Saturday, 12 January 2019

అగ్ర వర్ణాలకు 10% కోటాకు రాష్ట్రపతి ఆమోదం:103 వ రాజ్యాంగ సవరణ (చట్టం )

జనరల్ కేటగిరీ లోని ఆర్థికంగా వెనుకబడిన(Economically Weaker Section) వారికి ఉద్దేశించిన 10 శాతం రిజర్వేషన్ ను కల్పించే 124 వ రాజ్యాంగ సవరణ బిల్లు గా పార్లమెంటు ఆమోదం పొందిన బిల్లు పై రాష్ట్రపతి సంతకం చేశారు.దీంతో ఇది చట్ట రూపం దాల్చింది.దీనితో ఇప్పటి వరకు రాజ్యాంగ 103 సార్లు సవరించినట్లు అయ్యింది.రిజర్వేషన్ల కొరకు రాజ్యాంగం లోని 15,16 అధికరణల ను సవరించారు.దీని అమలు తేదీ పై కేంద్ర సామాజిక న్యాయం ,సాధికార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది.8 లక్షల వరకు వార్షికాదాయం 5 ఎకరాల్లోపు భూమి ,1000 చదరపు అడుగుల ఇల్లు ,నోటిఫై చేసిన ప్రాంతాల్లో 100 గజాల్లోపు ,నోటిఫై చేయని ప్రాంతాల్లో 200 గజాల్లోపు స్థలం ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ కోటాకు అర్హులు. 

తొలి వన్డే లో ఆస్ట్రేలియా పై భారత్ ఓటమి :రోహిత్ సూపర్ సెంచరీ వృధా

ఆస్ట్రేలియా టూర్ లో ,3 వన్డేల సిరీస్ లో భాగంగా భారత జట్టు సిడ్నీ లో జరిగిన , మొదటి వన్డే లో ఓటమి పాలైంది.మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో  288/ 5  పరుగులు చేయగా ,భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల కు 254 పరుగులు మాత్రమే చేయగల్గింది.ఆస్ట్రేలియా తరుపున ఖ్వాజా 59,షాన్ మార్ష్ 54,హాండ్స్ కూంబ్ 73, స్టాయినిస్ 47 నాటౌట్ పరుగుల తో రాణించారు.భారత్ బౌలర్లు ప్రారంభంలో కట్టడి చేసినా తర్వాత్ డాన్ని కొనసాగించలేకపోయారు.భువీ 2, కుల్దీప్ 2 , జడేజా ఒకటి చొప్పున వికెట్లు తీశారు.భారత్ బ్యాటింగ్ లో రోహిత్ శర్మ సూపర్ సెంచరీ (129 బంతుల్లో  133. 10 ఫోర్లు, 6 సిక్స్ లు ) భారత్  ను ఓటమి నుండి రక్షించ లేకపోయింది.ధోనీ  51 (96 బంతుల్లో 3 ఫోర్లు ,ఒక సిక్స్ ) పరుగులు చేసినా ఎక్కువ బంతులు వృధా చేసి వెనుదిరిగాడు.మిగితా వికెట్లు త్వర త్వరగా కోల్పోవడం వల్ల కావాల్సిన రన్ రేట్ ను భారత సాధించలేక పోయింది.ఆస్ట్రేలియా బౌలర్ల లో  జే రిచర్డ్సన్  4 వికెట్లు తీసి భారత్ ను దెబ్బ తీసాడు.అతనికే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ' అవార్డ్ లభించింది.
రోహిత్ శ్రమ వృధా 

భారత్ తరుపున 2 మైలు రాళ్ళు
ఈ మ్యాచ్ లో ధోనీ 10 వేల పరుగులు సాధించాడు.అంతే కాకుండా ఈ ఫీట్ సాధించిన 13 వ ఆటగాడు.
ఇక బౌలింగ్ విభాగంలో  భువనేశ్వర్ 100 వికెట్ల మైలు రాయిని చేరుకున్నాడు.ఈ ఫీట్ సాధించిన వారిలో    భారత్ తరుపున 19 వ ఆటగాడు .హైలైట్స్ కోసం ఈ లింక్..
.https://youtu.be/KvdTfxY0GZI

Friday, 11 January 2019

ఆస్ట్రేలియా టీం కొత్త జెర్సీ


ఇండియా ,న్యూజీలాండ్ తో జరగబోయే ముక్కోణపు వన్డే సిరీస్ కి ,ఆస్ట్రేలియా టీం కొత్త రకం ,రంగు దుస్తులను ధరించబోతున్నారు.ఇది రిట్రో గ్రీన్ & గోల్డ్ రంగు దుస్తులు.ఇలాంటి డ్రెస్ నే 1986 లో అలెన్ బోర్డర్ నాయకత్వం లోని ఆస్ట్రేలియా టీం ధరించింది.ఈ దుస్తులలో ఆస్ట్రేలియా టీం న్యూ లుక్ చాలా బాగుంది.

ఓపెన్ కోటా సివిల్స్ అభ్యర్థులు OBC ల వలే లబ్ధి

మోడీ ప్రభుత్వం తెచ్చిన అగ్ర వర్ణాల కు 10 శాతం రిజర్వేషన్  లను కల్పించే బిల్లు గనక అమలు లోకి వస్తే సివిల్స్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే ఓపెన్ కోటా అభ్యర్థులు ,OBC అభ్యర్థుల వలే లబ్ది పొంద బోతున్నారు.ప్రస్తుతం ఓపెన్ కోటా అభ్యర్థులకు 32 సంవత్సరాలు మరియు 6 సార్ల అటెంప్ట్ కి అవకాశం ఉంది.ఈ బిల్లు తర్వాత ఓపెన్ కోటా అభ్యర్థుల కు  OBC అభ్యుర్థుల వలే 35 సంవత్సరాల గరిష్ట వయసు మరియు 9 సార్లు అవకాశాలు పొంద బోతున్నారు.SC, ST లకు 37 సంవత్సరాల గరిష్ఠ వయోపరిమితి మరియు ఎన్నిసార్ల యినా అటెంప్ట్ చేసుకునే అవకాశం కలదు.

Thursday, 10 January 2019

అగ్ర వర్ణాలలో ఆర్థికంగా వెనుక బడిన వారికి 10 శాతం రిజర్వేషన్ బిల్లు రాజ్య సభలో ఆమోదం

అగ్ర వర్ణాలలో ఆర్థికంగా వెనుక బడిన వారికి 10 శాతం రిజర్వేషన్ బిల్లు  లోక్ సభలో ఆమోదించబడడం తెలిసిందే.అయితే ఈ బిల్లు చట్ట రూపం దాల్చాలంటే ఇది రాజ్య సభ లో కూడా నెగ్గాల్సిన నేపథ్యంలో, గురువారం ఈ బిల్లు రాజ్య సభలో కూడా నెగ్గింది.తర్వాత  ఈ బిల్లు ను రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారు.రాష్ట్ర పతి ఆమోదం పొందగానే ఈ బిల్లు చట్టం గా మారుతుంది.ఇది 124 వ రాజ్యాంగ సవరణ.

TSPSC వెబ్ సైట్ లో SGT అభ్యర్థుల రివైజ్డ్ లిస్ట్

TSPSC వెబ్ సైట్ లో ,SGT ఇంగ్లీష్ మీడియం పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పెట్టినట్టు కమిషన్ సెక్రటరీ వాణీప్రసాద్ తెలిపారు.

Wednesday, 9 January 2019

రణ్వీర్ సింగ్ తర్వాతి చిత్రం 'గల్లీ బాయ్' ట్రైలర్ విడుదల

                       https://youtu.be/JfbxcD6biOk

బాలీవుడ్ యువ సంచలనం రణ్వీర్ సింగ్ కొత్త మూవీ 'గల్లీ బాయ్' ట్రైలర్ ని బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఓం లైన్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మూవీ డైరెక్టర్ జోయా అక్తర్ ,హీరో రణ్వీర్ సింగ్ ,హీరోయిన్ ఆలియా భట్ మరియు నిర్మాత లలో ఒకడైన రితేష్ సిద్వాని,కూడా పాల్గొన్నారు.ఫరాన్ అక్తర్ జోయా అక్తర్ లు మిగతా నిర్మాతలు.
ఈ సినిమా ఫిబ్రవరి 14 న విడుదల కానుంది.
ఈ సినిమా ప్రధానంగా స్ట్రీట్ బాయ్స్ హిప్ హాప్ (asli hip hop) కి సంబంధించినది గా తీసినట్టు తెలుస్తుంది.
సూపర్ ఫామ్ లో ఉన్న రణ్వీర్ సింగ్ వరుస హిట్స్ తో దూసుకు పోతున్నాడు.2018 లో పెద్ద హిట్ సాధించింది రణ్వీర్ మాత్రమే.అతడు నటించిిిిన సింబా 200 కోట్ల క్లబ్ లో చేర డానికి శరవేగంగా పరుగులు పెడుతుంది.ఈ మూవీ ట్రైలర్ ఇక్కడ మీ కోసం..

Tuesday, 8 January 2019

అగ్ర వర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కి లోక్ సభ ఆమోదం.



అగ్ర వర్ణ పేదల లో ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారో  వారికి విద్యా, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు కు లోక్ సభ మంగళ వారం రాత్రి 10 గంటల సమయం లో  323-3 ఓట్ల తేడా తో ఆమోదం తెలిపింది.ఇది రాజ్యాంగ సవరణ బిల్లు(124 వ).కాబట్టి ఈ బిల్లు కు 2/3 వంతు మెజారిటీ అవసరం కాగా ప్రభుత్వం దీన్ని కూడా గట్టగలిగింది.కేంద్ర సామాజిక న్యాయ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ దీన్ని లోక్ సభలో ప్రవేశ పెట్టారు.ఏ మతం వారైనా అగ్ర కులానికి చెంది (OC) సంవత్సరానికి 8 లక్షల లోపు ఆదాయం లేదా 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి గల అగ్రవర్ణాలు దీనికి అర్హులు.అయితే దేశం లోని అగ్ర వర్ణాలలో దాదాపు 99 % కుటుంబాలు ఈ కేటగిరీ కె చెందిన వారుగా ఉన్నారు.పేదలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఆమోదం లభించడం దేశ చరిత్రలో చిర స్థాయిగా నిలిచి పోతుందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.అయితే ఇది సుప్రీం కోర్టు లో న్యాయ సమీక్ష లో నిలవదని పలు ప్రతి పక్షాలు వాదిస్తునాయి.

సంక్రాంతి బరి లో భారీ చిత్రాలు

ఈ సంక్రాంతి కి 3 పెద్ద చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 
నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్  బయోపిక్  మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు ఈ నెల 9న విడులవుతుంది. 10 వ తేదీన తల అజిత్ విశ్వాసం విడుదల అవుతుంది. 
11 వ తేదీన రామ్ చరణ్ ,బోయపాటి ల వినయ విధేయ రామ విడుదల కానుంది.
 12 వ తేదీన వెంక టేష్ ,వరుణ్ తేజ్ ల F 2 విడుదల కానుంది. 
కాబట్టి సినీ అభిమానులకు ఈ సంక్రాంతి నిజమైన పండగ లాంటిది గా చెప్పొచ్చు.