సాంకేతిక విద్యా శాఖ కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్ గారి సమక్షం లో నిన్న
పాలీ సెట్ 2019 ఫలితాలు విడుదల చేయడం జరిగింది.టెన్త్ పాస్ అయిన విధ్యార్తులు 3 సంవత్సరాల పాలీ టెక్నిక్ డిప్లొమా చేయడానికి నిర్వహించిన ఈ పరీక్షలో 92.53 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు.అయితే ఈ సారి మొదటి ర్యాంకు 6 గురు విద్యార్థుల ను వరించింది.ఈ ఆరుగురు విద్యార్థులకు 120 మార్కులు రావడం వల్ల అందరికీ మొదటి ర్యాంకు ను ఇచ్చారు.తరువాత 7 వ ర్యాంకు ను ఇచ్చారు మొదటి ర్యాంకును సాధించిన వారిలో మనకాల సృజన,అర్రూరి సాత్విక్,చిట్యాల సాయి ఆశీష్ రెడ్డి,దోసకాయల సుమంత్ ,కర్నాటి సాయి శ్రీహితా రెడ్డి ,తన్నీరు వారున తేజ లు ఉన్నారు.
మొత్తం 1 లక్షా మూడువేల ఐదు వందల ఎనభై ఏడు విద్యార్థులు ఈ పరీక్ష రాయగా 95,850 మంది ఉత్తీర్ణులు అయ్యారు.ఈ పరీక్షలో oc,bc విద్యార్థులకు కనీస అర్హత 30 మార్కులు కాగా ,sc,st విధ్యార్తుఅల్కు 1 మార్కు.మే నెల మొదటి వారం లో కౌన్సిలింగ్ ఉంటుంది.జూన్ 1 నుండి తరగతులు ప్రారంభమవుతాయి.




0 comments:
Post a Comment