Friday, 15 February 2019

"వందే భారత్ " eక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ


ఈ రోజు ఢిల్లీ లో ప్రధాని మోడీ  పూర్తి స్థాయి లో దేశీయంగా తయారైన సెమీ హై స్పీడ్ మరియు ఇంజన్ రహిత రైలు  "వందే భారత్ ఎక్స్ ప్రెస్"  ను ప్రారంభించారు. పుల్వామా లో టెర్రర్ అటాక్ వల్ల ప్రధాని కొంచెం ముభావంగా నే దీనికి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.  ఇది ఢిల్లీ నుండి వారణాసి వరకు 9 గంటల 45 నిమిషాల లో 750 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.దీని పూర్తి సామర్థ్య వేగం 160 కి.మీ./గంట. సుమారు 16 కోచ్ లున్న   దీని లో గరిష్టంగా 1125 ప్రయాణికులు గరిష్టంగా ప్రయనించ వచ్చు. ఆటోమేటిక్ డోర్లు,GPS ,హాట్ స్పాట్ ,వైఫై వంటి ఎన్నో డిజిటల్ సౌకర్యాలు ఉంటాయి.  ఇది చెన్నై లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లో తయారైంది.పూర్తి దేశీయంగా తయారైన ఇది 18 నెలల్లో తయారైంది.  .దీనికి గల ప్రత్యేక బ్రేక్వ్యవస్థ, 30 శాతం విద్యుత్ ని ఆదా  చేస్తుంది  దీని లో చైర్ కార్ టికెట్ ధర 1760, ఎక్జిక్యూటివ్ టికెట్ ధర 3310 రూపాయలు .

0 comments:

Post a Comment