Saturday, 29 June 2019

డిగ్రీ ,యూనివర్సిటీ అధ్యాపకుల 7 వ వేతన సవరణ జీవో విడుదల.


డిగ్రీ లెక్చరర్ లు,యూనివర్సిటీ లలో పని చేసే అధ్యాపకుల 7 వ వేతన సవరణ కు సంబంధించిన జీవో ను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల  చేసింది. దీని ప్రకారం,డిగ్రీ అధ్యాపకులు,యూనివర్సిటీ అధ్యాపకులు మరియు లైబ్రేరియన్ లు,ఫిజికల్ డైరెక్టర్ లు ఈ వేతన సవరణ పొందడానికి అర్హులు.

అంతే కాకుండా యూజీసీ వేతన రూల్స్ ని పాటించే అన్ని డిపార్ట్మెంట్ ల కు ఇది వర్తిస్తుంది.ఈ జీవో ప్రకారం జనవరి 1, 2016 నుండి ఈ వేతన సవరణ ఉంటుంది.మార్చి 31 2016 వరకు  బకాయిల ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సగం,సగం భరిస్తాయి.తర్వాత నుండి అంటే ఏప్రిల్ 1 నుండి పూర్తి రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఖర్చును భరిస్తుంది.ఈ పెంపు వల్ల 2778 మంది బోధనా సిబ్బంది లబ్ది పొందనున్నారు.ఈ పెంపు వల్ల ప్రభుత్వానికి ఏటా 264 కోట్ల భారం పడనుంది.ఈ పెంపు ప్రకారం డిగ్రీ లెక్చరర్, మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ల కనీస వేతనం 57,700 గా నిర్ణయించారు. వీరి పే స్కేల్ 57,700-1,82,400 గా ఉంది.కాగా ఆయా పే బ్యాండ్ లను బట్టి ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది.అయితే 2016 జనవరి 1 నుండి ఇప్పటివరకు రావాల్సిన బకాయిల కు సంబంధించిన G.O . ప్రత్యేకంగా వేరేగా విడుదల చేస్తారు.ఈ పెంపు తో కనిష్టంగా 15,000 గరిష్టంగా 22,000 రూపాయల పెరుగుదల ఉండబోతుంది.

కొత్త పే స్కేల్లు
HRA

Tuesday, 25 June 2019

గ్రూప్-2 కు ఎంపికైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్ లు ఇవ్వాలి:జులై 1 నుండి గ్రూప్ 2 ఇంటర్వ్యూలు.


తెలంగాణా రాష్ట్రంలో గ్రూప్-2 ఇంటర్వ్యూ కి ఎంపికైన అభ్యర్థులు ఈ రోజు నుండి వెబ్ ఆప్షన్ లను ఇవ్వ వలసి ఉంటుంది అని tspsc సెక్రెటరీ వాణీ ప్రసాద్ తెలిపారు.ఇంటర్వ్యూ కు ఎంపికైన అభ్యర్థుల కు జులై 1 వ తేదీ నుండి 6 వ తేదీ వరకు ప్రతీ రోజు రెండు సెషన్ ల చొప్పున (9.30 &12.30) ఇంటర్వ్యూ లు నిర్వహించ  నున్నారు.కాగా ఎన్నోరోజుల నుండి గ్రూప్ 2 ఇంటర్వ్యూ ల కోసం ఎదురు చూసిన ,ఆశావహులకు నిజంగా ఇది శుభవార్తనే.ఎందుకంటే ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసి నా గ్రూప్స్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల కు ఉన్న విలువ అలాంటిది.ఈ ఇంటర్వ్యూ లు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయి ,ఫలితాలు వెలువడితే తెలంగాణా లోని నిరుద్యోగ యువత ఎంతో సంతోషిస్తుంది.అప్పుడు తెలంగాణా ఏర్పాటు తో , 'నీళ్లు ,నిధులు నియామకాలు'  నినాదం లో నియామకాల కు సంబంధించి కొంతమేరకైనా న్యాయం జరిగినట్టు అవుతుంది.

visit for daily updates..
www.paatshaalaindia.blogspot.com

వారంలో పోలీసు నియామకాల తుది ఫలితాలు:వెంటనే మరో 15000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్


రాష్ట్రంలో పోలీసు నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రస్తుత నియామక ప్రక్రియలో కేవలం తుది కటాఫ్ మార్కులు ప్రకటించడం ఒక్కటే మిగిలింది. కాగా ఈ తుది మార్కుల కటాఫ్ ను వచ్చేవారం ప్రకటించబోతున్నట్లు తెలిసింది.ఆ తర్వాత వెంటనే ప్రభుత్వం సుమారు 15000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది.

visit for more updates
www.paatshaalaindia.blogspot.com