- జీవో ఏంఎస్ నం 36 ,తేది 01/06/2019 విడుదల.
- జులై2018 నుంచి అమలు
- పెరిగిన డిఏ జూన్ -2019 నెల జీతంతో చెల్లింపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కు జులై 2018 కరువు భత్యాన్ని (డీఏ) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో ఏంఎస్ నం 36 ,తేది 01/06/2019 విడుదల చేసింది.ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,పంచాయితీ రాజ్ ఉద్యోగులు ,జిల్లా పరిషత్ ఉద్యోగులు,టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది,యూనివర్సిటీ ,పాలీటెక్నీక్ అధ్యాపకులు మరియు సిబ్బంది అందరికీ వర్తిస్తుంది.
పెరిగిన కరువు భత్యాన్ని జూన్ నెల వేతనంతో కలిపి చెల్లిస్తారు.
ప్రస్తుతం ఉద్యోగులకు 27.248% కరువు భత్యం అందుతోంది. వారికి 3.144 % పెంచారు.వెరసి, కరువు భత్యం 30.392% శాతానికి చేరింది.
దీనిని జులై2018 నుంచి అమలు చేయనున్నారు. జులై2018 నుంచి మే2019 వరకు డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో కలుపుతారు. నగదు జూన్2019 నెల వేతనంతో కలిపి ఇస్తారు.సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలు తొంబైశాతం నగదు రూపేన పదిశాతం ప్రాన్ అకౌంట్ కు జులై 2019 నెల జీతంతో కలిపి జమ చేస్తారు.
అయితే యూజీసీ పే స్కేల్ ను మరియు కేంద్ర ప్రభుత్వ స్కేల్ పొందే ఉద్యోగులకు ఈ డీఏ పెంపు తో 142% నుండి 148% పెరగనుంది.




0 comments:
Post a Comment