తెలంగాణా ప్రభుత్వము TS-SET (తెలంగాణా స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ )-2019 కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపింది.ఈ మేరకు TS-SET సభ్య కార్యదర్శి శ్రీ బిరుదురాజ్ యాదవరాజు గారి పేరుమీద TS-SET ఆఫీస్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.దీని ప్రకారం ఈ సారి కూడా TS-SET పరీక్ష ను ఉస్మానియా యునివర్సిటీ యే నిర్వహిస్తుంది. ఈ పరీక్ష లో అర్హత సాధించిన వారికి డిగ్రీ కళాశాల లలో ,యూనివర్సిటీ ల లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హులు అవుతారు. పరీక్ష జులై 5 మరియు 6 వ తేదీ 2019 రోజున నిర్వహించబడును.పరీక్ష ఆన్ లైన్ (కంప్యూటర్ బేస్డ్ ) లో నిర్వహిస్తారు. మొత్తం 3 గంటల వ్యవధి ఉండే ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.ఒకటవ పేపర్ లో 50 ప్రశ్నలు(టీచింగ్ & రీసెర్చ్ మెథడ్) 100 మార్కులు ; కాగా రెండవ పేపర్ లో 100 ప్రశ్నలు (సంబంధిత సబ్జెక్ట్ )200 మార్కులు ఉండును.రెండు పేపర్లకు కలిపి 3 గంటల వ్యవధి.
ఈ నెల 27వ తేదీ నుండి అప్లికేషన్ లు అనుమతించ బడును.
మరిన్ని వివరాలకు www.telanganaset.org
లేదా www.osmania.ac.in




