Wednesday, 13 March 2019

అన్ని సెంట్రల్ యూనివర్సిటీ ల ఉమ్మడి పీజీ ఎంట్రన్స్(CU-CET -2019) కి నోటిఫికేషన్ విడుదల


దేశం లో ఉన్న 14 సెంట్రల్ యూనివర్సిటీ లు మరియు   డాక్టర్  BR. అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్ష కు (CU-CET -2019) ,అన్ని సబ్జెక్టు ల నోటిఫికేషన్ ను ఉమ్మడి గా విడుదల చేయడం జరిగింది.దీనివల్ల విద్యార్థి కి తాను నచ్చిన యూనివర్సిటీ లు అన్నిటికీ అప్లికేషన్ పెట్టి ఒకే పరీక్ష రాస్తే సరిపోతుంది.దీని వల్ల విద్యార్థి ఆర్థికంగా, సమయం పరంగా ఎంతో లభ్ది పొందుతాడు.కాబట్టి విద్యార్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలి.అప్లై ఆన్లైన్ విధానంలోనే.ఈ పరీక్ష లో వచ్చిన రాంక్ ఆధారంగా ,దేశం లోని ఏ సెంట్రల్ వర్సిటీ లోనైనా సీటు పొందవచ్చు.

ముఖ్య తేదీలు

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 13 మార్చి,2019.
అప్లికేషన్ చివరి తేదీ: 13 ఏప్రిల్,2019.
అడ్మిట్ కార్డు ఇవ్వబోవు ప్రారంభ తేదీ:మే 10,2019.
పరీక్ష తేదీ: మే 25 & 26,2019.
ఫలితాల ప్రకటన:జూన్ 21,2019.
మరిన్ని వివరాలకు ఆయా యూనివర్సిటీల వెబ్సైట్ లను సందర్శించండి.

Tuesday, 12 March 2019

నేటితో వరల్డ్ వైడ్ వెబ్ కి 30 ఏళ్ళు



ప్రపంచానికి వరల్డ్ వైడ్ వెబ్ ని 1989 లో పరిచయం చేసింది టీమ్ బెర్నర్స్ లీ.
30 సంవత్సరాల క్రితం లీ సమాచారాన్ని రెండు వేరు వేరు కంప్యూటర్ ల మధ్య  ఉచితంగా షేర్ చేసుకోవడానికి అతడు చేసిన ప్రయత్నం అతడు ఊహించనంత గా విస్తరించి ఇప్పుడు అది లేకుండా ప్రపంచ మనుగడే లేనంతగా అభివృద్ధి చెందింది. టిమ్ బెర్నర్స్ లీ యూరోపియన్ కౌన్సిల్ ఫర్ న్యూక్లియర్ రీసర్చ్ (CERN )
 లో పని చేసేటప్పుడు డాకుమెంట్స్ ని, ఫైల్స్ ని షేర్ చేసుకోవడానికి అతడు వరల్డ్ వైడ్ వెబ్ ను కనుగొన్నాడు.
నేటికీ 30 సంవత్సరాలు ఐన సందర్బంగా గూగుల్ వరల్డ్ వైడ్ వెబ్ ని డూడుల్ గా చేసి గౌరవించింది.థాంక్స్ తో టిమ్ బెర్నర్స్ లీ ... థాంక్స్ టు  W. W. W .

Monday, 11 March 2019

ఎస్సై,కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ ఖరారు


దాదాపు 18,248 సంఖ్యలో పోలీస్ ఉద్యోగాల కై నిర్వహించిన ఫిజికల్ టెస్టులు ముగియడం తో ఇక వీటికి సమందించిన రాత పరీక్ష ను వచ్చే నెల 20 వ తేదీ నుండి నిర్వహించ నున్నట్లు పోలీస్ రెక్రూట్ మెంట్ బోర్డ్ తెలిపింది.దీనికి సంబంధించిన పూర్తు వివరాలకై బోర్డ్ వెబ్సైట్ లో చూడవచ్చు.ఈ ఉద్యోగాల లో కానిస్టేబుల్ ,సివిల్ ,రిజర్వ్ అలాగే ఏఎస్సై, ఎస్సై సివిల్,రిజర్వ్ డ్ ఎస్సై వంటి పోస్టులు ఉన్నాయి.