తెలంగాణా లోని బాసర లో గల ఏకైక ట్రిపుల్ ఐటీ ప్రాంగణం లో నిన్న ట్రిపుల్ ఐటీ -2019 (RGUKT) నోటిఫికేషన్ విడుదల చేశారు.టెన్త్ పాస్ అయిన గ్రామీణ విద్యార్థుల కు అత్యుత్తమ విద్య ను అందించడానికి ఈ ట్రిపుల్ ఐటీ ని ఏర్పాటు చేశారు.ఈ సంవత్సరం 1000 సీట్లను భర్తీ చేస్తారు.
అప్లై చేసుకోవడానికి ఈ నెల 29 నుండి ఆన్ లైన్ లో ప్రక్రియ ప్రారంభం అవుతుంది.మే 24 వ తేదీ చివరి గడువు.ఇందులో సెలెక్ట్ అయిన వారికి 6 ఏళ్ళ ఇంజనీరింగ్ విద్యను అందిస్తారు.ఈ ఎంపిక లో రిజర్వేషన్లు పాటిస్తారు.జిల్లా,మున్సిపల్,గ్రామీణ పాఠశాల ల లో చదివిన వారికి వెనుకబాటు సూచీ ని బట్టి 0.4 జీపీఏ ని కలుపుతారు.
మరిన్ని వివరాలకు admissions@rgukt.ac.in website లో చూడండి.




0 comments:
Post a Comment