కోర్సు పేరు: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)
మెథడాలజీలు: మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్.
కోర్సు వ్యవధి: రెండేండ్లు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కోర్సులను బట్టి సంబంధిత/అనుబంధ విభాగంలో డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీబీఏ), బీఎస్సీ (హోం సైన్స్) 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ/ఇంజినీరింగ్ (సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో) 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 2019 ఏప్రిల్/మేలో డిగ్రీ పూర్తి చేస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 2019 జూలై 1 నాటికి 19 ఏండ్లు నిండి ఉండాలి. టీఎస్ ఎడ్‌సెట్ పరీక్ష రాయడానికి ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
ఎగ్జామినేషన్ కేంద్రాలు: తెలంగాణలో 15 రీజినల్ కేంద్రాలతోపాటు ఏపీలో 3 కేంద్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
-బహుళైచ్ఛిక ప్రశ్నల విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు-150 మార్కులు. పరీక్షను 120 నిమిషాలలో పూర్తిచేయాలి. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
-టీఎస్ ఎడ్‌సెట్‌లో మొత్తం మార్కుల్లో (150 మార్కులు) కనీసం అర్హత మార్కులు 38 (25 శాతం) రావాలి. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కులు లేవు.
పరీక్ష విధానం
- మ్యాథమెటిక్స్-100 మార్కులు
- ఫిజికల్ సైన్సెస్-100 మార్కులు (ఫిజిక్స్-50 , కెమిస్ట్రీ-50)
- బయాలజికల్ సైన్సెస్-100 మార్కులు (బాటనీ-50, జువాలజీ-50)
- సోషల్ స్టడీస్-100 మార్కులు (జాగ్రఫీ-35, హిస్టరీ-30, సివిక్స్-15, ఎకనామిక్స్-20)
- ఇంగ్లిష్ -100 మార్కులు
-పార్ట్ ఏ-జనరల్ ఇంగ్లిష్-25 మార్కులు
-పార్ట్ బీ-జనరల్ నాలెడ్జ్-15 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్-10 మార్కులు
-పార్ట్ సీ-మెథడాలజీ-100 మార్కులు
-కింది వాటిలో అభ్యర్థి ఎంచుకున్న ఏదైనా మెథడాలజీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పార్ట్ ఏ, పార్ట్ బీ విభాగాలు అందరికి కామన్‌గా ఉంటాయి. పార్ట్ సీ (మెథడాలజీ) మాత్రమే వేర్వేరుగా ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.650/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.450/-
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది : ఏప్రిల్ 10
ఎడ్‌సెట్ పరీక్ష: మే 31, (11 AM -1.00 PM వరకు & 3.00 PM నుంచి 5.00 PM వరకు)




0 comments:
Post a Comment