను వెబ్ సైట్ లో కమిషన్ ఉంచింది. వీటిని అభ్యర్థులు తమ వెంట పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లాలి.
3.అంతే కాకుండా అభ్యర్థి తన యొక్క ఏదేని ఒక  ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డు కూడా తీసుకు వెళ్ళాలి.
4.ఒక వేళ       e-admit card(హాల్ టికెట్) పై   అభ్యర్థి ఫోటో  లేదా signature సరిగా ప్రింట్ కాకపోతే ,అభ్యర్థి రెండు ఫోటోలను తమ వెంట తీసుకు వెళ్ళాలి.(రెండు సెషన్ లకు)
5.అభ్యర్థులు ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ పరికరాలను(సెల్ ఫోన్,డిజిటల్ వాచ్ మొదలగునవి)తమ వెంట తీసుకు వెళ్ళ రాదు.
6.సాధారణ వాచ్ లు అనుమతించబడును.

మరిన్ని updates కోసం visit చేయండి
www.paatshaalaindia.blogspot.com

Thursday, 30 May 2019

SGT పోస్టుల నియామకాల పై హైకోర్టు స్టే


TRT ద్వారా SGT   పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మరికొంత కాలం ఆగాల్సిందే.ఈ పరీక్షలో  400 మంది అభ్యర్థులు తెలుగు   మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఉద్యోగాలు రెండింటికీ ఎంపికయ్యారు.అయితే వీరు ఓ ఒక ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.దీనినే రెలింక్వేష్ మెంట్ అంటారు.ఈ 400 మంది అభ్యర్థులు తమ రెండు ఉద్యోగాలలో   ఏదైనా   ఒక ఉద్యోగాన్ని వదులుకున్నాకనే( రెలింక్వేష్ మెంట్- TSPSC-నిబంధన -6A) తుది నియామకాలు చేపట్టాలని హైకోర్టు ,నియమాకాలపై స్టే విధించింది.

నేడే టీఎస్ -ఎడ్ సెట్ -2019


తెలంగాణా రాష్ట్రం లో 2019 ఎడ్ సెట్ పరీక్ష నేడు జరుగ నున్నది.ఈ రోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఇంగ్లీష్,సోషల్ సైన్స్ మరియు ఫిజికల్ సైన్స్ లు జరుగుతాయి.మధ్యాహ్నం 3.30 గంటల నుండి 5.30 గంటల వరకు మాథ్స్ మరియు బయోలాజికల్ సైన్సెస్ పరీక్షలు జరుగుతాయి.ఈ పరీక్షకు మొత్తంగా 52,380 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు.ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు వారి వారి రాంక్ ను బట్టి 2 ఏళ్ల బీ ఈడీ కోర్సు లో సీటు పొందుతారు.బీ ఈడీ అనేది టీచర్ ట్రైనింగ్ కోర్సు.ఇది పూర్తి చేసిన వారు ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హులు అవుతారు.

కామన్ పీజీ ఎంట్రన్స్ పరీక్ష అప్లికేషన్ గడువు పెంపు


తెలంగాణా రాష్ట్రం లోని అన్ని యునివర్సిటీ ల కు కలిపి ఒకే పీజీ ప్రవేశ పరీక్ష మొట్టమొదటి సారి నిర్వహించ బోతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ ప్రవేశ పరీక్ష అప్లికేషన్ చివరి తేదీని జూన్ నెల 6 వ తేదీ  వరకు పొడిగించారు.500 రూపాయాల అపరాధ రుసుము తో ఈ జూన్ 20 వ తేదీ వరకు ,2000 రూపాయల అపరాధ రుసుముతో జూన్ 29 వరకు పొడిగించారు.ఈ ప్రవేశ పరీక్ష పూర్తి గా ఆన్ లైన్ లో ఉంటుంది.ఈ పరీక్షను ఉస్మానియా యునివర్సిటీ నిర్వహిస్తుంది.