Saturday, 6 April 2019

సివిల్స్ లో తెలంగాణా విద్యార్థుల హవా :7 వ ర్యాంకు సాధించిన వరుణ్ రెడ్డి




ఇటీవల ప్రకటించిన సివిల్స్  తుది ఫలితాల లో.. తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్‌రెడ్డి 7వ ర్యాంకు సాధించాడు.వీరిలో సత్తా చాటగా,  ఇంకా ఐదుగురికి వందలోపు ర్యాంకులు దక్కాయి. అంకితా చౌదరి 14వ ర్యాంకు, శ్రీలక్ష్మి 29వ ర్యాంకు, నాగర్‌కర్నూలు జిల్లా తమ్మన్‌పేటకుచెందిన మహ్మద్‌ అబ్దుల్‌ షాహిద్‌ 57వ ర్యాంకు, వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాకకు చెందిన చిట్టిరెడ్డి శ్రీపాల్ 131వ ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన సిరి మేఘన 171వ ర్యాంకు,హైదరాబాద్‌కే చెందిన శివ నీహారిక 237వ ర్యాంకు సాధించారు. రాజస్థాన్‌కు చెందిన కనిష్క్ కటారియాటాప్ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే .మొత్తం  35 మందికిపైగా తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు.  



Friday, 5 April 2019

సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను విడుదల చేసిన యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్






యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ 2018 సంవత్సర సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను ప్రకటించింది. ఈ పరీక్షకు ఎంపికైన వారికి IAS,IPS,IRS,IFS వంటి ఆల్ ఇండియా సర్విసులలో ఉద్యోగాలను కేటాయిస్తారు.దీని లో ఎంపికైన  అభ్యర్థుల లిస్టు www.upsc.gov.in లో పొందవచ్చు. మొత్తం 759 పోస్టులకు గానూ ,577 పురుష అభ్యర్థులు ,187 మహిళా అభ్యర్థులు ఎన్నికయారు.ఈ సారి తుది ఫలితాలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు కనిషక్ కటారియా. ఇతడు  SC సామాజిక వర్గానికి చెందిన  విద్యార్ధి .ఇతడు IIT బొంబాయి నుండి బీ.టెక్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.రెండవ ర్యాంక్ అక్షత్ జైన్ మూడవ ర్యాంకు జునైద్ అహ్మద్ ,4 వ ర్యాంక్ శ్రేయంత్ కుమాట్ .5 వ ర్యాంకు సృష్టి జయంత్ దేశ్ ముఖ్ ,ఈమె మహిలలో టాపర్.ఈమె బీ.ఈ ,(కెమికల్ ఇంజనీరింగ్  , రాజీవ్ గాంధీ ప్రౌద్యోగిక్ విశ్వవిద్యాలయము ,భోపాల్)
కుటుంబ సభ్యులతో ఫస్ట్ ర్యాంకర్ కనిషక్ కటారియా (కుడినుండి రెండో వ్యక్తి )
 మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం విసిట్ చేయండి  www.paatshaalaindia.blogspot,com .


Thursday, 4 April 2019

జె ఎల్ ఇంటర్వ్యూ కి షెడ్యూల్ విడుదల చేసిన టీ ఎస్ పీ ఎస్సీ


రెసిడెన్షియల్ జూనియర్ కలాశాల ల లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ లో భాగంగా 1:2 నిష్పత్తి లో ఇంటర్వ్యూ కి ఎన్నికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను   టీ ఎస్ పీ ఎస్సీ విడుదల చేసింది.ఇందులో బాటనీ,జువాలజీ,ఫిజిక్స్,కెమిస్ట్రీ, మ్యాథ్స్,ఇంగ్లీష్,తెలుగు,కామర్స్,హిస్టరీ ,సివిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టు ల ఇంటర్వ్యూ షెడ్యూల్ ని ప్రకటించింది. ఈ నెల 16 నుండి 22 వ తేదీ వరకు ఇంటర్వ్యూ లు  జరగనున్నాయి.


Tuesday, 2 April 2019

తెలంగాణా ఇంటర్ పరీక్షా ఫలితాల ప్రకటన ఈ తేదీన..!

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలను ఇంటర్ బోర్డు త్వరలోనే ప్రకటించ బోతుంది.సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.గత సంవత్సరం ఏప్రిల్ 12 వ తేదీన ప్రకటించగా,ఈ సంవత్సరం మాత్రం ఏప్రిల్ 8 వ తేదీన నే ప్రకటించ బోతున్నట్లు తెలుస్తుంది.ఫలితాల కోసం www.telangana. bie. gov. in వెబ్ సైట్ లో 8 వ తేదీన చూసుకోవచ్చు.

Monday, 1 April 2019

హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ పీజీ నోటిఫికేషన్ విడుదల :అప్లై చివరి తేది మే 3 వ తేదీ

ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ పీజీ నోటిఫికేషన్  2019 ని విడుదల చేసింది .ఈ నెల 1 వ తేదీ నుండి మే 3 వ తారీఖు వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ లో పీజీ ఎంట్రన్స్ తో పాటు ,ఇంటిగ్రేటెడ్ పీజీ ,ఎం.ఫిల్, పీ.హెచ్ డీ నోటిఫికేషన్ లను కూడా విడుదల చేసింది.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రపంచ  టాప్ 100  యూనివర్సిటీ ల లో ఒకటి,దేశం లో 5 వ స్థానం లో ఉంది.ఇందులో పీజీ చేస్తే ,చాలా తొందరగా కెరీర్ placement పొందవచ్చు. అంతే కాదు ఇక్కడ పీజీ చేసిన  వారికి సొసైటీ లో ఎంతో గౌరవం లభిస్తుంది. 
నోటిఫికేషన్, అప్లై ప్రారంభ,చివరి తేదీ ,ఫీజు వివరాలు:

కొన్ని ముఖ్యమైన పీజీ కోర్సులు,సీట్ల సంఖ్య  అర్హతలు, పరీక్షా తేదీలు:

ఎమ్మెస్సీ కోర్సులు:




MA కోర్సులు:




5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ లు:






PSLV సి- 45 వాహక నౌక ప్రయోగం విజయవంతం:EMISAT ని కక్ష్య లో ప్రవేశ పెట్టిన వాహక నౌక.


ఈ రోజు ఉదయం 9.27 నిమిషాలకు శ్రీహరి కోట లోని సతీష్ ధావన్ స్పేస్ లాంచ్ కేంద్రం నుండి భారత్ కి చెందిన రక్షణ సంబంధ ఉపగ్రహం EMISAT ను PSLV C-45 వాహక నౌక ద్వారా విజయవంతంగా ప్రవేశ పెట్టడం జరిగింది.దీనితో పాటు ఇతర దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను కూడా నిర్ణీత కక్ష్య  లో ప్రవేశ పెట్టింది .EMISAT ను (ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్.బెంగళూరు) ISRO మరియు DRDO (డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. హైదరాబాద్)లు సంయుక్తంగా  'ప్రాజెక్ట్ కౌటిల్య' లో భాగంగా తయారు చేశాయి.EMISAT అనేది ఆకాశములో మన సైన్యానికి ఒక SPY లాంటి సాటిలైట్.ఇది శత్రు దేశ రాడార్లను గమనిస్తూ మన సైన్యానికి ఫోటోలను పంపుతుంది.ఇక మిగతా 28 శాటిలైట్ ల లో ఒక్క అమెరికా వే 20 శాటిలైట్ లు కాగా,

మిగిలిన వి లిథువేనియా-1,స్విట్జర్లాండ్-1,స్పెయిన్-1   చొప్పున శాటిలైట్ లు.EMISAT ను భూమినుండి 748 కి.మీ ల కక్ష్య లో మిగితా వాటిని 500.కి.మీ ఎత్తు గల కక్ష్య లో ప్రవేశ పెట్టింది.ఈ ప్రయోగానికి వాడిన వాహక నౌక పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికిల్(PSLV)C-45 .