Saturday, 27 April 2019

ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ పథకం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం :ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్


చదువు కోవడానికి ఆర్థిక స్థోమత లేని విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్' పథకాన్ని ప్రవేశపెట్టింది.ఇది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఒక మంచి అవకాశం. ఇందులో దాదాపు 22 రకాల లోన్ లు ఉన్నాయి.

 ఈ పథకానికి ఉండవలసిన అర్హతలు:
1.విద్యార్థి ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి
2.భారతీయుడు అయి ఉండాలి
3.విద్యార్థి తల్లిదండ్రుల కు ఆదాయం సర్టిఫికెట్ ఉండాలి.

ఈ లోన్ కి అప్లై చేయాలంటే ముందుగా www.vidyalakshmi.co.in లో విద్యార్థి తన డీటైల్స్ ని నమోదు చేసుకోవాలి. ఈ వివరాలను వివిధ బ్యాంకులు వెరిఫై చేసి ఒక వేళ అన్ని అర్హతలు ఉంటే విధార్థి అకౌంట్ లోకి నేరుగా లోన్ డబ్బులు జమ చేస్తాయి.ఒక విద్యార్థి ఒకే సారి 3 బ్యాంకుల కు అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది.వీటిలో ఏ బ్యాంకు తక్కువ వడ్డీ ఇస్తే దాన్ని విద్యార్థి ఎంచుకోవచ్చు
క్రింది బ్యాంకులు ఈ లోన్ లను అందజేస్తున్నాయి.
 

సందర్శించండి...
www.paatshaalaindia.blogspot.com


Friday, 26 April 2019

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అర్హత పరీక్ష వాయిదా.


అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అర్హత పరీక్ష  2019 ఈ నెల 28 వ తేదీన జరగాల్సి ఉండేది.

అయితే వివిధ కారణాల వల్ల ఈ పరీక్ష తేదీని జూన్ 2 వ తేదీ కి   వాయిదా వేసినట్టు యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటన లో తెలిపారు.కాబట్టి ఈ పరీక్షకు అప్లై చేసుకోవడానికి గడువు తేదీని మే 18 వరకు పొడిగించారు.అప్లై చేయడానికి www.braouonline.in వెబ్సైట్ ద్వారా అప్లై చేయవచ్చు.

Visit daily for more updates
www.paatshaalaindia.blogspot.com

ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఈ నెల 12 వ తేదీన స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు.


ఈ నెల 11 న జరిగిన లోక్ సభ  ఎన్నికల  విధుల్లో పాల్గొన్న  ఉద్యోగులకు ఎన్నికల తేదీ తెల్లవారుజామున అంటే ఈ నెల 12 వ తేదీన స్పెషల్ క్యాజువల్ లీవ్ ను ఇస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారి శ్రీ రజత్ కుమార్ సైనీ కి అదేశాలి ఇచ్చారు. ఈ ఉత్తర్వులు ప్రతీ జిల్లా ఎన్నికల నియంత్రణ అధికారులకు పంపించారు.ఈ లీవ్ ను పొందాలంటే ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు డ్యూటీ సర్టిఫికెట్ కాపీ ని సమర్పించాల్సి ఉంటుంది.

పాలీ సెట్ ఫలితాలు విడుదల:92 శాతం ఉత్తీర్ణత


సాంకేతిక విద్యా శాఖ కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్ గారి సమక్షం లో నిన్న
పాలీ సెట్ 2019 ఫలితాలు విడుదల చేయడం జరిగింది.టెన్త్ పాస్ అయిన విధ్యార్తులు 3 సంవత్సరాల పాలీ టెక్నిక్ డిప్లొమా చేయడానికి నిర్వహించిన ఈ పరీక్షలో 92.53 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు.అయితే ఈ సారి మొదటి ర్యాంకు 6 గురు విద్యార్థుల ను వరించింది.ఈ ఆరుగురు విద్యార్థులకు 120 మార్కులు రావడం వల్ల అందరికీ మొదటి ర్యాంకు ను ఇచ్చారు.తరువాత 7 వ ర్యాంకు ను ఇచ్చారు మొదటి ర్యాంకును సాధించిన వారిలో మనకాల సృజన,అర్రూరి సాత్విక్,చిట్యాల సాయి ఆశీష్ రెడ్డి,దోసకాయల సుమంత్ ,కర్నాటి సాయి శ్రీహితా రెడ్డి ,తన్నీరు వారున తేజ లు ఉన్నారు.

మొత్తం 1 లక్షా మూడువేల ఐదు వందల ఎనభై ఏడు విద్యార్థులు  ఈ పరీక్ష రాయగా 95,850 మంది ఉత్తీర్ణులు అయ్యారు.ఈ పరీక్షలో oc,bc విద్యార్థులకు కనీస అర్హత 30 మార్కులు కాగా ,sc,st విధ్యార్తుఅల్కు 1 మార్కు.మే నెల మొదటి వారం లో కౌన్సిలింగ్ ఉంటుంది.జూన్ 1 నుండి తరగతులు ప్రారంభమవుతాయి.


ట్రిపుల్ ఐటీ -2019 (RGUKT) నోటిఫికేషన్ విడుదల


తెలంగాణా లోని బాసర లో గల ఏకైక ట్రిపుల్ ఐటీ ప్రాంగణం లో నిన్న ట్రిపుల్ ఐటీ -2019 (RGUKT) నోటిఫికేషన్ విడుదల చేశారు.టెన్త్ పాస్ అయిన గ్రామీణ విద్యార్థుల కు అత్యుత్తమ విద్య ను అందించడానికి ఈ ట్రిపుల్ ఐటీ ని ఏర్పాటు చేశారు.ఈ సంవత్సరం 1000 సీట్లను భర్తీ చేస్తారు.

అప్లై చేసుకోవడానికి ఈ నెల 29 నుండి ఆన్ లైన్ లో ప్రక్రియ ప్రారంభం అవుతుంది.మే 24 వ తేదీ చివరి గడువు.ఇందులో సెలెక్ట్ అయిన వారికి 6 ఏళ్ళ ఇంజనీరింగ్ విద్యను అందిస్తారు.ఈ ఎంపిక లో రిజర్వేషన్లు పాటిస్తారు.జిల్లా,మున్సిపల్,గ్రామీణ పాఠశాల ల లో చదివిన వారికి వెనుకబాటు సూచీ ని బట్టి 0.4 జీపీఏ ని కలుపుతారు.
మరిన్ని వివరాలకు admissions@rgukt.ac.in website లో చూడండి.

TS -SET అప్లికేషన్ గడువు పొడిగింపు


తెలంగాణ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ (TS-SET-2019) అప్లికేషన్ గడువును ఈ నెల 26 వరకు ఉండేది.అయితే ఇప్పుడు ఈ తేదీని వచ్చే నెల 3 వ తేదీ వరకు పొడిగించారు.దీని వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

మరిన్ని అప్ డేట్స్ కోసం visit చేయండి ప్రతీ రోజు
www.paatshaalaindia.blogspot.com


Thursday, 25 April 2019

ఎస్సై మెయిన్స్ పరీక్ష కీ విడుదల


తెలంగాణా రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగానికి తుది రాత పరీక్షలు  ఈ నెల 19 ,20 తేదీల లో జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష యొక్క కీ ని TSLPRB వెబ్ సైట్ లో ఉంచారు.అభ్యర్థులు చూసుకోగలరు.

ఈ పరీక్షల ద్వారా 1217 ఎస్సై పోస్టులు భర్తీ అవుతున్నాయి.
ఇక కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఈ నెల 28 నుండి జరుగుతాయి.వీరికి ఈ నెల 22 నుండి హాల్ టికెట్లు ఇవ్వబడుతున్నాయి.హాల్ టికెట్ డౌన లోడ్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే support@tslprb కి మెయిల్ చేయొచ్చు.

సందర్శించండి
www.paatshaalaindia.blogspot.com

ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అందరికి ఉచితంగా రీ వెరిఫికేషన్:బోర్డు ప్రకటన


ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులు అందరికీ రీ వెరిఫికేషన్ చేస్తామని ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది.ఇంటర్ ఫలితాలలో నెలకొన్న గందరగోళం దరిమిలా ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా ,ఎలాంటి దరఖాస్తు లేకుండానే రీవేరిఫికేషన్ చేస్తామని విచారణ కమిటీ ఇంచార్జ్ బి. జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు వాపస్ చేస్తామని తెలిపారు.

అయితే పాసై రీవెరిఫికేషన్ కి దరఖాస్తు చేసిన వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి.ఇప్పటికే రీవెరిఫికేషన్ కోసంప్రతిజిల్లాలోక్యాంప్ఆఫీసులు,చీఫ్ఎక్జామినర్స్,ఎక్జామినర్స్,సహాయక  ఎక్జామినర్స్ ని నియమించి వారికి సూచనలు చేసినట్టు బోర్డు అధికారులు తెలిపారు.
Visit for more updates

www.paatshaalaindia.blogspot.com