Saturday, 27 August 2016

ఇంటర్ చదివి స్టార్టప్ కంపెనీని పెట్టి, రూ. 6,030 కోట్లకు విక్రయించిన ముంబై సోదరులు

తాము నడుపుతున్న చిన్న ఎడ్వర్ టయిజింగ్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీని చైనాకు చెందిన సంస్థకు విక్రయించడం ద్వారా ఇద్దరు ముంబై సోదరులు బిలియనీర్లు అయిపోయారు. వారే 34 సంవత్సరాల దివ్యాంక్ తురాఖియా, అతని అన్న 36 ఏళ్ల భావిన్. ముంబైలోని జుహు, అంధేరీ ప్రాంతాల్లో పెరిగిన వీరు తాము నడుపుతున్న 'మీడియా డాట్ నెట్'ను చైనాకు చెందిన లిస్టెడ్ సంస్థ బీజింగ్ మినెనో కమ్యూనికేషన్ టెక్నాలజీకి 900 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 6,030 కోట్లు) విక్రయించారు. ఇది పూర్తి క్యాష్ డీల్ కావడం గమనార్హం. ప్రపంచ వ్యాపార ప్రకటనల సాంకేతిక రంగంలో ఇప్పటివరకూ యాడ్ మాబ్ ను 750 మిలియన్ డాలర్లు వెచ్చించి గూగుల్ స్వాధీనం చేసుకున్నదే అతిపెద్ద డీల్ కాగా, ఇప్పుడు దాన్ని ఈ ముంబై సోదరులు దాటేశారు. కాగా వీరిద్దరూ వివిధ విభాగాల్లో మొత్తం 11 స్టార్టప్ కంపెనీలను నిర్వహిస్తుండటం గమనార్హం. ఇంతకూ వీరు చదివింది ఏంటో తెలుసా? ఇంటర్ మాత్రమే. బీకాం చేరదామని భావించిన ఈ సోదరులు కాలేజీలో చేరి ఆపై మానేశారు. ఇప్పుడు వ్యాపార భారతావనిలో సత్తా చాటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.

Friday, 26 August 2016

సివిల్స్ వయోపరిమితి 26&అవకాశాలు 4:-బాస్వాన్ కమిటీ సిఫారసులు

clip;

Thursday, 25 August 2016

GK-నదులు-పట్టణాలు1

right CLICK.>>>OPEN IN న్యూ TAB

సివిల్స్ వయోపరిమితి తగ్గింపు ?

త్వరలో తెలంగాణా లో యూనివర్సిటీ అద్యాపకుల పోస్టులు భర్తీ

త్వరలో వర్సిటీల అధ్యాపక పోస్టుల భర్తీ

 August 25, 2016 02:13 (IST)
నిబంధనలపై కసరత్తు చేస్తున్న అధికారులు
వర్సిటీల వారీగా ఖాళీలపై ప్రతిపాదనల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్‌
: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఇటీవల వైస్‌ చాన్స్‌లర్లను నియమించిన ప్రభుత్వం.. వాటిలో అధ్యాపక పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,528 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నియామక నిబంధనలు ఎలా ఉండాలన్న అంశాలపై దృష్టి సారించింది. అధ్యాపక పోస్టుల భర్తీలో అనుసరించాల్సిన నిబంధనలపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటికి అనుగుణంగా రాష్ట్రంలో అధ్యాపకుల నియామకాల నిబంధనలను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన విద్యా శాఖ సమీక్ష సమావేశంలో యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై చర్చించారు.

ఆయన ఆదేశాల మేరకు అధికారులు నియామకాల కోసం కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,528 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 323 ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉండగా, 687 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 518 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో యూనివర్సిటీల్లో విద్యా కార్యక్రమాలు కుంటుపడ్డాయి. అయితే అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలంటే కచ్చితంగా వైస్‌ చాన్స్‌లర్‌ ఉండాల్సిందే.  ఇటీవల 10 వర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం ఇపుడు అధ్యాపకుల భర్తీపై దృష్టి సారించింది. డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ కోటా కింద భర్తీ చేయాల్సిన పోస్టులపై ఆయా యూనివర్సిటీల వీసీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది.

వర్సిటీల, కేటగిరీల వారీగా ఖాళీలు
యూనివర్సిటీ    ప్రొఫెసర్‌   అసోసియేట్‌ ప్రొఫెసర్‌   అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌     మొత్తం
          
ఆర్‌జీయూకేటీ    23              41                         61              125
శాతవాహన        9               16                       15                 40
మహాత్మాగాంధీ    10             15                          9                34
అంబేడ్కర్‌ ఓపెన్‌    8              12                       10                 30
కాకతీయ           53              88                        69               210
తెలుగు            9                    9                         14                32
జేఎన్‌ఏఎఫ్‌ఏయూ    0              7                         22                29
పాలమూరు     13                 21                       50                  84
ఉస్మానియా    147              397                    138                  682
తెలంగాణ    11                     25                        23                  59
జేఎన్‌టీయూహెచ్‌    40          56                      107                 203
మొత్తం    323                    687                         518              1528

గ్రూప్ -1 ఎస్సే -తెలంగాణా కొత్త జల ప్రాజెక్టులు ...

సర్కారు గోదారి నిద్ర
తెలంగాణ, మహారాష్ట్ర ఒప్పందాలు ఇవే..
⇒ గోదావరి జలాల  వినియోగం కోసం మంగళవారం మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావులు ముంబైలో ఒప్పందాలపై సంతకాలు చేశారు.

⇒ గోదావరి నదిపై 100 మీటర్ల ఎత్తులో 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర, తెలంగాణల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో 1.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించనున్నారు. ఈ రెండు బ్యారేజీల నుంచి రోజుకు  34,716 క్యూసెక్కుల చొప్పున 60 రోజుల్లో 180 టీఎంసీలను తరలించి.. మెదక్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా 18.19 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతోపాటూ శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాల పరిధిలోని మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది.
⇒ పెన్‌గంగపై 213 మీటర్ల ఎత్తులో 0.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఛనాఖా-కొరట బ్యారేజీ నిర్మించడానికి ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆదిలాబాద్ జిల్లాలో తాంసి, జైనథ్, బేల మండలాలకు నీటిని అందించనున్నారు.

నాసిక్‌లో జన్మించే గోదావరి నది ప్రధాన స్రవంతిపై మహారాష్ర్టలో అసంఖ్యాకంగా నిర్మించిన చిన్న, పెద్దా ప్రాజెక్టుల వల్ల తెలంగాణలోకి ప్రవేశించే సరికి ఖాళీ కుండను తలపిస్తుంది. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది కలిసేంత వరకూ గోదావరి  నిర్జీవంగానే ఉంటుంది. ప్రాణహిత కలిసిన దగ్గర నుంచి ఆ తర్వాత ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, సీలేరుల సంగమంతో అంతర్వేది వరకూ జీవకళతో గోదావరి పారుతుంది. అంటే.. ఇప్పుడు గోదావరిలో ధవళేశ్వరం వరకు ప్రవహించే జలాల్లో ఈ ఉప నదుల వాటానే ప్రధానం. ప్రాణహిత సంగమం నుంచి ధవళేశ్వరం వరకు మధ్యలో ఎక్కడా ప్రాజెక్టులు లేని కారణంగా అన్ని కాలాల్లోనూ ఈ ప్రాంతంలో గోదావరి జీవనదిలా సాగింది. రీ-డిజైనింగ్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ‘ప్రాణహిత-చేవెళ్ల’ను రూపు మార్చి కాళేశ్వరం పేరుతో ప్రాణహిత, ఇంద్రావతిల సంగమం తర్వాత మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్నది.
దాని దిగువన దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, భక్త రామదాస ప్రాజెక్టులను చేపట్టింది. 

⇒ 
తెలంగాణ, మహారాష్ట్రల మధ్య కుదిరిన ఒప్పందాలు అమల్లోకి వచ్చి.. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పూర్తయితే రోజుకు 69,248 క్యూసెక్కుల ( సుమారు 6.5టీఎంసీల) నీటిని తెలంగాణ ప్రభుత్వం గోదావరి నుంచి వాడనుంది.
⇒ మహారాష్ట్రలో గోదావరి పురుడు పోసుకునే నాసిక్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకూ నిర్మించిన 18 ప్రాజెక్టులు నిండాలంటే 174 టీఎంసీలు అవసరం. తెలంగాణలో శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లిలు నిండాలంటే మరో 110 టీఎంసీల నీళ్లు కావాలి. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన తమ్మిడిహెట్టి, మేడిగడ్డ, చనాఖా - కొరటా బ్యారేజీలు నిండాలంటే 18.087 టీఎంసీలు నీళ్లు అవసరం.
తమ్మిడిహెట్టి,  మేడిగడ్డ రిజర్వాయర్‌ల నుంచి ఎత్తిపోతల ద్వారా రోజుకు 34,716 క్యూసెక్కులు, ఆ తర్వాత దేవాదుల ద్వారా 11,200 క్యూసెక్కులు, తుపాకుగూడెం ద్వారా 18,666 క్యూసెక్కులు, సీతామారామ, భక్త రామదాస ప్రాజెక్టు ద్వారా 4,666 క్యూసెక్కులు వెరసి 69,248 క్యూసెక్కుల నీటిని తరలించనున్నారు.
గోదావరి నదిలో మూడు వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని లెక్క కట్టిన గోదావరి ట్రిబ్యునల్.. మహారాష్ట్రకు 888.90, కర్ణాటకకు 19.90, మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్‌కు 625.46, ఒడిస్సాకు 292.46 ఆంధ్రప్రదేశ్‌కు 1,172.78 టీఎంసీల(భూపాలపట్నం విద్యుత్ కేంద్రం నీటిని పునర్వియోగంతో కలిపి 1480 టీఎంసీలు) నీటిని కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా వాటాలను ఇప్పటిదాకా తేల్చలేదు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం గోదావరి జలాల్లో తమ రాష్ట్రానికి 954.23 టీఎంసీల వాటా ఉందని వాదిస్తోంది. గోదావరి నదిపై ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా 433.042 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించుకుంటోంది. ప్రస్తుతం చేపట్టి..
పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా 475.797 టీఎంసీలు.. కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల ద్వారా 45.387 టీఎంసీలు వెరసి 954.236 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి వ్యూహం రచించింది.  గోదావరి నది, ఉప నదులపై 282 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, 921 జలాశయాలు, 46 బ్యారేజీలు, 162 ఎత్తిపోతల పథకాలను ఇప్పటికే నిర్మించారు. ఇందులో అత్యధిక ప్రాజెక్టులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్‌లలో ఉన్నాయి ..

భారత జలాంతర్గామి `స్కార్పీన్ `రహస్యాల లీక్.

clip

సర్రోగసి(అద్దె గర్భం) విధానం పై బిల్లు

clip

Wednesday, 24 August 2016

గ్రూప్-2 కి స్క్రీనింగ్ పరీక్ష ?































?

సంపన్న దేశాలలో భరత్ కు 7 వ స్థానం


పాతికేళ్ళ ఇంటర్నెట్ ...

తెలంగాణ మహారాష్ట్ర చారిత్రక జల ఒప్పందం




right click>>>>>>open image in new tab

Tuesday, 23 August 2016

కరెంట్ అఫైర్స్ -ఈనాడు


right click>>>>>>open image in new tab

హిస్టరీ -ఈనాడు


right click>>>>>>open image in new tab

చైనా ను భయపెడుతున్న భారత మిస్సైల్

Monday, 22 August 2016


  • హైదరాబాద్‌ మినహా 9 జిల్లాల పునర్వ్యవస్థీకరణ
  • కొత్తగా 17 జిల్లాలు, 15 డివిజన్లు, 46 మండలాలు
  • ప్రాథమిక నోటిఫికేషన విడుదల చేసిన ప్రభుత్వం
  • సెప్టెంబరు 20 వరకూ అభ్యంతరాల స్వీకరణ
  • కలెక్టరేట్‌, సీసీఎల్‌ఏ, సచివాలయంలో ఇవ్వవచ్చు
  • అక్టోబరు రెండో వారంలో తుది నోటిఫికేషన్‌
  • ఇవే తుది ప్రతిపాదనలు కావు: మహమూద్‌ అలీ
హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): 27 జిల్లాలు..! 60 రెవెన్యూ డివిజన్లు..! 505 మండలాలు..! తెలంగాణ రాష్ట్ర తాజా స్వరూపమిది! పది జిల్లాల తెలంగాణకు కొత్తగా మరో 17 జిల్లాలు జత కూడాయి. వాటితోపాటే మరో 15 రెవెన్యూ డివిజన్లు, 46 మండలాలు కొత్తగా కలిశాయి. ఈ మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ మినహా మిగిలిన 9 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరిస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చింది. తొమ్మిది జిల్లాలకూ తొమ్మిది వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది.
 
ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రదీ్‌పచంద్ర సోమవారం జీవో నెం. 361-369 జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ముసాయిదాపై ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలను తెలపడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల వివరాలను http://newdistrictsformation.telan-gana.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. సెప్టెంబరు 20 దాకా అభ్యంతరాల స్వీకరణ, 15 రోజులపాటు వాటి పరిశీలన, అక్టోబరు రెండో వారంలో ఫైనల్‌ నోటిఫికేషన విడుదల చేయనున్నారు. అనంతరం, సచివాలయంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర, సీసీఎల్‌ఏ రేమండ్‌ పీటర్‌తో కలిసి ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ నోటిఫికేషనను విడుదల చేశారు.
 
నెల రోజులు అభ్యంతరాలు 
పది జిల్లాల తెలంగాణలో కొత్తగా మరో 17 జిల్లాలు, 15 డివిజన్లు, 46 మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చామని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ తెలిపారు. వీటిపై నెల రోజులపాటు అభ్యంతరాలను స్వీకరిస్తామని చెప్పారు. ఆ తర్వాత 15 రోజులపాటు వాటిని పరిశీలించి, తుది నోటిఫికేషన ఇస్తామని ప్రకటించారు. అభ్యంతరాలు, సూచన సలహాలను సచివాలయంతోపాటు సీసీఎల్‌ఏ, ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టరేట్లలోనూ సమర్పించవచ్చని తెలిపారు.
 
జిల్లాలు, డివిజన్లు, మండలాలపై ఇదే తుది నోటిఫికేషన్‌ కాదని, మరో రెండుసార్లు అఖిలపక్షం నిర్వహించి, ప్రజల అభ్యంతరాలు/అభిప్రాయాల మేరకు ఫైనల్‌ నోటిఫికేషన ఉంటుందని వివరించారు. 14 ఏళ్ల పోరాటంలో ప్రజలు చేసిన విజ్ఞప్తితో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. ‘‘నిజాం హయాంలో 9 జిల్లాలు ఉండేవి. గత ఆరు దశాబ్దాల్లో రంగారెడ్డి ఒక్కటే కొత్తగా ఏర్పడింది. మాకూ జిల్లా కావాలనేది ప్రజల చిరకాల డిమాండ్‌. ప్రజల కోసమే జిల్లాలు ఏర్పాటు చేశాం.
 
నాయకులు, రాజకీయ పార్టీల కోసం కాదు’’ అని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రతిపాదిత జిల్లాలు, మండలాల మ్యాపులను మంగళవారం సాయంత్రానికల్లా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసామని సీసీఎల్‌ఏ రేమండ్‌ పీటర్‌ తెలిపారు. అభ్యంతరాలు/విజ్ఙప్తులను కూడా వెబ్‌సైట్‌లో నేరుగా సమర్పించవచ్చన్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో గెజిట్‌ నోటిఫికేషన విడుదల చేస్తామని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర ప్రకటించారు.
 

న‌లుగురు క్రీడాకారుల‌కు రాజీవ్ ఖేల్ ర‌త్న.. ఆరుగురికి ద్రోణాచార్య పుర‌స్కారం.. ప్రకటించిన కేంద్రం


Mon, Aug 22, 2016, 05:27 PM
पीवी सिंधु, साक्षी मलिक, दीपा कर्मकार और जीतू राय को मिला खेल रत्‍न पुरस्‍कार                     

Related Image


                                         





న‌లుగురు క్రీడాకారుల‌కు రాజీవ్ ఖేల్ ర‌త్న పుర‌స్కారం అందించ‌నున్న‌ట్లు కేంద్రం ఈరోజు ప్ర‌క‌టించింది. పీవీ సింధు, దీపా క‌ర్మాక‌ర్‌, జీతూ రాయ్, సాక్షి మాలిక్‌ లకు రాజీవ్ ఖేల్ ర‌త్న పుర‌స్కారం ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు పేర్కొంది. అలాగే ఆరుగురికి ద్రోణాచార్య పుర‌స్కారం అందించ‌నున్న‌ట్లు తెలిపింది. దీపా క‌ర్మాక‌ర్ కోచ్ విశ్వేశ్వ‌ర్ నందికి ద్రోణాచార్య అవార్డు ప్ర‌క‌టించింది. నాగ‌పురి ర‌మేశ్‌(అథ్లెటిక్స్‌), సాగ‌ర్ మాల్ ధ్యాయ‌ల్ (బాక్సింగ్‌), రాజ్‌కుమార్ శ‌ర్మ‌ (క్రికెట్‌), ప్ర‌దీప్ కుమార్ (స్విమ్మింగ్‌), మ‌హావీర్ సింగ్ (రెజ్లింగ్‌)ల‌కు ద్రోణాచార్య పుర‌స్కారం అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Sunday, 21 August 2016

యోగేశ్వర్ దత్ ఓటమి


ఈరోజు సాయంత్రం జరిగిన 65 కిలోల ఫ్రీస్టయిల్ విభాగం క్వాలిఫికేషన్ రౌండ్లోనే యోగేశ్వర్ అపజయం పొందాడు. యోగేశ్వర్ పై మంగోలియాకు చెందిన రెజ్లర్ మందక్ నరన్ గంజోరిజ్ 3-0 తేడాతో విజయం సాధించాడు. దీంతో భారత్ పతకాల వేట ముగిసింది.

రియో ఒలింపిక్స్ లో పథకాల పట్టిక