Friday, 7 August 2020

కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది

కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది ఎయిర్ ఇండియా కు చెందిన విమానం అదుపుతప్పి 30 అడుగుల  ఎత్తు నుండి రన్ వే పై కుప్పకూలింది దీనిలో దాదాపు 191 ప్రయాణికులు ప్రయాణిస్తుండగా 16 మంది మృతి చెందారని సమాచారం 131 మంది గాయాల పాలయ్యారు ఈ విమానం దుబాయ్ నుండి కేరళకు వచ్చిందని ల్యాండ్ అయ్యే సమయంలో కుప్పకూలింది అని సమాచారం

Wednesday, 5 August 2020

2019- సివిల్ సర్వీసెస్ ఫలితాలను విడుదల చేసిన యూపీఎస్సీ


ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల తాజా ఫలితాల్లో 829 మంది విజయం సాధించారు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన 2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో హర్యానాకు చెందిన ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంక్ సాధించారు ఢిల్లీకి చెందిన జతిన్ కిషోర్ ద్వితీయ, ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రతిభ వర్మ తృతీయ స్థానాల్లో నిలిచారు మహిళల్లో ప్రతిభ వర్మ అగ్రస్థానంలో నిలవడం విశేషం 15 రోజుల్లో అభ్యర్థుల మార్కులను వెబ్ సైట్ లో ఉంచునట్లు యూపీఎస్సీ స్పష్టం చేసింది తెలంగాణ, ఏపీ నుండి  సుమారుగా 50 మంది ఎంపికవ్వడం విశేషం

Tuesday, 4 August 2020

విద్యార్థుల కు గుడ్ న్యూస్:త్వరలోనే 'ప్రజ్ఞత' పేరుతో వీడియో పాఠాలు


                                                                   
కేంద్ర ప్రభుత్వం  'ప్రజ్ఞత'  పేరుతో
ఆన్లైన్, డిజిటల్ విద్య పై రూపొందించిన. మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం టైం టేబుల్ సిద్ధం చేస్తుంది
                                      
TS లో ఆగస్టు 15 నుండి 6 వ  తరగతి  నుంచి10 వ తరగతి విద్యార్థులకు  వీడియో  పాఠాలు   ప్రసారం  చేసేందుకు  పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే 900 పైచిలుకు డిజిటల్ పాఠాలను రూపొందించగా టిశాట్,దూరదర్శన్ యాదగిరి  చానళ్ల  ద్వారా  పాఠాలు ప్రసారం చేయనుంది

-Sai