Thursday, 7 March 2019

ఇక నుండి అన్ని యూనివర్సిటీ ల కు ఒకే పీజీ ప్రవేశ పరీక్ష: నిర్వహణ బాధ్యత ఉస్మానియా కు


తెలంగాణా రాష్ట్రం లోని అన్ని యూనివర్సిటీ ల పీజీ ఎంట్రన్స్ లకు ఇక నుండి ఒకే ఒక ఉమ్మడి ప్రవేశ పరీక్ష ను నిర్వాహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.రాష్ట్రం లో ఉన్న అన్ని యూనివర్సిటీ లకు 2019-20 విద్యా సంవత్సరానికి గానూ,   దాదాపు 65 సబ్జెక్టు లకు ఒకే సారి ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నాయి.దీనివల్ల విద్యార్థులకు ఆర్థిక ,సమయ భారం తగ్గనుంది.ఎంసెట్ ,ఐసెట్ లాగే అన్ని యూనివర్సిటీ ల పీజీ లకు ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి గతం లో ఒక కమిటీ ని వేసినప్పటికీ అది ఉమ్మడి ప్రవేశ పరీక్ష సాధ్యం కాదని తేల్చి చెప్పడం తో ఇది కార్యరూపం దాల్చలేదు.కానీ ఉన్నత విద్యామండలి పట్టుదలతో మళ్లీ ప్రయత్నించి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ లను ఒప్పించింది. దీని నిర్వహణ బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీ కి అప్పజెప్పారు.దీనిని మేము సమర్థంగా నిర్వహిస్తామని ఉస్మానియా వైస్ చాన్స్ లర్ రామచంద్రం తెలిపారు.
ప్రవేశ పరీక్ష ఆన్ లైన్ లో
గత సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ప్రవేశ పరీక్షని ఆన్ లైన్ లో విజయవంతంగా నిర్వహించగా ,ఇప్పుడు ఈ అన్ని యూనివర్సిటీ ల ఉమ్మడి ప్రవేశ పరీక్షను కూడా ఆన్లైన్ విధానం లోనే నిర్వహిస్తామని వీసీ తెలిపారు.
నిర్వహణ ఎలా?
ఉదాహరణకు గతం లో ఒక డిగ్రీ పూర్తయిన  విద్యార్థి తెలుగు ల్ఓఓ పీజీ ఎంట్రన్స్ రాయాలంటే ప్రతీ యూనివర్సిటీ కి వేర్వేరు గా అప్లై చేయాల్సి రావడమే కాక ప్రతీ యూనివర్సిటీ కి వేర్వేరు నగరానికి వెళ్లి పరీక్ష రాయాల్సి వచ్చేది.ఉమ్మడి ప్రవేశ పరీక్ష వల్ల తెలుగు పరీక్ష కు ఒకే  ఒక అప్లికేషన్ ,ఒకసారి పరీక్ష రాస్తే సరిపోతుంది.దీనివల్ల విద్యార్థికి ఎంతో శ్రమ తగ్గుతుంది.
ఇక అడ్మిషన్ ప్రక్రియ కూడా ,విద్యార్థి రాంక్ మరియు అతడు ఎంచుకున్న ఆప్షన్ ని బట్టి అతనికి సీట్ అలాట్మెంట్ ఉంటుంది.

0 comments:

Post a Comment