తెలంగాణ, మహారాష్ట్ర ఒప్పందాలు ఇవే..
⇒ గోదావరి జలాల వినియోగం కోసం మంగళవారం మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావులు ముంబైలో ఒప్పందాలపై సంతకాలు చేశారు.
⇒ గోదావరి నదిపై 100 మీటర్ల ఎత్తులో 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర, తెలంగాణల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో 1.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించనున్నారు. ఈ రెండు బ్యారేజీల నుంచి రోజుకు 34,716 క్యూసెక్కుల చొప్పున 60 రోజుల్లో 180 టీఎంసీలను తరలించి.. మెదక్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా 18.19 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతోపాటూ శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాల పరిధిలోని మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది.

⇒ పెన్‌గంగపై 213 మీటర్ల ఎత్తులో 0.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఛనాఖా-కొరట బ్యారేజీ నిర్మించడానికి ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆదిలాబాద్ జిల్లాలో తాంసి, జైనథ్, బేల మండలాలకు నీటిని అందించనున్నారు.
నాసిక్‌లో జన్మించే గోదావరి నది ప్రధాన స్రవంతిపై మహారాష్ర్టలో అసంఖ్యాకంగా నిర్మించిన చిన్న, పెద్దా ప్రాజెక్టుల వల్ల తెలంగాణలోకి ప్రవేశించే సరికి ఖాళీ కుండను తలపిస్తుంది. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది కలిసేంత వరకూ గోదావరి నిర్జీవంగానే ఉంటుంది. ప్రాణహిత కలిసిన దగ్గర నుంచి ఆ తర్వాత ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, సీలేరుల సంగమంతో అంతర్వేది వరకూ జీవకళతో గోదావరి పారుతుంది. అంటే.. ఇప్పుడు గోదావరిలో ధవళేశ్వరం వరకు ప్రవహించే జలాల్లో ఈ ఉప నదుల వాటానే ప్రధానం. ప్రాణహిత సంగమం నుంచి ధవళేశ్వరం వరకు మధ్యలో ఎక్కడా ప్రాజెక్టులు లేని కారణంగా అన్ని కాలాల్లోనూ ఈ ప్రాంతంలో గోదావరి జీవనదిలా సాగింది. రీ-డిజైనింగ్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ‘ప్రాణహిత-చేవెళ్ల’ను రూపు మార్చి కాళేశ్వరం పేరుతో ప్రాణహిత, ఇంద్రావతిల సంగమం తర్వాత మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్నది.
దాని దిగువన దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, భక్త రామదాస ప్రాజెక్టులను చేపట్టింది.
⇒ తెలంగాణ, మహారాష్ట్రల మధ్య కుదిరిన ఒప్పందాలు అమల్లోకి వచ్చి.. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పూర్తయితే రోజుకు 69,248 క్యూసెక్కుల ( సుమారు 6.5టీఎంసీల) నీటిని తెలంగాణ ప్రభుత్వం గోదావరి నుంచి వాడనుంది.
⇒ మహారాష్ట్రలో గోదావరి పురుడు పోసుకునే నాసిక్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకూ నిర్మించిన 18 ప్రాజెక్టులు నిండాలంటే 174 టీఎంసీలు అవసరం. తెలంగాణలో శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లిలు నిండాలంటే మరో 110 టీఎంసీల నీళ్లు కావాలి. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన తమ్మిడిహెట్టి, మేడిగడ్డ, చనాఖా - కొరటా బ్యారేజీలు నిండాలంటే 18.087 టీఎంసీలు నీళ్లు అవసరం.
⇒తమ్మిడిహెట్టి, మేడిగడ్డ రిజర్వాయర్‌ల నుంచి ఎత్తిపోతల ద్వారా రోజుకు 34,716 క్యూసెక్కులు, ఆ తర్వాత దేవాదుల ద్వారా 11,200 క్యూసెక్కులు, తుపాకుగూడెం ద్వారా 18,666 క్యూసెక్కులు, సీతామారామ, భక్త రామదాస ప్రాజెక్టు ద్వారా 4,666 క్యూసెక్కులు వెరసి 69,248 క్యూసెక్కుల నీటిని తరలించనున్నారు.
గోదావరి నదిలో మూడు వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని లెక్క కట్టిన గోదావరి ట్రిబ్యునల్.. మహారాష్ట్రకు 888.90, కర్ణాటకకు 19.90, మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్‌కు 625.46, ఒడిస్సాకు 292.46 ఆంధ్రప్రదేశ్‌కు 1,172.78 టీఎంసీల(భూపాలపట్నం విద్యుత్ కేంద్రం నీటిని పునర్వియోగంతో కలిపి 1480 టీఎంసీలు) నీటిని కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా వాటాలను ఇప్పటిదాకా తేల్చలేదు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం గోదావరి జలాల్లో తమ రాష్ట్రానికి 954.23 టీఎంసీల వాటా ఉందని వాదిస్తోంది. గోదావరి నదిపై ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా 433.042 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించుకుంటోంది. ప్రస్తుతం చేపట్టి..
పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా 475.797 టీఎంసీలు.. కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల ద్వారా 45.387 టీఎంసీలు వెరసి 954.236 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి వ్యూహం రచించింది. గోదావరి నది, ఉప నదులపై 282 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, 921 జలాశయాలు, 46 బ్యారేజీలు, 162 ఎత్తిపోతల పథకాలను ఇప్పటికే నిర్మించారు. ఇందులో అత్యధిక ప్రాజెక్టులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్‌లలో ఉన్నాయి ..

0 comments:
Post a Comment