ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న యూనివర్సిటీ మరియు డిగ్రీ కాలేజీ లలో పని చేస్తున్న అధ్యాపకులు మరియు వ్యాయామ అధ్యాపకుల కు యూజీసీ 7 వ వేతన సవరణ ప్రకారం జీతాలు పెంచుతూ ,ఆ రాష్ట్ర ప్రభుత్వం జీ.ఓ .జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అధ్యాపకులలో ఆనందం వ్యక్తం అవుతోంది.దీని ప్రకారం యూనివర్సిటీ మరియు డిగ్రీ కాలేజి లలో పనిచేసే అధ్యాపకుల కి ,2016 జనవరి 1 వ తేదీ నుండి ఈ పెరుగుదల ఉంటుంది.
దీంతో వీరికి 45 శాతం జీతాలు పెరుగుతాయి.2016 జనవరి 1 నుండి ఇప్పటివరకు బకాయిలు 3 దఫాలుగా చెల్లించనున్నారు. ఈ బకాయిలలో సగం కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది.బకాయిలను cps ఉద్యోగులకు 10 వారి ప్రాన్ లోకి 90%నగదు చెల్లిస్తారు. OPS వారికి 100 శాతం వారి GPF అకౌంట్ లలో జమ చేస్తారు.





0 comments:
Post a Comment