Saturday, 20 August 2016
RBI నూతన గవర్నర్ గా ఉర్జిత్ పటేల్.
By . at August 20, 2016
No comments
ఊహాగానాలకు తెరపడింది. ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కొనసాగుతున్న ఊర్జిత్ పటేల్‌ను ప్రభుత్వం గవర్నర్‌గా ప్రకటించింది. ఈ విషయంలో తుదికంటా పలువురి పేర్లు వినిపించినా చివరికి ఊర్జిత్‌కే ఆ అవకాశం దక్కింది. ఇక గవర్నర్ పదవి నుంచి రాజన్ తప్పుకుంటున్నట్టు ప్రకటించినప్పటి నుంచి పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అర్వింద్ సుబ్రమణియన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అర్వింద్ పనగారియా, మాజీ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాకేశ్ మోహన్, ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఎకనమిక్స్ అపైర్స్ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తదితరులు పేర్లు విస్తృత ప్రచారం పొందాయి. తాజాగా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ సుబీర్ గోకర్న్ పేరుకూడా తెరపైకి వచ్చింది. అయితే కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఊర్జిత్ పటేల్ పేరును ప్రకటించి ఊహాగానాలకు తెరదించింది.
సరోద్ విద్యాంసుడు అంజాద్ అలీఖాన్‌కు బ్రిటన్ వీసా మంజూరు
By . at August 20, 2016
No comments
న్యూఢిల్లీ: ప్రముఖ సరోద్ విద్వాంసుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఉస్తాద్ అంజాద్ అలీఖాన్ (70)కు బ్రిటన్ వీసా మంజూరు చేసింది. ఆయన వీసా దరఖాస్తును అసంపూర్ణ సమాచారం కారణంగా ఇటీవల బ్రిటన్ తిరస్కరించింది. తనకు వీసా నిరాకరించిన విషయాన్ని అంజాద్ అలీఖాన్ ఇటీవల ట్విట్టర్‌లో వెల్లడించడంతో అది సంచలనమైంది. గతంలో తనకు ఎన్నడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్, బ్రిటన్‌లో భారత రాయబార కార్యాలయం, ఇండియాలోని బ్రిటన్ ఎంబసీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. దీంతో బ్రిటన్ రాయబార కార్యాలయం స్పందించి...అంజాద్ అప్లికేషన్ సరైన ఫార్మెట్‌లో ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటామని పేర్కొంది. ఈ క్రమంలో ఆయనకు బ్రిటన్ తాజాగా వీసా మంజూరు చేసింది. దీనిపై సరోద్ మాస్ట్రో ఉస్తాద్ అలీఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. వీసా విషయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫేస్‌బుక్‌లో తన సందేశం ఉంచారు. వీసా విషయంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారంటూ భారత సంతతి ఎంపీ కీత్ వాజ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను ముందుగా చెప్పినట్టే సెప్టెంబరు 18న లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో దర్శన ఇచ్చేందుకు ఎదురుచూస్తున్న్టటు చెప్పారు.
Friday, 19 August 2016
4G అందరికీ ఫ్రీ
By . at August 19, 2016
No comments
♦ ఓపెన్ మార్కెట్లో ప్రివ్యూ ఆఫర్
♦ 90 రోజులపాటు అన్‌లిమిటెడ్
♦ టెలికం రంగంలో జియో సంచలనం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మీదగ్గర 4జీ స్మార్ట్‌ఫోన్ ఉందా? ఇంకేం ఎంచక్కా 90 రోజులపాటు అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్ ఎంజాయ్ చేయండి. అదీ ఉచితంగా. నమ్మశక్యంగా లేదు కదూ. టెలికం మార్కెట్లో పెను సంచలనానికి రిలయన్స్ జియో తెరతీసింది. ఇప్పటి వరకు కొందరికే పరిమితమైన జియో ప్రివ్యూ ఆఫర్ ఇక నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. 4జీ స్మార్ట్‌ఫోన్ ఉన్న కస్టమర్లు ఎవరైనా జియో సిమ్‌ను ఉచితంగా తీసుకోవచ్చు. 90 రోజులపాటు అపరిమితంగా జియో సేవలను ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో వాణిజ్యపర కార్యకలాపాలను ఇంకా ప్రకటించక ముందే తీసుకున్న తాజా నిర్ణయం టెలికం మార్కెట్‌ను షేక్ చేయనుంది.
ఆకట్టే ప్రివ్యూ ఆఫర్..
రిలయన్స్ జియో ఆరు నెలల క్రితం ప్రివ్యూ ఆఫర్‌ను ప్రారంభించింది. దీని కింద 4జీ డేటా, వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ కాల్స్, 10 రకాల జియో ప్రీమియం యాప్స్‌ను అపరిమితంగా వినియోగించుకోవచ్చు. తొలుత రిలయన్స్ ఉద్యోగులు, వారి బంధువులకు దీనిని అమలు చేసింది. ఆ తర్వాత లైఫ్ స్మార్ట్‌ఫోన్ కొన్న కస్టమర్లకు 90 రోజులపాటు ప్రివ్యూ ఆఫర్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 8 లక్షల పైచిలుకు కార్పొరేట్ కంపెనీలను జియో సంప్రదించింది. ఈ కంపెనీల ఉద్యోగులకు ఇప్పటి వరకు ఏ టెలికం సంస్థా ఇవ్వనటువంటి అత్యుత్తమ సీయూజీ ప్యాక్‌ను ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. అలాగే లైఫ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ కొనుక్కోకపోయినా కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులందరికీ ప్రివ్యూ ఆఫర్‌ను అమలు చేస్తోంది. దీనినిశామ్‌సంగ్, హెచ్‌పీ వినియోగదార ్లకు విస్తరించింది. తాజాగా 4జీ స్మార్ట్‌ఫోన్ ఏ కంపెనీదైనా సరే. ప్రతి ఒక్క కస్టమర్‌కు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లు సమీపంలోని రిలయన్స్ డిజిటల్ లేదా అధీకృత స్టోర్‌ను సంప్రదించి ఉచిత సిమ్‌ను పొందవచ్చు.

గణనీయంగా కస్టమర్లు..
ప్రివ్యూ ఆఫర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా 25 లక్షలపైచిలుకు కస్టమర్లను జియో సొంతం చేసుకుంది. వీరిలో ఒకట్రెండు లక్షలు మినహా మిగిలినవారంతా లైఫ్ స్మార్ట్‌ఫోన్ కస్టమర్లే. రూ.3 వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లైఫ్ బ్రాండ్ ప్రకటించడం సంచలనం సృష్టించింది. దీనికితోడు ప్రివ్యూ ఆఫర్ ఉండడంతో కస్టమర్ల సంఖ్య అనూహ్యంగా దూసుకెళ్తోంది. మరోవైపు జియోఫై వైఫై హాటాస్పాట్‌కు ఏకంగా 31 ఉపకరణాల ను అనుసంధానించవచ్చు. వైఫై ఫీచర్ ఉన్న ప్రతి ఉపకరణంలో 4జీ స్పీడ్ ఎంజాయ్ చేయవచ్చు. చేతిలో ఇమిడిపోయే ఈ గ్యాడ్జెట్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ధర రూ.2,899. దీనిపైనా ప్రివ్యూ ఆఫర్ ఉంది. కస్టమర్ల వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్ వాయిస్ ఓవర్ ఎల్‌టీఈని సపోర్ట్ చేయకపోయినా సరే. జియో జాయిన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. దీనిద్వారా 2జీ, 3జీ ఫోన్లలో హెచ్‌డీ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మెసేజింగ్ సౌకర్యం పొందవచ్చు.

అంతా 4జీ మయం..
జియో కస్టమర్లు నెలకు సగటున 30 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. పంజాబ్‌లో 100 జీబీ దాకా నమోదైంది. అంటే ఈ స్థాయిలో డేటాకు డిమాండ్ పెరుగుతోంది. లైఫ్ స్మార్ట్‌ఫోన్లు రూ.3 వేల నుంచి లభించడం, అపరిమిత ఉచిత డేటా.. వెరశి భారత్‌లో మొబైల్ వినియోగదార్లు జియో 4జీకి ఆకర్షితులు అవడం ఖాయంగా కనపడుతోంది. పైగా ప్రివ్యూ ఆఫర్ తర్వాత ఒక జీబీకి చార్జీ రూ.100 లోపే ఉండే అవకాశం ఉంది. ఇదే నిజమైతే టెలికం మార్కెట్ అంతా ఒకవైపుకు పోవడం ఖాయమని పరిశ్రమ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. 2003లో రిలయన్స్ ఇన్ఫోకామ్ మాన్సూన్ హంగామా పేరుతో రూ.501లకే సీడీఎంఏ ఫోన్లను ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే జియో అమ లు చేస్తున్న వ్యూహం అటు మొబైల్ ఫోన్ మార్కెట్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.

కస్టమర్ జేబులో రూ.20 వేలు..
ప్రస్తుతం జియో కస్టమర్ సగటున రోజుకు 1 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. మార్కెట్‌లో ఉన్న టెలికం కంపెనీల డేటా చార్జీలను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో జీబీకి ఎంత కాదన్నా రూ.200 అవుతుంది. అంటే 30 రోజులకు రూ.6 వేలు. అలా 90 రోజులంటే రూ.18 వేలు. ఉచిత వాయిస్ కాల్స్ విలువ మూడు నెలలకు రూ.2 వేలు అవుతుందని అనుకుంటే.. మొత్తంగా ప్రివ్యూ ఆఫర్ కింద ఒక్కో కస్టమర్ రూ.20 వేల విలువ చేసే ప్యాకేజీని ఫ్రీగా ఎంజాయ్ చేస్తారన్న మాట.

టెలికం కార్యదర్శితో ముకేశ్ అంబానీ భేటీ
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ శుక్రవారంనాడు టెలికం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్‌తో సమావేశమయ్యారు. తమ టెలికం వెంచర్ రిలయన్స్ జియో 4జీ ఆవిష్కరణ ప్రణాళికపై వీరిరువురు చర్చించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. టెలికం ఆపరేటర్లు తమ ట్రయల్ సర్వీసులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని జియో అందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ సహా పలు ఇతర టెలికం కంపెనీలతో కూడిన సీవోఏఐ ఇటీవల డాట్‌కి ఒక ఉత్తరం రాస్తూ... జియో నిబంధనలకు విరుద్ధంగా తన 15 లక్షల మంది యూజర్లకు ట్రయల్స్ చాటున పూర్తి స్థాయి సేవలను అందిస్తోందని ఆరోపించింది. తాజా పరిణామాల నేపథ్యంలో తాజా ముకేశ్ అంబానీ, దీపక్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ముకేశ్ వెంట ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీ కూడా ఉన్నారు. ఇటీవలే టెలికం కార్యదర్శితో భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, రిలయన్స్ జియో ప్రతినిధి కూడా సమావేశం అయ్యారు.

Central Govt releases Rs. 1,976 cr. to A.P.
By . at August 19, 2016
No comments
The Central government has announced release of Rs. 1,976 crore as additional assistance to Andhra Pradesh giving a sigh of relief to the cash-strapped State.
Of the total sum assured, Rs. 1,176 crore would be towards bridging the revenue deficit. The Centre also sanctioned Rs. 350 crore at Rs. 50 crore each for the seven backward districts – three in north coastal Andhra and four in Rayalaseema – and another Rs. 450 crore towards the construction of the new Capital Amaravati.
The Finance Ministry released order to this effect on Thursday and the money is expected to be transferred to the State’s account on Friday. The release follows Rs. 2,303 crore released for the fiscal year 2014-15. The State will still be left with a huge gap as the projected revenue deficit for the 2014-15 fiscal had been fixed at Rs. 14,430 crore which was even confirmed by the Accountant General.
Union Minister Y. Satyanarayana (Sujana) Chowdary, however, said the latest announcement was part of the special package promised to the State. “More assistance is in the pipeline,” he told The Hindu .
According to sources, the release follows the instructions from Prime Minister Narendra Modi’s office. The Prime Minister is learnt to have taken a decision on extending assistance to Andhra Pradesh following his meetings with Union Ministers Arun Jaitley and M. Venkaiah Naidu.
‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ప్రధాని మోదీ!
By . at August 19, 2016
No comments
‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ప్రధాని నరేంద్రమోదీ వ్యవహరించనున్నారు. ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ ప్రచార కార్యక్రమాలను నిర్వహించే కేంద్ర సాంస్కృతిక, టూరిజం మంత్రిత్వ శాఖ పలు చర్చల అనంతరం కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా మోదీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ యాడ్ ఫిల్మ్ కు సంబంధించిన కాన్సెప్ట్ ల విషయమై ఆయా ప్రొడ్యూసర్లను సదరు మంత్రిత్వ శాఖ అడిగినట్లు సమాచారం. ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’కు బెస్ట ఫేస్ ప్రధాని నరేంద్ర మోదీయేనని, ఎందుకంటే, ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన భారత్ గురించి విశ్వవ్యాప్తంగా తెలియజెప్పేందుకు అవకాశముంటుందని కేంద్ర మంత్రి మహేష్ శర్మ అంతకుముందు పేర్కొన్నారు. కాగా, ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్ గా మొన్నటివరకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంలో ‘భారత్ ను విడిచిపోదామని మా ఆవిడ అంది' అంటూ అమీర్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం విదితమే. ఆ తర్వాత 'ఇన్ క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్ గా అమీర్ స్థానే కొత్త వారిని నియమించేందుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సహా పలువురి ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి.
రజతంతో సరిపెట్టుకున్న సింధు...అద్భుతంగా ఆడిన మారిన్
By . at August 19, 2016
No comments
రజతంతో సరిపెట్టుకున్న సింధు...అద్భుతంగా ఆడిన మారిన్
Fri, Aug 19, 2016, 08:58 PM
తొలి సెట్ లో ఆడిన దూకుడును తదుపరి సెట్లలో ప్రదర్శించడంలో సింధు విఫలమైంది. దీంతో మారిన్ ఒలింపిక్స్ స్వర్ణపతక విజేతగా నిలిచింది. సింధు రజత పతక విజేతగా నిలిచింది. సింధు ఓటమిపాలైనప్పటికీ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. అలాగే కోర్టు మొత్తం కలియదిరుగుతూ మారిన్ కొట్టిన షాట్లు ఆటగాళ్లందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్, ర్యాలీ, డ్రాప్, స్మాష్.. ఇలా ప్రతి అంశంలోనూ సింధు కంటే మారిన్ అద్భుత ప్రతిభ కనబరిచింది. దీంతో ఆమె స్వర్ణవిజేత అయింది. అయితే వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణితో 11వ ర్యాంకు క్రీడాకారిణి తలపడినట్టుగా కాకుండా, టాప్ సీడ్ ఆడుతున్నట్టుగానే సింధు ఆడింది.
Thursday, 18 August 2016
200 మీటర్ల పరుగులోనూ సత్తా చాటిన ఉసేన్ బోల్ట్!... హ్యాట్రిక్ గోల్డ్ కొట్టేసిన జమైకా చిరుత!
By . at August 18, 2016
No comments
రియో ఒలింపిక్స్ లో జమైకా చిరుత ఉసేన్ బోల్డ్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచిన ఈ జమైకా ఆథ్లెట్... కొద్దిసేపటి క్రితం ముగిసిన 200 మీటర్ల పరుగులోనూ సత్తా చాటాడు. 19.78 సెకన్లలోనే 200 మీటర్ల పరుగును పూర్తి చేసిన బోల్ట్... ప్రత్యర్థులు అందుకోలేనంత వేగంగా లక్ష్యం చేరాడు. వెరసి వరుసగా మూడు ఒలింపిక్స్ ల్లో 200 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన ఆటగాడిగా అతడు రికార్డు పుటలకు ఎక్కాడు. తాజా స్వర్ణంతో అతడు హ్యాట్రిక్ గోల్డ్ సాధించినట్లైంది. ఈ ఒలింపింక్స్ లో ఈ స్వర్ణం అతడికి రెండోది.
విజయాన్ని సొంతం చేసుకున్న సింధు ...ఫైనల్లోకి దూసుకుపోయిన తెలుగు తేజం
By . at August 18, 2016
No comments
Thu, Aug 18, 2016, 09:27 PM
మరోపతకాన్ని
తెలుగు తేజం సింధు ఖాయం చేసింది. ఒలింపిక్ చరిత్రలో స్వర్ణాన్ని భారత్ కు అందించే దిశగా సింధు కీలక అడుగు వేసింది. బ్రెజిల్ లోని రియో డీ జెనీరోలో జరుగుతున్న బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్స్ లో తెలుగు తేజం సింధు విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరా పై 21-19, 21-10 తేడాతో విజయం సాధించింది. తద్వారా ఫైనల్లో చేరిన తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నిలిచింది. ఈ గెలుపుతో భారత్ కు మరో పతకం ఖాయం చేసిన సింధు స్వర్ణానికి గురిపెట్టింది. రెండు సెట్లలో ఒకుహరా హోరాహోరీగా సింధుతో ఆడింది. టెక్నిక్ కాన్ఫిడెన్స్ తో ఆకట్టుకున్న సింధు తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించి విజయం సాధించింది.