Wednesday, 5 June 2019

6 నెలల లోగా యూనివర్సిటీ అధ్యాపకుల పోస్టుల ను భర్తీ చేయాలి:ఉపకులపతులకు యూజీసీ లేఖ


దేశం లోని అన్ని విశ్వవిద్యాలయాలలో తగినంత మంది ఆచార్యులు లేక విశ్వవిద్యాలయాల లో బోధన కుంటుపడుతుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.అందుకే ఆరు నెలల్లోనే అన్ని విశ్వవిద్యాలయాల లో ఆచార్యుల భర్తీ ప్రక్రియ పూర్తి కావాలని యూజీసీ ని ఆదేశించింది.

దీనికి స్పందించిన యూజీసీ 6 నెల లలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని యూనివర్సిటీ ల వీసీ లకు లేఖ రాసింది.15 రోజులలో ఖాళీ ల సంఖ్య గుర్తింపు,30 రోజులలో అనుమతి మరియు నోటిఫికేషన్ జారీ ఇలా చాలా స్పష్టంగా సూచిస్తూ లేఖ రాసింది.ఇక ఉపకులపతులు దీనిని ఆచరించడమే తరువాయి.

Visit for more updates daily.
www.paatshaalaindia.blogspot.com

Monday, 3 June 2019

2020 సంవత్సరానికి సంబంధించి భర్తీ చేయబోయే ఉద్యోగాల ఆన్యువల్ కేలండర్ ను విడుదల చేసిన UPSC.


UPSC దేశం లోని వివిధ కేంద్ర శాఖలలో ని అత్యున్నత ఉద్యోగాలను భర్తీ చేసే స్వతంత్ర రాజ్యాంగ బద్ద సంస్థ.ప్రతీ సంవత్సరం భర్తీ చేసే ఉద్యోగాల కేలండర్ ను ముందుగానే తేదీల తో సహా ప్రకటించడం ఆనవాయితీ.ఈ సారి కూడా సివిల్ సర్వీసెస్ మరియు IFS ప్రిలిమ్స్ పరీక్ష మే 2 న పూర్తి కాగానే , వచ్చే సంవత్సరం అంటే 2020 సంవత్సరం లో భర్తీ చేయ బోయే ఉద్యోగాల ,నోటిఫికేషన్ తేదీ,అప్లికేషను ప్రారంభ తేదీ,చివరి తేదీ,పరీక్ష తేదీ ,ఫలితాల తేదీలను ప్రకటించింది. దీని ప్రకారం 2020 సంవత్సరం లో మొదటి పరీక్ష ఇంజినీరింగ్  సర్వీస్ ఉద్యోగాల తో ప్రారంభం కానుంది.2020 లో సివిల్ సర్వీసెస్ ,IFS ల ప్రిలిమ్స్ నోటిఫికేషన్ February 20 న ప్రారంభం అయ్యి, మార్చ్ 3, 2020 రోజున ముగుస్తుంది. ప్రిలిమ్స్ పరీక్ష మే 3,2020 రోజున జరుగనుంది. పూర్తి సమాచారం ఇలా ఉంది.



మరిన్ని వార్తల కొరకు సందర్శించండి...
www.paatshaalaindia.blogspot.com

DEE-CET( డైట్ సెట్) ఫలితాల విడుదల


డీఈఈ సెట్ 2019 ఫలితాలను నిన్న సోమవారం పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. డీ.ఎడ్ మరియు డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(DPSE) కోర్సులలో ప్రవేశానికి గతనెల 22    DEECET 2019- నిర్వహించారు.మొత్తం19,190     
మంది హాజరయ్యారు. ఇందులో తెలుగు మీడియం 5846,ఇంగ్లీష్ మీడియం 5266 ,ఉర్దూ మీడియం 1065 మంది అర్హతను సాధించారు.అభ్యర్థులు రాంక్ కార్డ్ ను TS-DEECET వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.తెలంగాణ లో 188 కళాశాలలో 11,550 సీట్లు ఉన్నాయి.ఈ నెల 15 తర్వాత కౌన్సెలింగ్ ఉంటుంది.

గ్రూప్‌-2 ఎంపిక ప్రక్రియ కు తొలగిన అడ్డంకి : తుది ఫలితాల కు కోర్టు అనుమతి




  •  వైట్ నర్ వాడిన వారు, డబుల్ బుబ్లింగ్ చేసిన వారి పేపర్ లను సాంకేతిక నిపుణుల సహాయంతో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచన : 

తెలంగాణ  గ్రూప్‌-2 బబ్లింగ్‌, వైట్‌నర్‌ వివాదంపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. సాంకేతిక కమిటీ సిఫార్సుతో ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియలో బబ్లింగ్‌, వైట్‌నర్‌ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ చక్రపాణి హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు త్వరలోనే మెరిట్‌ జాబితా, ఇంటర్వ్యూ షెడ్యూల్‌ ప్రకటిస్తామన్నారు.దీంతో ఎంతో మంది నిరుద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

Sunday, 2 June 2019

లా సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల


న్యాయ విద్య లో డిగ్రీ ,పీజీ కోర్సు చేయడానికి అర్హత పరీక్ష లాసెట్ 2019 ఫలితాలు నిన్న ఆదివారం విడుదల అయ్యాయి. ఈ పరీక్ష మే 20 న జరిగింది.మొత్తం 19,188 మంది పరీక్ష రాయగా..15,504 మంది  అంటే 80.80 శాతం అర్హత సాధించారు.లా డిగ్రీ లో 3 ఏళ్ల డిగ్రీ కోర్సు,5 ఏళ్ల డిగ్రీ కోర్సు(ఇంటర్ పాస్ అయిన వారికి) లు ఉంటాయి.విద్యార్థులు లాసెట్ వెబ్సైట్ నుండి రాంక్ కార్డులను పొందవచ్చు అని లాసెట్ కన్వీనర్ GB .రెడ్డి తెలిపారు.



మరిన్ని updates కోసం visit చేయండి
www.paatshaalaindia.blogspot.com