Saturday, 29 June 2019

డిగ్రీ ,యూనివర్సిటీ అధ్యాపకుల 7 వ వేతన సవరణ జీవో విడుదల.


డిగ్రీ లెక్చరర్ లు,యూనివర్సిటీ లలో పని చేసే అధ్యాపకుల 7 వ వేతన సవరణ కు సంబంధించిన జీవో ను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల  చేసింది. దీని ప్రకారం,డిగ్రీ అధ్యాపకులు,యూనివర్సిటీ అధ్యాపకులు మరియు లైబ్రేరియన్ లు,ఫిజికల్ డైరెక్టర్ లు ఈ వేతన సవరణ పొందడానికి అర్హులు.

అంతే కాకుండా యూజీసీ వేతన రూల్స్ ని పాటించే అన్ని డిపార్ట్మెంట్ ల కు ఇది వర్తిస్తుంది.ఈ జీవో ప్రకారం జనవరి 1, 2016 నుండి ఈ వేతన సవరణ ఉంటుంది.మార్చి 31 2016 వరకు  బకాయిల ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సగం,సగం భరిస్తాయి.తర్వాత నుండి అంటే ఏప్రిల్ 1 నుండి పూర్తి రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఖర్చును భరిస్తుంది.ఈ పెంపు వల్ల 2778 మంది బోధనా సిబ్బంది లబ్ది పొందనున్నారు.ఈ పెంపు వల్ల ప్రభుత్వానికి ఏటా 264 కోట్ల భారం పడనుంది.ఈ పెంపు ప్రకారం డిగ్రీ లెక్చరర్, మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ల కనీస వేతనం 57,700 గా నిర్ణయించారు. వీరి పే స్కేల్ 57,700-1,82,400 గా ఉంది.కాగా ఆయా పే బ్యాండ్ లను బట్టి ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది.అయితే 2016 జనవరి 1 నుండి ఇప్పటివరకు రావాల్సిన బకాయిల కు సంబంధించిన G.O . ప్రత్యేకంగా వేరేగా విడుదల చేస్తారు.ఈ పెంపు తో కనిష్టంగా 15,000 గరిష్టంగా 22,000 రూపాయల పెరుగుదల ఉండబోతుంది.

కొత్త పే స్కేల్లు
HRA

0 comments:

Post a Comment