తెలంగాణా రాష్ట్రంలో గ్రూప్-2 ఇంటర్వ్యూ కి ఎంపికైన అభ్యర్థులు ఈ రోజు నుండి వెబ్ ఆప్షన్ లను ఇవ్వ వలసి ఉంటుంది అని tspsc సెక్రెటరీ వాణీ ప్రసాద్ తెలిపారు.ఇంటర్వ్యూ కు ఎంపికైన అభ్యర్థుల కు జులై 1 వ తేదీ నుండి 6 వ తేదీ వరకు ప్రతీ రోజు రెండు సెషన్ ల చొప్పున (9.30 &12.30) ఇంటర్వ్యూ లు నిర్వహించ నున్నారు.కాగా ఎన్నోరోజుల నుండి గ్రూప్ 2 ఇంటర్వ్యూ ల కోసం ఎదురు చూసిన ,ఆశావహులకు నిజంగా ఇది శుభవార్తనే.ఎందుకంటే ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసి నా గ్రూప్స్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల కు ఉన్న విలువ అలాంటిది.ఈ ఇంటర్వ్యూ లు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయి ,ఫలితాలు వెలువడితే తెలంగాణా లోని నిరుద్యోగ యువత ఎంతో సంతోషిస్తుంది.అప్పుడు తెలంగాణా ఏర్పాటు తో , 'నీళ్లు ,నిధులు నియామకాలు' నినాదం లో నియామకాల కు సంబంధించి కొంతమేరకైనా న్యాయం జరిగినట్టు అవుతుంది.
www.paatshaalaindia.blogspot.com





0 comments:
Post a Comment