Saturday, 22 August 2020

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల....!


TS లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. కోర్సుల ప్రవేశానికి సంబంధించి పరీక్ష షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి

ఆగస్టు 31- ఈసెట్

ఎంసెట్ ఇంజనీరింగ్-సెప్టెంబర్ 9, 10, 11, 14

ఎంసెట్ అగ్రికల్చర్- సెప్టెంబర్ 28, 29

పీజీ ఈసెట్- సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు

ఐసెట్- సెప్టెంబర్ 30, అక్టోబర్ 1

ఎడ్ సెట్- అక్టోబర్ 1,3

లా సెట్- అక్టోబర్ 4

*✍️అంబేడ్కర్‌ వర్సిటీ దూరవిద్య ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల*


🍁హైదరాబాద్‌: 

*🔰డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ) కోర్సులతోపాటు పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ జి.లక్ష్మారెడ్డి తెలిపారు. మరిన్ని వివరాల కోసం www.braouonline.in లేదా ‌www.braou.ac.in  లో చూడవచ్చన్నారు.

Friday, 21 August 2020

జగిత్యాల జిల్లాలో వివాహ వేడుకకు హాజరైన 26 మందికి కరోనా పాజిటివ్...!

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడి పల్లి గ్రామంలో వివాహ వేడుక హాజరైన 26 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.ఈనెల 13న వివాహం జరుగగా.. 14వ తేదీన బల్వంతపూర్ లో రిసెప్షన్ జరిగింది ఈ రిసెప్షన్ వేడుకకు హాజరైన  వారిలో ఇప్పటి వరకు 26 మందికి  కరోనా సోకింది. ఇందులో బుధవారం నాడు ఇద్దరికీ పాజిటివ్ రాగ, గురువారం నాడు ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది దీంతో స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇ శుక్రవారం 104 మందికి టెస్ట్ చేయగా 26 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో వెంటనే వారిని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని కూడా  హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.

శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం....!

శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం పవర్ హౌస్  మొదటి యూనిట్లో పేలుడు చెలరేగిన మంటలు 6 గురు ఉద్యోగులకు తీవ్ర గాయాలు పవర్ హౌస్ లోనే చిక్కుకుపోయిన 9 మంది ఇంజనీర్లు సొరంగ మార్గం గుండా బయటపడ్డ 15 మంది సిబ్బంది శ్రీశైలం వెళ్లిన మంత్రి జగదీశ్ రెడ్డి , జెన్కో సిఎండి సిబ్బంది రక్షించేందుకు NDRF బృందాలు ప్రయత్నం దట్టమైన పొగలు అలుము కోవడం తో సహాయ చర్యలకు ఆటంకం ఆందోళనలో ఉద్యోగుల కుటుంబ సభ్యులు సింగరేణి కార్మికుల సహాయం కోరిన మంత్రి

💠📜దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల*..!


*⏺️హైదరాబాద్‌: తెలంగాణలో ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు కన్వీనర్‌ లింబాద్రి వివరాలను వెల్లడించారు. ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 7 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు చేపడతామన్నారు.*

*🔰ముఖ్యమైన తేదీలు:*

*🔶ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం.*

*🔶సెప్టెంబర్ 16న మొదటి విడత సీట్ల కేటాయింపు*

*🔶సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం*

*🔶సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు  వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం.*

*🔶సెప్టెంబర్ 28న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు..*

*🔶సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు.*

*🔶సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం*

*🔶అక్టోబర్ 8న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు*

Thursday, 20 August 2020

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారలు...2020!

 క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి ఈ ఏడాది 5 గురు క్రీడాకారులు ఎంపికయ్యారు రోహిత్ శర్మ (క్రికెట్) ,వినేష్ పొగట్ (రెస్లింగ్) ,రాణిరాంపాల్ (హాకీ), మనీక బత్ర (టేబుల్ టెన్నిస్), మరియిప్పన్ తంగవేలు (పారాలింపిక్ హై జంప్) ఈ ఐదుగురు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 29 నా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు.

ఇకపై అన్ని ఉద్యోగాలకు ఒక్కటే టెస్ట్...!




కేంద్ర కేబినెట్ 'సెట్' కు ఆమోదం తెలిపింది
నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి లైన్ క్లియర్

ఇకపై బ్యాంక్ ఉద్యోగానికి, ఒక టెస్ట్ రైల్వే ఉద్యోగానికి ఒక టెస్ట్ ఉండదు అన్ని ఉద్యోగాలకు కలిపి ఒక్కటే టెస్ట్ ఉండబోతుంది ప్రతిసారి దరఖాస్తుకు అదనపు ఫీజులు కట్టి ప్రతిసారి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు ఒక అర్హత కు సంబంధించి  ఏ జాబ్ అయినా సరే ఒక ఒక టెస్ట్ రాస్తే సరిపోతుంది ఇకపై కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు( నాన్-టెక్నికల్) ఒకటే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్( సెట్- సిఈటి) కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది సెట్ నిర్వహణకు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ( ఏన్ ఆర్ ఏ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బేటి అయిన కేబినెట్ కమిటీ బుధవారం( ఎన్ ఆర్ ఏ) కు లైన్ క్లియర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ లో ఉండే ఎన్ ఆర్ ఏకు మూడేళ్లకు గాను1,517.57 కోట్లు కేటాయించింది ఈ సెట్ టెస్ట్ ఒక్కసారి రాస్తే మూడేళ్లు వర్తిస్తుందని నచ్చిన భాషలో ఈ టెస్ట్ రాసుకోవచ్చు అని కబడ్డీ తెలిపింది కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ స్థాయి అధికారి ఈ ఏజెన్సీకి చైర్పర్సన్ గా ఉంటారు

దోస్త్ నోటిఫికేషన్ నేటి నుంచి...!


మొదటి విడత రిజిస్ట్రేషన్ 1 నుండి?... కొత్తగా 'ఫేస్ రికగ్నైజేషన్' టెక్నాలజీ అమలు

డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి సిద్ధమైంది యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్( డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ)-2020 నోటిఫికేషన్ గురువారం విడుదల చేయనున్నారు ఉస్మానియా కాకతీయ శాతవాహన తెలంగాణ పాలమూరు విశ్వవిద్యాలయాల పరిధిలోని వెయ్యికి పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ఈ కళాశాలలో సీట్లను దోస్త్ వెబ్ సైట్ https://dost.cogg.gov.in ద్వారా భర్తీ చేస్తారు తొలివిడత రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన టెక్నాలజీ  ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా   రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం 'టి యాప్ ఫోలియో 'డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా విద్యార్థుల అనుమానాలు తీర్చేందుకు ఈసారి చాట్ బోట్ అనే పద్ధతి వాట్సాప్ లో అనుమానాలు తీరుస్తారు చాట్ బోట్ వాట్సాప్ నెంబర్  790 100 2200 ఈ నెంబర్ ని కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేశాక వాట్సాప్ ద్వారా ఏ జి అని టైప్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు

Wednesday, 19 August 2020

సెప్టెంబర్ లో హెచ్ .సి .యు ప్రవేశ పరీక్షలు...!


నవంబర్ మొదటి వారంలో కొత్త విద్యార్థులకు తరగతులు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్. సి. యు)2020-21 విద్యాసంవత్సరంలో వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ కోర్సులలో ప్రవేశానికి పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24 26 తేదీలలో ప్రవేశ పరీక్ష లను నిర్వహించినట్లు బుధవారం హెచ్. సి. యు  వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు వెల్లడించారు. జేఈఈల నిర్వహణకు ప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో హెచ్ సి యు ఈ నూతన షెడ్యూల్ తో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు ఈ ఏడాది 62,583 మంది ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నట్లు వెల్లడించారు పరీక్షల నిర్వహణ అనంతరం ఇతర ప్రవేశ ప్రక్రియ పూర్తి చేసి నవంబర్ మొదటివారంలో కొత్త విద్యార్థుల కోసం తరగతులను ప్రారంభించాలని హెచ్ సి యు భావిస్తోందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న బ్యాచ్లలో సుమారు 2000 మంది విద్యాసంవత్సరంలో విద్యాసంవత్సరంలో వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు గురువారం నుంచి ఆన్లైన్ లో తరగతులు ప్రారంభిస్తామని అన్నారు. మరోవైపు ఆన్లైన్ సెమిస్టర్ కోసం హెచ్ సి యు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, అధ్యాపకులు, విద్యార్థులు, వివిధ విభాగాల వద్ద ఐసిటి మౌలిక సదుపాయాలను పెంచడం ద్వారా ఉపయోగించగల అభ్యాస నిర్వహణ వ్యవస్థను (ఎల్ఎంఎస్) ఏర్పాటు చేశామన్నారు.

Monday, 17 August 2020

UG,PG పరీక్షలపై హైకోర్టు నోటీసు....!



TS లో UG,PG చివరి సెమిస్టర్, ప్రవేశ పరీక్షల పై హైకోర్టు లో విచారణ జరిగింది UG,PG చివరి సెమిస్టర్ పరీక్షలపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుందని హైకోర్ట్ ఏజి తెలిపారు దీంతో ప్రవేశ పరీక్షలు,UG,PG చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ పై ఈ నెల 24న విచారణ జరుపుతామన్నా హైకోర్టు... ఈనెల 23 లోపు కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది

జేఈఈ నీట్ పరీక్షలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు!



సెప్టెంబర్‌ నెలలో ముందుగా నిర్ణయించినట్లుగా జేఈఈ, నీట్ పరీక్షలు జరుగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జేఈఈ, నీట్‌ పరీక్షలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కరోనా భయాలతో అతి ముఖ్యమైన జేఈఈ, నీట్‌ పరీక్షలను వాయిదా వేసేందుకు నిరాక‌రించిందిపరీక్షల వాయిదాని కోరుతూ 11 మంది విద్యార్థులు వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ‘కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిందే. మరో ఏడాది కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవచ్చు. కావునసెప్టెంబ‌ర్ 1 నుంచి 6వ తేదీ వ‌ర‌కు జేఈఈ మెయిన్స్, సెప్టెంబ‌ర్ 13న నీట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాల్లో నిర్వహించేందుకు  ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు

Sunday, 16 August 2020

తెలంగాణ లో డిజిటల్ తరగతులు వాయిదా!





తెలంగాణలో రేపటి నుంచి దూరదర్శన్, టిశాట్ ఛానళ్లలో ప్రారంభం కానున్న ఇంటర్ డిజిటల్ తరగతులు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తామని పేర్కొంది కాగా ఆగస్టు 17 నుండి ఇంటర్, 20 నుండి 6th -10th, సెప్టెంబర్ 1నుండి 3rd -5th తరగతులకు డిజిటల్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే