Saturday, 29 August 2020

ఇకపై మాస్కులు లేకుంటే....గాలిలో ఎగరలేము...!


*డిజెసిఎ కొత్త నిబంధనలు
* దేశీయంగా ప్రీ- ప్యాక్డ్ భోజనాలు, పానీయాలకు అనుమతి

దేశంలో కరోనా కట్టడికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై మాస్క్ లేకుండా ఎవరు విమాన ప్రయాణం చేయరాదని తేల్చిచెప్పిందిఅంతేకాదు విమానంలో ఫేస్ మాస్క్ ధరించడానికి నిరాకరించిన ఏ ప్రయాణీకుడినైనా విమానయాన సంస్థ నో-ఫ్లై జాబితాలో ఉంచవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ప్రస్తుత డీజీసీఏ నిబంధనల ప్రకారం విరుద్ధంగా ప్రవర్తించే ప్రయాణీకులపై చర్యలకు ఎయిర్‌లైన్స్,  క్యాబిన్ సిబ్బందికి అధికారం ఉందని వెల్లడించింది.
గురువారం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, దేశీయ విమానాలలో ముందుగా ప్యాక్ చేసిన స్నాక్స్, భోజనం, ఇతర పానీయాలకు అనుమతి ఉంటుంది. విమానయాన వ్యవధిని బట్టి దేశీయ విమానాలలో ప్రీ-ప్యాక్డ్  భోజనం, పానీయలను అందించవచ్చు.

Friday, 28 August 2020

వచ్చే నెల 14 నుండి డిగ్రీ పరీక్షలు...?


తెలంగాణలో డిగ్రీ ,పీజీ పరీక్షలపై ఉన్నత విద్యా మండలి యూనివర్సిటీ రిజిస్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది సెప్టెంబర్ 14 నుండి డిగ్రీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు, యూనివర్సిటీలు పరీక్షల షెడ్యూల్ ని రెండు  రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది అటు పీజీ ,డిగ్రీ బ్యాక్ లాగ్ పరీక్షలు అక్టోబర్ లో నిర్వహించాలని, ఇందుకు UGC (University Grants Commission ) అనుమతి తీసుకోవాలని నిర్ణయించింది

Wednesday, 26 August 2020

తెలంగాణ రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం......!


రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది సెప్టెంబర్ 1 నుండి ప్రతి పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే కేవలం ఉపాధ్యాయులు మాత్రమే హాజరు కావలెను విద్యార్థులు ఇంటి నుండే ఆన్లైన్ క్లాసుల ద్వారా పాఠాలను వినాలని రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించింది