Saturday, 3 September 2016

పదివేల టీచర్ పోస్టులు!

-దసరా సందర్భంగా నోటిఫికేషన్ 
- టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ 
- కొత్త ఏడాదిలో నూతన టీచర్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో మరింత వేగం పెంచింది. ఇప్పటికే సాంకేతిక ఉద్యోగాలు, శాంతిభద్రతల విభాగంలోని ఖాళీలు, అనంతరం గ్రూప్ -2 క్యాటగిరీలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర సర్కారు, తాజాగా ఉపాధ్యాయ కొలువుల భర్తీని చేపడుతున్నది. దసరా పండుగ కానుకగా పదివేల టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వీటిని టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు సమాచారం. తెలంగాణలో విద్యాప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు మొదలు ఉపాధ్యాయ సంఘాల వరకు వివిధ వర్గాలతో అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. ఇటీవలే గురుకుల విద్యాలయాల్లో ఐదువేలకు పైగా ఉద్యోగ,ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తాజాగా ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించి, వాటిని భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇటీవల సుప్రీంకోర్టు సైతం ఉపాధ్యాయ కొలువుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాచారం కోరింది. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సచివాలయంలో సమావేశమై కొలువుల భర్తీపై చర్చించారు. ప్రస్తుతం ఖాళీ అయినవి, వివిధ రూపాల్లో త్వరలో ఖాళీ కానున్నవి కలిపి సుమారు పదివేల పోస్టులు ఉన్నాయని గుర్తించారు. వీటన్నింటినీ భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టుకు వివరణ ఇస్తూ ప్రమాణపత్రం దాఖలు చేశారు. నోటిఫికేషన్ సమయంలోగా ఉమ్మడి సర్వీస్ రూల్స్, పదవీ విరమణ చేయడం ద్వారా ఏర్పడే ఖాళీలు, వాస్తవ ఖాళీలు వంటివి స్పష్టంగా తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు.

TSPSCకొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేనాటికి నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. రేషనలైజేషన్ ప్రక్రియను సమన్వయం చేసుకుంటూనే కొత్త నోటిఫికేషన్ ఉంటుంది అధికారులు చెప్తున్నారు. జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)ల ద్వారా ఉపాధ్యాయ కొలువులు నింపే పద్ధతికి స్వస్తి చెప్పాలని సీఎం నిర్ణయించారు. గతంలో కొన్ని జిల్లాల్లో డీఎస్సీపై వివాదాలు నెలకొనడం, అవకతవకలు జరుగడం తెలిసిందే. దానికితోడు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఈ ప్రక్రియకే అంకితమవడం వల్ల సాధారణ పరిపాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీన్ని నివారించేందుకు, అవినీతి రహితంగా, పారదర్శకంగా, సమర్థులైన టీచర్లను ఎంపిక చేసేందుకు టీఎస్‌పీఎస్సీయే సరైనదని సీఎం భావించారు. మరోవైపు ఇప్పటివరకు 24 నోటిఫికేషన్లు విడుదల చేసి వాటిని భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, వేగంగా పూర్తిచేసిన రికార్డు టీఎస్‌పీఎస్సీకి ఉంది. మొత్తంగా తెలంగాణ పండుగ సందర్భంగా ప్రారంభమయ్యే ప్రక్రియ ఈ ఏడాది ఆఖరు కల్లా పూర్తయి కొత్త సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులు రానున్నారని చెప్తున్నారు.
1937

అర్థమెటిక్




బారత దేశ చరిత్ర:బ్రిటీష్ సామ్రాజ్య విస్తరణ



IMP GK:ప్రాజెక్ట్ టైగర్


imp GK:రాంసార్ కన్వేన్సన్


భారత్‌, వియత్నాం మధ్య 12 ఒప్పందాలు


వియత్నాం: భారత ప్రధాని నరేంద్రమోదీ వియత్నాం పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం అర్థరాత్రి వియత్నాం చేరుకున్న ప్రధాని మోదీకి వియత్నాం నేతలు ఘనస్వాగతం పలికారు. స్థానిక ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌లో భద్రతా దళాల నుంచి మోదీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వియత్నాం అమరవీరులకు మోదీ నివాళులర్పించారు. హోచిమిన్‌ నివసించిన ఇంటిని మోదీ సందర్శించారు.
12 కీలక ఒప్పందాలు
వియత్నాం పర్యటన సందర్భంగా హనోయ్‌లో ఆదేశ ప్రధానితో మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో భారత్‌-వియత్నాం మధ్య 12 ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. అనంతరం ప్రధాని మోదీ, వియత్నాం ప్రధాని సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. మోదీ మాట్లాడుతూ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిగాయని తెలిపారు. రక్షణ, భద్రత రంగాల్లో ఒప్పందాలు సంతోషకరమని పేర్కొన్నారు. వియత్నాంతో ఒప్పందం వల్ల ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి అవకాశముందన్నారు. వియత్నాం బలమైన ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. జాతీయ దినోత్సవం సందర్భంగా వియత్నాం ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వియత్నాం ప్రజలు చూపిన అభిమానం మనసును ఆకట్టుకుందని పేర్కొన్నారు.

జాతీయ పార్టీగా ఆవిర్భవించిన ‘తృణమూల్ కాంగ్రెస్’


Fri, Sep 02, 2016, 07:37 PM
‘తృణమూల్ కాంగ్రెస్’కు జాతీయ పార్టీ హోదా లభించింది. ఈమేరకు ఎన్నికల కమిషన్ ధ్రువీకరణ ఇచ్చింది. దేశంలో 7వ జాతీయ పార్టీగా ‘తృణమూల్ కాంగ్రెస్’కు గుర్తింపు ఇచ్చినట్లు పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్ తో పాటు త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు పొందింది. కాగా, ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే 1968లో రూపొందించిన మూడు నిబంధనలే ప్రామాణికం. ఈ మూడు నిబంధనల్లో ఏదో ఒక నిబంధనకు అర్హత సాధించాలి. ఇంతకీ ఆ మూడు నిబంధనలేమిటంటే...

* 3 రాష్ట్రాల్లో కనీసం రెండు శాతం ఓటింగ్ తో 11 లోక్ సభ స్థానాలు సాధించాలి. 
* కనీసం 4 రాష్ట్రాల్లో ఆరు శాతం ఓటింగ్ తో నాలుగు లోక్ సభ స్థానాలు పొందాలి.
* ఏదైనా 4 రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి.
వీటిలో చివరి నిబంధనకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అర్హత సాధించడంతో ఆ పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు లభించింది.

Friday, 2 September 2016

వియాత్నాం తో మోడీ చర్చలు

clip

గోరటి వెంకన్న కు కాళోజీ అవార్డు

clip

జనవరి లో 10 వేల టీచర్ పోస్టులు

clip

Thursday, 1 September 2016

వియాత్నాం తో భారత్ వ్యూహాత్మక అనుబంధం

గురి పెట్టు కొలువు పట్టు--గ్రూప్ -II నగారా భేరీ


గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

హైదరాబాద్: గ్రూప్-2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. 1032 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. రేపటి నుంచి ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గతంలో 439 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇప్పుడు 593 పోస్టులకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. మునిసిపల్‌ కమిషనర్‌(గ్రేడ్‌3)-19, సబ్ రిజిస్ట్రార్‌(గ్రేడ్‌2)- 23, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్‌ ఆఫీసర్‌-156, ఎక్సైజ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌-284, డిప్యూటీ తహసీల్దార్‌-259, అసిస్టెంట్ రిజిస్ట్రార్ (రిజిస్ట్రార్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌)‌-62, విస్తరణ అధికారి (పంచాయతీరాజ్‌ అండ్ రూరల్‌ డెవలప్‌మెంట్‌)-67, ఈవో-గ్రేడ్‌1 (దేవాదాయశాఖ)-11, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌-03, అసిస్టెంట్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (హ్యాండ్‌లూమ్స్‌ & టెక్స్‌టైల్స్)-20, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌ (జీఏడీ)- 90, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌ (ఆర్థికశాఖ)- 28, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌ (న్యాయశాఖ)- 10 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

ముఖేష్ అంబానీ '4జీ' దెబ్బకు కుదేలైన ఎయిర్ టెల్, ఐడియా!


Thu, Sep 01, 2016, 12:17 PM
Related Imageఓ వైపు ముఖేష్ అంబానీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ, రిలయన్స్ జియోపై మాట్లాడుతున్న వేళ, పోటీ సంస్థలైన భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ ఈక్విటీ వాటాల విలువ పాతాళానికి పడిపోయింది. ఈ మధ్యాహ్నం 12 గంటల సమయంలో భారతీ ఎయిర్ టెల్ ఈక్విటీ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 6.71 శాతం తగ్గి రూ. 309కి చేరింది. మొత్తం 61 లక్షల ఈక్విటీ వాటాలు చేతులు మారాయి. ఇదే సమయంలో ఐడియా సెల్యులార్ ఈక్విటీ విలువ 7.06 తగ్గి రూ. 86 వద్ద కొనసాగుతోంది. 1.23 కోట్ల వాటాలు చేతులు మారాయి. రిలయన్స్ ప్రకటించిన ఉచిత ఆఫర్లు స్మార్ట్ ఫోన్ యూజర్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపవచ్చన్న నిపుణుల అంచనాలతోనే ఈ కంపెనీల వాటాలను ఇన్వెస్టర్లు అమ్మి వేసేందుకు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

ఉచిత’ మంత్రాన్ని పఠించిన ముఖేశ్!... ఎన్నికల హామీలను తలపించిన జియో ఆఫర్లు!


Related Imageనిజమే... ముంబైలో కొద్దిసేపటి క్రితం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం ఎన్నికల ప్రచార సభనే తలపించింది. మొబైల్ రంగంలో ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన ‘రిలయన్స్ జియో’కు అధికారికంగా రిబ్బన్ కట్ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ‘ఉచిత’ మంత్రం పఠించారు. ఈ నెల 5 నుంచి జియో సేవలను అధికారికంగా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నెల 5 నుంచి డిసెంబర్ వరకు జియో మొబైల్ సేవలను ఉచితంగానే ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక రూ.50 లకే 1 జీబీ డేటాను అందించనున్నట్లు పేర్కొన్న ఆయన... విద్యార్థులకు మరో 25 శాతం అధికంగా డేటాను అందిస్తామన్నారు. వెరసి రిలయన్స్ సర్వసభ్వ సమావేశం సాంతం ఎన్నికల సందర్భంగా వరాలిచ్చే రాజకీయ పార్టీల సభలను తలపించింది.

డిజిట‌ల్ ఇండియాకి రిల‌య‌న్స్ జియో ఊత‌మిస్తుంది, 4జీ స్మార్ట్ ఫోన్ల‌ను త‌క్కువ‌ ధ‌ర‌కు అందిస్తాం: ముఖేష్ అంబాని

డిజిట‌ల్ ఇండియా అన్న ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ నినాదానికి రిల‌య‌న్స్ జియో ఊత‌మిస్తుంద‌ని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ఈరోజు ముంబ‌యిలో రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగుతోంది. ఈ సంద‌ర్భంగా ముఖేష్ అంబాని మాట్లాడుతూ... రిలయన్స్ జియో భవిష్యత్ ప్ర‌ణాళిక‌ను వెల్ల‌డించారు. జియో అధునాత‌ర ఇంట‌ర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) టెక్నాల‌జీని ఏర్పాటు చేస్తోందని అన్నారు. ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ నెట్‌వ‌ర్క్‌గా జియో నిలుస్తుంద‌ని ధీమా వ్యక్తం చేశారు. 

విద్య, వ్య‌వ‌సాయ రంగాల‌కు కూడా జియో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ముఖేష్ అంబాని చెప్పారు. 4 జీ స్మార్ట్ ఫోన్ల‌ను అందుబాటు ధ‌ర‌కు అందిస్తామ‌ని చెప్పారు. ప్ర‌పంచంలో అన్ని రంగాల్లో స‌మూల మార్పులు వ‌స్తున్నాయని ఆయ‌న అన్నారు. టెక్నాల‌జీ కొత్త శకానికి నాంది ప‌లుకుతుందని వ్యాఖ్యానించారు. ప్ర‌పంచంలో డిజిట‌ల్ విప్ల‌వం వ‌స్తోందని చెప్పారు. 2017 క‌ల్లా భార‌త్‌లోని మొబై ల్‌ ఇంట‌ర్నెట్ వినియోగ‌దారుల్లో 90 శాతం మందిని జియోతో అనుసంధానించేలా ల‌క్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. జియోలో కాల్ డ్రాప్ స‌మ‌స్య‌లు ఉండ‌బోవ‌ని తెలిపారు.

రిలయన్స్ జియో 4G ధరలు

ఇందులో భాగంగా స్మాల్ (ఎస్) నుంచి ఎక్స్ ట్రా లార్జ్ (ట్రిపుల్ ఎక్స్ ఎల్) వరకూ ఏడు రకాల డేటా ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. వాటి వివరాలు ఇవి... (ఈ ప్యాకేజీలన్నీ నాలుగు వారాలకు... అంటే 28 రోజుల వ్యవధికి చెల్లుబాటవుతాయి)

ఎస్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 149. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 0.3 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లను పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి సిగ్నల్స్ ఈ ప్యాకేజీకి వర్తించవు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎం (1) ప్యాకేజీ: టారిఫ్ రూ. 499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 4 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 8 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎం (2) ప్యాకేజీ: టారిఫ్ రూ. 999. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 10 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 20 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 1499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 20 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 40 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 2499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 35 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 70 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎక్స్ ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 3499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 60 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 120 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ట్రిపుల్ ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 4499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 75 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 150 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఈ ప్యాకేజీల్లో భాగంగా జియో ప్రీమియం యాప్స్ అయిన జియో ప్లే, జియో ఆన్ డిమాండ్, జియో బీట్స్, జియో మ్యాగ్స్, జియో ఎక్స్ ప్రెస్ న్యూస్, జియో డ్రైవ్, జియో సెక్యూరిటీ, జియో మనీ వంటివాటిని డిసెంబర్ 31 2017 వరకూ ఉచితంగా వాడుకోవచ్చు. డేటా ప్యాక్ ల విషయంలో మాత్రం ఈ సంవత్సరం డిసెంబర్ 31 తరువాత తమ టారిఫ్ ప్లాన్ ను కస్టమర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది.

Wednesday, 31 August 2016

విల్సన్, కృష్ణ ల కు రామన్ మెగసెసే అవార్డు ప్రధానం


అక్టోబర్ లో కానిస్టేబుల్ ఎస్సై తుది పరీక్షలు


ఎలాంటి మార్పు లేకుండానే గ్రూప్-II పరీక్ష


జీఎస్‌టీ బిల్లుకు గోవా కూడా ఓకే... 50 శాతం రాష్ట్రాల మ‌ద్ద‌తు వ‌చ్చేసింది!


Wed, Aug 31, 2016, 06:53 PM
దేశవాప్తంగా ఒకే పన్ను వ్యవస్థను నెలకొల్పటానికి ఉద్దేశించిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లు ఎన్నో అడ్డంకులను దాటుకొని రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌ల్లో ఆమోదం పొందిన సంగ‌తి తెలిసిందే. బిల్లుకి దేశంలోని క‌నీసం 15 రాష్ట్రాల శాస‌న‌స‌భ‌ల నుంచి ఆమోదం రావాల్సి ఉండ‌గా.. నేడు గోవా శాస‌న‌స‌భ బిల్లుని ఆమోదించ‌డంతో జీఎస్‌టీ బిల్లుని ఆమోదించిన రాష్ట్రాల సంఖ్య 15కు చేరుకుంది. దీంతో దేశంలోని 50 శాతం రాష్ట్రాల మ‌ద్ద‌తు వ‌చ్చేసింది. ఈ సంద‌ర్భంగా గోవా ముఖ్య‌మంత్రి ప‌ర్సేక‌ర్ మాట్లాడుతూ... ప్రతిపక్ష సభ్యులకు ధ‌న్యావాదాలు చెప్పారు. 

జీఎస్‌టీ స‌వ‌ర‌ణ‌ బిల్లు అమల్లోకి వస్తే పర్యాటక రంగం అభివృద్ధి జరుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. దీంతో గోవాకి మరింత ఆదాయం వ‌స్తుంద‌ని చెప్పారు. బిల్లుని ఆమోదించిన 15వ రాష్ట్రంగా తమ రాష్ట్ర‌మే నిల‌వ‌డం గొప్ప విషయమని ఆయ‌న వ్యాఖ్యానించారు. జీఎస్‌టీ బిల్లుని ఆమోదించిన మొద‌టి రాష్ట్రంగా ఈనెల 12న అసోం నిలిచిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత బీహార్ ఈ బిల్లుని ఆమోదించి జీఎస్‌టీని ఆమోదించిన రెండో రాష్ట్రంగా, తొలి ఎన్డీయేతర రాష్ట్రంగా నిలిచింది. 

ఆ త‌రువాత జార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, నాగాలాండ్‌, మహారాష్ట్ర, హరియాణా, తెలంగాణ, సిక్కిం, మిజోరం రాష్ట్రాలు రోజుల వ్య‌వ‌ధిలోనే బిల్లుని ఆమోదించాయి. ఈరోజు గోవా జీఎస్‌టీని ఆమోదించి ఆ పరంపరలో 15వ రాష్ట్రంగా నిలిచింది. వ‌చ్చే ఏడాది ఆర్థిక సంవత్స‌రం ప్రారంభం నుంచే (ఏప్రిల్ 1) కేంద్రం ఈ బిల్లుని అమ‌లులోకి తీసుకురానుంది.

మూడు రోజుల్లో తెలంగాణ గ్రూప్-2 నోటిఫికేషన్: టీఎస్ పీఎస్సీ చైర్మన్


Wed, Aug 31, 2016, 07:55 PM
Related Image





తెలంగాణ గ్రూప్-2 నోటిఫికేషన్ రెండు మూడ్రోజుల్లో వెలువడనుంది. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఒక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. అనంతరం చక్రపాణి మీడియాతో మాట్లాడుతూ, పది రోజుల్లో గురుకుల విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మిగతా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు అందిన తర్వాత ప్రకటన చేస్తామన్నారు.

Tuesday, 30 August 2016

ఇంగ్లండ్ క్రికెట్ టీం ప్రపంచ రికార్డు స్కోరు ...169 పరుగుల తేడాతో పాక్ పై గెలుపు



ఇంగ్లండ్ ప్రపంచ రికార్డుఅలెక్స్ హేల్స్వీడియోకి క్లిక్ చేయండి
- పాక్‌తో వన్డేలో 444 పరుగులు   

ట్రెంట్‌బ్రిడ్‌‌జ: వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఒక ఇన్నింగ్‌‌సలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మంగళవారం ఇక్కడ పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసింది. ఫలితంగా 2006లో నెదర్లాండ్స్ పై శ్రీలంక సాధించిన 443 పరుగుల రికార్డు బద్దలైంది. అలెక్స్ హేల్స్ (122 బంతుల్లో 171; 22 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ సెంచరీతో విధ్వంసం సృష్టించగా... బట్లర్ (51 బంతుల్లో 90 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), జో రూట్ (86 బంతుల్లో 85; 8 ఫోర్లు) అదే స్థాయిలో చెలరేగారు.

కెప్టెన్ మోర్గాన్ (27 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా అర్ధసెంచరీతో అండగా నిలిచాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా హేల్స్ నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ధాటికి 10 ఓవర్లలో 110 పరుగులిచ్చిన వహాబ్ రియాజ్ వన్డేల్లో రెండో అతి చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. కాగా దుస్సాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 42.4 ఓవర్లలో 275 పరుగులు చేసి.. 169 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త


Sakshi | Updated: August 30, 2016 17:03 (IST)
ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త
హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వేలాది విద్యార్థులకు ఇదో శుభవార్త. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ కింద దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8 వేల మంది ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కంటోన్మెంట్ ఏరియాలు, మిలటరీ స్టేషన్లలో నడుస్తున్న మొత్తం 137 ఆర్మీ పబ్లిక్ స్కూళ్ల (ఏపీఎస్) లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను ఆన్ లైన్ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆన్ లైన్ లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. వచ్చే నవంబర్ నెల 26, 27 తేదీల్లో ఈ ఆన్ లైన్ పరీక్ష నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వచ్చిన దరఖాస్తులను బట్టి ఏవైనా మార్పు చేర్పులు చేయాల్సి వస్తే పరీక్షను నవంబర్ లో చివరి ఆదివారం లేదా డిసెంబర్ లో వచ్చే మొదటి ఆదివారం రోజున స్క్రీనింగ్ టెస్టు నిర్వహించడానికి ఆవకాశాలున్నాయి.  ఇందులో అర్హత సాధించిన వారికి స్కోర్ కార్డులు జారీ చేస్తారు. డిసెంబర్ 15 న ఫలితాలను వెల్లడిస్తారు. అభ్యర్థులు http://aps-csb.in పోర్టల్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

స్కోర్ కార్డు ఆధారంగా తదుపరి దశల్లో నిర్వహించే పరీక్షకు అర్హత సాధిస్తారు. ఆ స్కోర్ కార్డులు మూడేళ్ల పాటు పనికొస్తుంది. స్కోర్ కార్డు వచ్చిన తర్వాత రెండో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. మూడో దశలో ఆయా సబ్జెక్టుల్లో  స్కిల్స్ ను పరిశీలించడానికి ఎస్సే, కాంప్రిహెన్షన్ లపై రాత పరీక్ష నిర్వహిస్తారు. సెప్టెంబర్ 13 లోగా ఆన్ లైన్ లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రధానంగా పీజీటీ, టీజీటీ, పీఆర్ టీ ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక కోసం ఈ ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తున్నారు. పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఎడ్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే టీజీటీ, పీఆర్టీ పోస్టులకు డిగ్రీతో పాటు బీఎడ్ తప్పనిసరిగా ఉండాలి. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు సంబంధించి ఇంగ్లీషు, హిందీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్, సైకాలజీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేటిక్స్, హోం సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి. టీజీటీ పోస్టులు ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నట్టు నోటిఫికేషన్ లో తెలియజేసారు.

ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు, బీఏడ్ లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 1 ఏప్రిల్ 2017 నాటికి 40 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఇకపోతే, టీజీటీ, పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీటెట్, లేదా ఆయా రాష్ట్రాలు నిర్వహించిన టెట్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాంటి వారిని రెగ్యులర్ ప్రాతిపదిక నియమిస్తారు. ఆ అర్హతలు లేని అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఎంపికైతే అలాంటి అభ్యర్థులను హడ్ హక్ ప్రాతిపదికన నియమిస్తారు. రెగ్యులరైజేషన్ కోసం ఆ తర్వాత దశలో టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది.

పీజీటీ, టీజీటీ కోసం పార్ట్ ఏ, పార్ట్ బీ పేరుతో ఆన్ లైన్ లో రెండు పరీక్షలు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, కాంప్రిహెన్షన్, ఎడ్యుకేషనల్ కాంసెప్ట్స్, మెథడాలజీ ఉంటాయి. పార్ట్ బీ లో సంబంధిత సబ్జెక్టులపై ప్రశ్నలుంటాయి. ఒక్కో పార్ట్ లో పరీక్ష 3 గంటల పాటు ఉంటుంది. ఒక్కో పార్టులో 90 మార్కుల చొప్పున మొత్తం 180 మార్కులకు నిర్వహిస్తారు. పీఆర్టీలకు మాత్రం పార్ట్ ఏ మాత్రమే ఉంటుంది. అర్హత సాధించడానికి అభ్యర్థి ప్రతి పార్ట్ లో కనీసం 50శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు www.awesindia.com. చూసుకోవచ్చు.

GK-వివిధ నదుల ఒడ్డున ఉన్న ప్రముఖ నగరాలు

























 
 
 

ఇస్రో ఖాతాలో మరో విజయం


డోగ్రీ రచయిత్రి పద్మా సచ్ దేవ్ కి సరస్వతీ సమ్మాన్ అవార్డు


Sunday, 28 August 2016

15 వేల ఉద్యోగాల భర్తీ కి తెలంగాణా ప్రభుత్వ ఆమోదం

cmng-soon-notifications
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని కెసిఆర్ హామీ ఇచ్చిన సంగతి గురుండే ఉంటుంది. ఇప్పుడు ఆ హామీ నెరవేర్చే పనిలో స్పీడ్ పెంచారు తెలంగాణ సర్కర్. ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం , తాజాగా మరో 15 వేల ఉద్యోగాల భర్తీ ఆమోదం తెలిపింది.
ఆర్థిక శాఖ, ఉద్యానవనం, ఆర్టీఏ, పట్టణాభివృద్ధి , విద్యుత్, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, తదితర శాఖలతో పాటు జలమండలి, సింగరేణి సంస్థల్లో కూడా ఉద్యోగాల నియామకాలు జరిగాయి. వైద్యారోగ్య, పురపాలక, వ్యవసాయ, భూగర్భజలవనరులు, విద్యాశాఖ, ఎక్సైజ్, అటవీ శాఖలతో పాటు కాలుష్య నివారణ మండలి, జీహెచ్‌ఎంసీ, గ్రూప్ 1, 2 తదితర ఉద్యోగాలు కలిపి మరో 15వేల ఉద్యోగాల భర్తీ జరుగనున్నది. ఏ ఏ శాఖల్లో ఎన్ని ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి మీరే ఈ కింది ఇమేజ్ ద్వారా చూడండి..

today`s nipuna:GK

RIGHT CLICK>>>>OPEN LINK IN NEW TAB


రుద్రమదేవి మరణం పై సందిగ్దత

clip