Friday, 8 March 2019

టీఎస్ ఎడ్‌సెట్-2019 నోటిఫికేషన్ :ముఖ్యమైన వివరాలు




తెలంగాణ రాష్ట్రం  లోని ప్రభుత్వ, ప్రైవేట్   ఎడ్యుకేషన్   కళాశాలల్లో 2019-20 విద్యా సంవత్సరానికి   గాను రెండేండ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీ.ఈడీ) కోర్సు ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది.
కోర్సు పేరు: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)
మెథడాలజీలు: మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్.
కోర్సు వ్యవధి: రెండేండ్లు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కోర్సులను బట్టి సంబంధిత/అనుబంధ విభాగంలో డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీబీఏ), బీఎస్సీ (హోం సైన్స్) 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ/ఇంజినీరింగ్ (సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో) 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 2019 ఏప్రిల్/మేలో డిగ్రీ పూర్తి చేస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 2019 జూలై 1 నాటికి 19 ఏండ్లు నిండి ఉండాలి. టీఎస్ ఎడ్‌సెట్ పరీక్ష రాయడానికి ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
ఎగ్జామినేషన్ కేంద్రాలుతెలంగాణలో 15 రీజినల్ కేంద్రాలతోపాటు ఏపీలో 3 కేంద్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
-బహుళైచ్ఛిక ప్రశ్నల విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు-150 మార్కులు. పరీక్షను 120 నిమిషాలలో పూర్తిచేయాలి. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
-టీఎస్ ఎడ్‌సెట్‌లో మొత్తం మార్కుల్లో (150 మార్కులు) కనీసం అర్హత మార్కులు 38 (25 శాతం) రావాలి. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కులు లేవు.
పరీక్ష విధానం
  • మ్యాథమెటిక్స్-100 మార్కులు
  • ఫిజికల్ సైన్సెస్-100 మార్కులు (ఫిజిక్స్-50 , కెమిస్ట్రీ-50)
  • బయాలజికల్ సైన్సెస్-100 మార్కులు (బాటనీ-50, జువాలజీ-50)
  • సోషల్ స్టడీస్-100 మార్కులు (జాగ్రఫీ-35, హిస్టరీ-30, సివిక్స్-15, ఎకనామిక్స్-20)
  • ఇంగ్లిష్ -100 మార్కులు
వెబ్‌సైట్: http://edcet.tsche.ac.in
-పార్ట్ ఏ-జనరల్ ఇంగ్లిష్-25 మార్కులు
-పార్ట్ బీ-జనరల్ నాలెడ్జ్-15 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్-10 మార్కులు
-పార్ట్ సీ-మెథడాలజీ-100 మార్కులు
-కింది వాటిలో అభ్యర్థి ఎంచుకున్న ఏదైనా మెథడాలజీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పార్ట్ ఏ, పార్ట్ బీ విభాగాలు అందరికి కామన్‌గా ఉంటాయి. పార్ట్ సీ (మెథడాలజీ) మాత్రమే వేర్వేరుగా ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.650/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.450/-

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది  :            ఏప్రిల్ 10
ఎడ్‌సెట్ పరీక్ష: మే 31, (11 AM -1.00 PM వరకు & 3.00 PM నుంచి 5.00 PM వరకు)

Thursday, 7 March 2019

ఇక నుండి అన్ని యూనివర్సిటీ ల కు ఒకే పీజీ ప్రవేశ పరీక్ష: నిర్వహణ బాధ్యత ఉస్మానియా కు


తెలంగాణా రాష్ట్రం లోని అన్ని యూనివర్సిటీ ల పీజీ ఎంట్రన్స్ లకు ఇక నుండి ఒకే ఒక ఉమ్మడి ప్రవేశ పరీక్ష ను నిర్వాహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.రాష్ట్రం లో ఉన్న అన్ని యూనివర్సిటీ లకు 2019-20 విద్యా సంవత్సరానికి గానూ,   దాదాపు 65 సబ్జెక్టు లకు ఒకే సారి ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నాయి.దీనివల్ల విద్యార్థులకు ఆర్థిక ,సమయ భారం తగ్గనుంది.ఎంసెట్ ,ఐసెట్ లాగే అన్ని యూనివర్సిటీ ల పీజీ లకు ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి గతం లో ఒక కమిటీ ని వేసినప్పటికీ అది ఉమ్మడి ప్రవేశ పరీక్ష సాధ్యం కాదని తేల్చి చెప్పడం తో ఇది కార్యరూపం దాల్చలేదు.కానీ ఉన్నత విద్యామండలి పట్టుదలతో మళ్లీ ప్రయత్నించి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ లను ఒప్పించింది. దీని నిర్వహణ బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీ కి అప్పజెప్పారు.దీనిని మేము సమర్థంగా నిర్వహిస్తామని ఉస్మానియా వైస్ చాన్స్ లర్ రామచంద్రం తెలిపారు.
ప్రవేశ పరీక్ష ఆన్ లైన్ లో
గత సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ప్రవేశ పరీక్షని ఆన్ లైన్ లో విజయవంతంగా నిర్వహించగా ,ఇప్పుడు ఈ అన్ని యూనివర్సిటీ ల ఉమ్మడి ప్రవేశ పరీక్షను కూడా ఆన్లైన్ విధానం లోనే నిర్వహిస్తామని వీసీ తెలిపారు.
నిర్వహణ ఎలా?
ఉదాహరణకు గతం లో ఒక డిగ్రీ పూర్తయిన  విద్యార్థి తెలుగు ల్ఓఓ పీజీ ఎంట్రన్స్ రాయాలంటే ప్రతీ యూనివర్సిటీ కి వేర్వేరు గా అప్లై చేయాల్సి రావడమే కాక ప్రతీ యూనివర్సిటీ కి వేర్వేరు నగరానికి వెళ్లి పరీక్ష రాయాల్సి వచ్చేది.ఉమ్మడి ప్రవేశ పరీక్ష వల్ల తెలుగు పరీక్ష కు ఒకే  ఒక అప్లికేషన్ ,ఒకసారి పరీక్ష రాస్తే సరిపోతుంది.దీనివల్ల విద్యార్థికి ఎంతో శ్రమ తగ్గుతుంది.
ఇక అడ్మిషన్ ప్రక్రియ కూడా ,విద్యార్థి రాంక్ మరియు అతడు ఎంచుకున్న ఆప్షన్ ని బట్టి అతనికి సీట్ అలాట్మెంట్ ఉంటుంది.

Wednesday, 6 March 2019

ప్రపంచం లో నే అత్యంత కుబేరుడు : అమెజాన్ అధిపతి జెఫ్‌ బెజోస్‌


ప్రపంచ కుబేరుల జాబితాను ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది.ఇందులో ప్రస్తుతం వివిధ వ్యక్తుల యొక్క కంపెనీ విలువ మార్కెట్ లో వారి షేర్ల విలువలు లెక్క గట్టి ఈ జాబితాను ప్రకటించింది.ఈ సారి కూడా ప్రపంచం లోనే అత్యంత ధనవంతుడిగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ నిలిచాడు.ఇతడి సంపద విలువ సుమారు 9 లక్షల కోట్లు.రెండవ స్థానం లో బిల్ గేట్స్  ,మూడవ స్థానం లో వారెన్ బఫెట్ నిలిచాడు.పేస్ బుక్ అధిపతి మార్క్ జుకెర్ బర్గ్ 
8 వ స్థానం లో నిలవగా ,గూగుల్ సహ అధిపతి లారీ పేజ్ 10 వ స్థానం లో నిలువగా ఆసియా లోనే కుబేరుడు ,ముఖేష్ అంబానీ 13 వ స్థానం లో నిలిచాడు.ఇతడు గత సంవత్సరం 19 వ స్థానం లో ఉండే వాడు .ఏకంగా 6 స్థానాలు ఎగబాకాడు.ఇతడు గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్(14)  ను దాటేశాడు.ఇదే వేగం చూపితే త్వరలోనే టాప్ 5 లో ఉంటాడు.ఇతని ఆదాయం 3.5 లక్షల కోట్లు.క్రింది లిస్టు ఇండియా లోని కుబేరుల లో 100 లోపు ర్యాంక్ ఉన్నవారిది.