Saturday, 16 February 2019
తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురుకులాల లో 5 తరగతి లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ
By . at February 16, 2019
No comments
తెలంగాణా లో మరో రెండు కొత్త జిల్లాలు:నారాయణ పేట ,ములుగు
By . at February 16, 2019
No comments
తెలంగాణా హోమ్ శాఖ మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పరుస్తూ తుది నోటిఫికేషన్ వెలువరించింది.అవి పాత వరంగల్ జిల్లా లోని ములుగు ,పాత మహబూబ్ నగర్ జిల్లా లోని నారాయణ పేట.నారాయణ పేట లో 11 మండలాలు ,ములుగు లో 9 మండలాలను చేర్చారు.నారాయణ పేట జిల్లా కు ,మహబూబ్ నగర్ కలెక్టర్ రోనాల్డ్ రాస్ ను ,ములుగు జిల్లా కు భూపాల పల్లి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ల కు అదనపు బాధ్యతలు ఇచ్చారు.అదే విధంగా మహబూబ్ నగర్ sp రెమా రాజేశ్వరి , భూపాల పల్లి sp భాస్కరన్ లను కొత్త జిల్లాలకు sp లు గా అదనపు బాధ్యతలు ఇచ్చారు.దీంతో రాష్ట్రంలో ని మొత్తం జిల్లాల సంఖ్య 31 చేరింది.
Friday, 15 February 2019
"వందే భారత్ " eక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ
By . at February 15, 2019
No comments
ఈ రోజు ఢిల్లీ లో ప్రధాని మోడీ పూర్తి స్థాయి లో దేశీయంగా తయారైన సెమీ హై స్పీడ్ మరియు ఇంజన్ రహిత రైలు "వందే భారత్ ఎక్స్ ప్రెస్" ను ప్రారంభించారు. పుల్వామా లో టెర్రర్ అటాక్ వల్ల ప్రధాని కొంచెం ముభావంగా నే దీనికి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఇది ఢిల్లీ నుండి వారణాసి వరకు 9 గంటల 45 నిమిషాల లో 750 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.దీని పూర్తి సామర్థ్య వేగం 160 కి.మీ./గంట. సుమారు 16 కోచ్ లున్న దీని లో గరిష్టంగా 1125 ప్రయాణికులు గరిష్టంగా ప్రయనించ వచ్చు. ఆటోమేటిక్ డోర్లు,GPS ,హాట్ స్పాట్ ,వైఫై వంటి ఎన్నో డిజిటల్ సౌకర్యాలు ఉంటాయి. ఇది చెన్నై లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లో తయారైంది.పూర్తి దేశీయంగా తయారైన ఇది 18 నెలల్లో తయారైంది. .దీనికి గల ప్రత్యేక బ్రేక్వ్యవస్థ, 30 శాతం విద్యుత్ ని ఆదా చేస్తుంది దీని లో చైర్ కార్ టికెట్ ధర 1760, ఎక్జిక్యూటివ్ టికెట్ ధర 3310 రూపాయలు .
Thursday, 14 February 2019
టీఎస్ ఎడ్-సెట్ షెడ్యుల్ ఖారారు:25 న నోటిఫికేషన్
By . at February 14, 2019
No comments
తెలంగాణా ప్రభుత్వం ఎడ్ సెట్ నోటిఫికేషన్ ను ఈ నెల 25 వ తేదీన విడుదల చేయనుంది.మే 31 న పరిక్ష నిర్వహిస్తారు.జూన్ 15 న ఫలితాలు వెల్లడించనుంది. ఈ నెల 28 నుండి వచ్చే నేల ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు తీసుకుంటారు.ఆలస్య రుసుము తో మే 4 వరకు దరఖాస్తు తీస్కుంటారు. డిగ్రీ పూర్తయిన విద్యార్థులు, టీచర్ కావడానికి ఎలిజిబిలిటీ అయిన బీ ఈడీ కోర్సు రెండు సంవత్సరాల కోర్సు. తెలుగు,ఇంగ్లీష్ ,బయలాజికల్ సైన్స్ ,ఫిజికల్ సైన్స్ ,మాథ్స్ , సోషల్ స్టడీస్ ల లో బీ ఈడీ ఉంటుంది. ఈ కోర్సులో చేరడానికి ప్రతీ సంవత్సరం నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు. దీనిని ఉస్మానియా యునివర్సిటీ నిర్వహించనుంది.150 మార్కుల పేపర్ ,ఆబ్జెక్టివ్ విధానం లో ఉంటుంది.ఇందులో 100 మార్కులు సబ్జెక్టు ,మిగతా 50 మార్కులకు గానూ,gk , టీచింగ్ ఆప్టిట్యూడ్ ,ఇంగ్లీష్ లు ఉంటాయి.
Wednesday, 13 February 2019
యూనివర్సిటీ మరియు డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు ,ఫిజికల్ డైరెక్టర్ లకు 7 వేతన సవరణ పెంపు జీ.ఓ విడుదల
By . at February 13, 2019
No comments
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న యూనివర్సిటీ మరియు డిగ్రీ కాలేజీ లలో పని చేస్తున్న అధ్యాపకులు మరియు వ్యాయామ అధ్యాపకుల కు యూజీసీ 7 వ వేతన సవరణ ప్రకారం జీతాలు పెంచుతూ ,ఆ రాష్ట్ర ప్రభుత్వం జీ.ఓ .జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అధ్యాపకులలో ఆనందం వ్యక్తం అవుతోంది.దీని ప్రకారం యూనివర్సిటీ మరియు డిగ్రీ కాలేజి లలో పనిచేసే అధ్యాపకుల కి ,2016 జనవరి 1 వ తేదీ నుండి ఈ పెరుగుదల ఉంటుంది.
దీంతో వీరికి 45 శాతం జీతాలు పెరుగుతాయి.2016 జనవరి 1 నుండి ఇప్పటివరకు బకాయిలు 3 దఫాలుగా చెల్లించనున్నారు. ఈ బకాయిలలో సగం కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది.బకాయిలను cps ఉద్యోగులకు 10 వారి ప్రాన్ లోకి 90%నగదు చెల్లిస్తారు. OPS వారికి 100 శాతం వారి GPF అకౌంట్ లలో జమ చేస్తారు.
Monday, 11 February 2019
ఆస్ట్రేలియా సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా టీమ్ ని వెక్కిరుస్తున్న సెహ్వాగ్ యాడ్:సీరియస్ వార్నింగ్ ఇచ్చిన హెడెన్
By . at February 11, 2019
No comments
టీమ్ ఇండియా ఆస్ట్రేలియా కి టూర్ కి వెళ్లినప్పుడు ఓ టెస్టు మ్యాచ్ సందర్బంగా ,యువ బ్యాట్సమన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తుండగా ,వికెట్ కీపర్ ,కెప్టెన్ టిమ్ పైన్ ,పంత్ ను ఉద్దేశించి, "వన్డే సిరీస్ కి ధోని వస్తున్నాడట,ఇక నీకు జట్టులో చోటు ఉండదు.నువ్వేం చేస్తావ్..?? మేము బయటకు వెళ్ళినప్పుడు మా పిల్లల్ని చూస్కుంటావా..?? (Will you baby sit for us when we couple go for a movie?) " అని కామెంట్ చేశాడు.అయితే ఆ మ్యాచ్ లో పంత్ చెలరేగి ఆడడం తో ఆ మ్యాచ్ గెలవడమే కాకుండా, సిరీస్ కూడా నెగ్గింది.అప్పుడు జరిగిన ఒక ఫంక్షన్ లో టిమ్ పైన్ భార్య ,పంత్ కి తన బేబీ ని ఇచ్చి ఎత్తుకున్న ఫోటో ను ట్విట్టర్ లో ఉంచడం అంతా సరదాగా సాగి పోయింది.ఇప్పుడు ఈ నెల 24 నుండి ఆస్ట్రేలియా టీమ్ ఇండియా కి 2 t20 లు ,5 వన్డేలు ఆడడానికి వస్తుంది.అయితే స్టార్ స్పోర్ట్స్ ఈ టూర్ కి బ్రాడ్ క్యాస్టర్, కాబట్టి ఒక మంచి ప్రోమో యాడ్ తయారు చేయాలని భావించి, వేరేందర్ సెహ్వాగ్ తో ఒక యాడ్ చేయించింది.ఈ యాడ్ లో వీరూ ఇద్దరు పిల్లలను ఎత్తుకుంటాడు.అయితే ఆ పిల్లలు ఆస్ట్రేలియన్ టీమ్ జెర్సీ వేసుకుని ఉన్నారు.సెహ్వాగ్ ఇందులో "మేము ఆస్ట్రేలియా టూర్ వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని బేబీ సిట్ చేస్తారా..అని అడిగారు...అప్పుడు మేము అన్నాము..ఎందుకు చేయము
.మొత్తం టీమ్ అంతా రండి..తప్పకుండా..మిమ్మల్ని బేబీ సిట్ చేస్తాము అని అన్నాము"అని అంటాడు.
ఇప్పుడు ఈ యాడ్ వైరల్ అవుతుంది.ఈ యాడ్ ను చూసిన మాథ్యూ హెడెన్ సెహ్వాగ్ కి,స్టార్ స్పోర్ట్స్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. " ఆస్ట్రేలియా టీమ్ ని అంత తేలిగ్గా తీసుకోవద్దు..గుర్తుంచుకోండి..వరల్డ్ కప్ ట్రోఫీ ని ఎవరు బేబీ సిట్ చేస్తున్నారో మరవద్దు" అని హెడెన్ ట్వీట్ చేశాడు.ఎందుకంటే వరల్డ్ కప్ నెగ్గింది ఆస్ట్రేలియా కాబట్టి,అది ఇంకా ఆస్ట్రేలియా దగ్గరే ఉంది మరి.
.మొత్తం టీమ్ అంతా రండి..తప్పకుండా..మిమ్మల్ని బేబీ సిట్ చేస్తాము అని అన్నాము"అని అంటాడు.
ఇప్పుడు ఈ యాడ్ వైరల్ అవుతుంది.ఈ యాడ్ ను చూసిన మాథ్యూ హెడెన్ సెహ్వాగ్ కి,స్టార్ స్పోర్ట్స్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. " ఆస్ట్రేలియా టీమ్ ని అంత తేలిగ్గా తీసుకోవద్దు..గుర్తుంచుకోండి..వరల్డ్ కప్ ట్రోఫీ ని ఎవరు బేబీ సిట్ చేస్తున్నారో మరవద్దు" అని హెడెన్ ట్వీట్ చేశాడు.ఎందుకంటే వరల్డ్ కప్ నెగ్గింది ఆస్ట్రేలియా కాబట్టి,అది ఇంకా ఆస్ట్రేలియా దగ్గరే ఉంది మరి.









