సౌరాష్ట్ర ,విదర్భ ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో గత సంవత్సరం చాంపియన్ విదర్భ ,మళ్లీ గెలిచి ట్రోఫీ ని నిలబెట్టుకుంది.206 పరుగుల విజయ లక్ష్యం తో బరిలోకి దిగిన సౌరాష్ట్ర జట్టు కేవలం 127 పరుగులకే ఆలౌట్ అయింది.విదర్భ బౌలర్ ఆదిత్య సర్వాతే 6 వికెట్లు తీశాడు.సౌరాష్ట్ర తరుపున విశ్వరాజ్ జడేజా( 52) ఒక్కడే రాణించాడు.స్టార్ బ్యాట్సమన్ చేతేశ్వర్ పుజారా సున్నాకే వెనుదిరిగాడు.వరుసగా రెండు సార్లు రంజీ ట్రోఫీ ని నెగ్గిన జట్ల లో కర్ణాటక,ముంబై,మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ ల సరసన చేరింది.
Thursday, 7 February 2019
రంజీ ట్రోఫీ విజేత విదర్భ
By . at February 07, 2019
No comments
సౌరాష్ట్ర ,విదర్భ ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో గత సంవత్సరం చాంపియన్ విదర్భ ,మళ్లీ గెలిచి ట్రోఫీ ని నిలబెట్టుకుంది.206 పరుగుల విజయ లక్ష్యం తో బరిలోకి దిగిన సౌరాష్ట్ర జట్టు కేవలం 127 పరుగులకే ఆలౌట్ అయింది.విదర్భ బౌలర్ ఆదిత్య సర్వాతే 6 వికెట్లు తీశాడు.సౌరాష్ట్ర తరుపున విశ్వరాజ్ జడేజా( 52) ఒక్కడే రాణించాడు.స్టార్ బ్యాట్సమన్ చేతేశ్వర్ పుజారా సున్నాకే వెనుదిరిగాడు.వరుసగా రెండు సార్లు రంజీ ట్రోఫీ ని నెగ్గిన జట్ల లో కర్ణాటక,ముంబై,మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ ల సరసన చేరింది.
ఇక నుండి సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయిన వారికి కూడా ఏదో ఒక జాబ్
By . at February 07, 2019
No comments
కేంద్రం ,సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వచ్చి ఎంపిక కాని అభ్యర్థుల కు ఏదో ఒక ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది.వీరికి కేంద్ర ప్రభుత్వ ఫరిదిలో ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వబోతున్నామని UPSC చైర్మన్ ఇటీవల జరిగిన రాష్ట్రాల psc ల ఛైర్మన్ ల సమావేశం లో తెలియ జేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి ఇంటర్వ్యూ వరకు రావడం అంటే వారు ఎంతో ప్రతిభ ఉన్న వారైతేనే ఇంత వరకు రాగలరు అని తెలిపారు.
అంతే కాకుండా ఇంటర్వ్యూ వరకు వచ్చిన అందరు అభ్యర్థుల మార్కుల పూర్తి జాబితాను ఆన్ లైన్ లో ఉంచబోతున్నారు.తద్వార ప్రైవేట్ కంపనీ లు వీరికి ఉద్యోగాలను ఇస్తాయి అని తెలిపారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(IFS) టాపర్ గా నల్లగొండ జిల్లా నవీన్ రెడ్డి
By . at February 07, 2019
No comments
ప్రధానమంత్రి -కిసాన్ పథకం క్రింది వారికి వర్తించదు.
By . at February 07, 2019
No comments
పీఎం–కిసాన్ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను బుధవారం విడుదల చేసింది.దీని ప్రకారం క్రింది రైతులు అనర్హులు.
- వివిధ సంస్థల కింద ఐదెకరాలలోపు భూమి ఉన్నవారు
- రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వారికి వర్తించదు
- తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ తాజా,మాజీ చైర్మన్లు
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రస్తుత, రిటైరైన ఉద్యోగులు, అధికారులు అనర్హులు
- స్వయంప్రతిపత్తి, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు కూడా అనర్హులే. (నాలుగో తరగతి ఉద్యోగులు మాత్రం అర్హులు)
- రూ.10 వేలకు మించి పింఛన్ తీసుకునే ఉద్యోగులంతా...
- గతేడాది ఆదాయపు పన్ను చెల్లించిన వారంతా...
- డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు, ఆర్కిటెక్ట్‌లు తదితర వృత్తి నిపుణులు కూడా...