Saturday, 19 January 2019

తెలంగాణా మోడల్ స్కూల్ ల లో ప్రవేశానికి నోటిఫికేషన్

తెలంగాణా రాష్ట్రంలోని మోడల్ స్కూల్ లలో 2019-2020 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు   నోటిఫికేషన్ ను పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ కుమార్ జారీ చేశారు.

ఏపీ లో రేపటి నుండి SI అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, SI ఉద్యోగ దేహ దారుడ్య పరీక్షలు 21 వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ కుమార్‌ విశ్వజీత్‌ తెలిపారు. గత ఏడాది నవంబరు 1న విడుదల చేసిన ఎస్‌ఐ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రాథమిక ప్రవేశ పరీక్షలో 51,926 మంది అర్హత సాధించారని చెప్పారు. వీరిలో.. 12,703 మంది ఉత్తరాంధ్ర ప్రాంత అభ్యర్థులకు ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 4వరకు విశాఖపట్నంలో, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 12,868 మందికి ఏలూరులో ఫిబ్రవరి 5వరకు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన 9,434 మందికి ఫిబ్రవరి 1వరకు, రాయలసీమ అభ్యర్థులు 16,921 మందికి కర్నూలులో ఫిబ్రవరి 9వరకు ఫిట్‌నెస్‌, మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని విశ్వజీత్‌ వివరించారు.

Friday, 18 January 2019

ఆస్ట్రేలియా పై భారత్ మరపురాని ,మధురమైన విజయం:వన్డే సిరీస్ ను కూడా సొంతం చేసుకున్న టీమిండియా


అసలు ఎవరైనా ఊహించారా...!! టీమిండియా ,ఆస్ట్రేలియా లో ఆస్ట్రేలియా పై టెస్ట్ సిరీస్ ,వన్డే సిరీస్ నెగ్గుతుందని,అసలు అది ఊహ కే అసాధ్యం అనిపించిన ఫీట్,కానీ టీమిండియా దానిని సాధించింది. 4 టెస్టు ల సిరీస్ ను 2-1తేడా తో నెగ్గిన భారత్,3 వన్డే  ల ద్వైపాక్షిక సిరీస్ ను కూడా 2-1 తేడాతో నెగ్గి T20 సిరీస్ ను 1-1 తో సమం చేసి  'న భూతో న భవిష్యతి' అనిపించింది.

శుక్రవారం  రోజు  మెల్ బొర్న్ లో జరిగిన ఆఖరి వన్డేలో మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత పోరాట పటిమ కు తోడు , కేదార్ జాదవ్ చేసిన అద్భుత హాఫ్ సెంచరీ, కోహ్లీ మెరుపులు ప్రత్యేకించి,  ఛాహల్ అద్భుత స్పిన్ తో 6 వికెట్ల ఫీట్ ,వెరసి టీమిండియా అద్భుతమైన విజయంతో ఆస్ట్రేలియా టూర్ ను ముగించింది.ఇంతకు ముందెప్పుడూ,ఇంతటి ఘన విజయం ఎప్పుడూ సాధ్యం కాలేదు.

టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకున్న టీమిండియా యజువేంద్ర ఛాహాల్ 6 వికెట్లకు తోడు,భువీ 2 వికెట్లు, షమీ 2 వికెట్లు తీయడం తో ,ఆతిథ్య జట్టు కేవల 48.4 ఓవర్లలో 230 పరుగుల కు ఆలౌట్ అయింది.తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 49.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసి విజయం సాధించింది. ధోనీ 114 బంతుల్లో 87(6 ఫోర్లు) పరుగులు నాటౌట్  కు తోడు కేదార్ జాదవ్ 57 బంతుల్లోనే 61(7 ఫోర్లు) పరుగులు నాటౌట్ ,62 బంతుల్లో 46(3 ఫోర్లు) చేయడంతో ,ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ యజువేంద్ర ఛాహల్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ MS. ధోనీ.

Wednesday, 16 January 2019

యూనివర్సిటీ అధ్యాపకులకు 3 రోజుల్లో 7 వ వేతన సవరణ పెంపు ఉత్తర్వులు:భారీగా పెరగనున్న జీతాలు


7 వ వేతన సవరణ సిఫారసుల మేరకు ,తెలంగాణా ప్రభుత్వం
యూనివర్శిటీ అధ్యాపకులు , ఇతర సిబ్బందికి 7 వ వేతన సవరణ ప్రకారం జీతాలు పెంచే ,ఉత్తర్వులను 3 రోజుల్లో జారీ చేయనుంది. యునివర్సిటీ మరియు డిగ్రీ కాలేజీ లలో పనిచేసే సిబ్బందికి కేంద్ర సర్కారు పరిధిలోనే యూజీసీ పే స్కేలు ప్రకారం జీతాలు ఇవ్వవలసి ఉంటుంది.దీనిలో భాగంగా కేంద్రం వీరి జీతాలలో 50 శాతం భరిస్తుంది.మిగితా 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.అయితే ఈ పెంపు ఒక వేళ మార్చి నెలలోపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయక పోతే ఈ జీతాల భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పెంపును అమలు చేయనుంది.

Monday, 14 January 2019

భారతీయుడు 2 ఫస్ట్ లుక్ టాక్...


ప్రస్తుత సమాజంలో అడుగడుగునా కనిపించే అవినీతి ఫై ఒక స్వతంత్ర సమరయోధుడు సాగించే పోరాటం నేపథ్యం లో గుర్తుండిపోయే సినిమాను అందించిన డైరెక్టర్ శంకర్ అండ్ పద్మ శ్రీ. డా. కమలహాసన్ నుండి భారతీయుడు- 2 గా వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ని కాసేపటి క్రితం రిలీజ్ చేసారు. ఇక పోస్టర్ విషయానికి వస్తే భారతీయుడు గా కమలహాసన్ తన చేతులతో మరోసారి ప్రాచీన  కళ 'మర్మకళ' ని లంచగొండి వ్యవస్థకు పూర్థిస్థాయి లో రుచి చూపించేలా ఉన్నాడు. ఫస్ట్ లుక్ కి కమల్ హాసన్ అభిమానుల నుండి అద్భుత స్పందన వస్తుంది. కమల్ కి కొద్దీ కాలంగా దూరంగా ఉన్న బారి విజయం ఈ మూవీ తో అన్ని రికార్డులకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తాడు అని అభిమానులు నమ్మకం తో వున్నారు.

పాండ్య, రాహుల్ లు క్షమాపణ చెప్పినా....

కాఫీ విత్ కరణ్ షో లో ,మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సస్పెండ్ అయిన హార్దిక్ పాండ్య,KL రాహుల్ లు బేషరతుగా క్షమాపణలు చెప్పినా వారి కి ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదు బీసీసీఐ. వీరిపై అంబుడ్స్ మన్ ల తో విచారణ జరిపించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.దీనివల్ల విచారణ ఆలస్యమై వీరికి ప్రపంచ కప్ లో చోటు దక్కడం క్లిష్టంగా మారింది.

ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి 2.5 లక్షల నుండి 5 లక్షల కు పెంచే యోచనలో కేంద్రం?

ఉద్యోగులు, మధ్య తరగతి వారిని సంతోష పెట్టేందుకు కేంద్రం సిద్ధమౌతోంది. త్వరలో ప్రవేశ పెట్టబోయే తాత్కాలిక బడ్జెట్లో దీనిని ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వచ్చే నెల వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి మినహాయింపు ను 2.5 లక్షల నుండి 5 లక్షల కు పెంచనున్నట్టు సమాచారం