Sunday, 28 August 2016

15 వేల ఉద్యోగాల భర్తీ కి తెలంగాణా ప్రభుత్వ ఆమోదం

cmng-soon-notifications
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని కెసిఆర్ హామీ ఇచ్చిన సంగతి గురుండే ఉంటుంది. ఇప్పుడు ఆ హామీ నెరవేర్చే పనిలో స్పీడ్ పెంచారు తెలంగాణ సర్కర్. ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం , తాజాగా మరో 15 వేల ఉద్యోగాల భర్తీ ఆమోదం తెలిపింది.
ఆర్థిక శాఖ, ఉద్యానవనం, ఆర్టీఏ, పట్టణాభివృద్ధి , విద్యుత్, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, తదితర శాఖలతో పాటు జలమండలి, సింగరేణి సంస్థల్లో కూడా ఉద్యోగాల నియామకాలు జరిగాయి. వైద్యారోగ్య, పురపాలక, వ్యవసాయ, భూగర్భజలవనరులు, విద్యాశాఖ, ఎక్సైజ్, అటవీ శాఖలతో పాటు కాలుష్య నివారణ మండలి, జీహెచ్‌ఎంసీ, గ్రూప్ 1, 2 తదితర ఉద్యోగాలు కలిపి మరో 15వేల ఉద్యోగాల భర్తీ జరుగనున్నది. ఏ ఏ శాఖల్లో ఎన్ని ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి మీరే ఈ కింది ఇమేజ్ ద్వారా చూడండి..

0 comments:

Post a Comment