Monday, 3 June 2019

గ్రూప్‌-2 ఎంపిక ప్రక్రియ కు తొలగిన అడ్డంకి : తుది ఫలితాల కు కోర్టు అనుమతి




  •  వైట్ నర్ వాడిన వారు, డబుల్ బుబ్లింగ్ చేసిన వారి పేపర్ లను సాంకేతిక నిపుణుల సహాయంతో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచన : 

తెలంగాణ  గ్రూప్‌-2 బబ్లింగ్‌, వైట్‌నర్‌ వివాదంపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. సాంకేతిక కమిటీ సిఫార్సుతో ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియలో బబ్లింగ్‌, వైట్‌నర్‌ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ చక్రపాణి హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు త్వరలోనే మెరిట్‌ జాబితా, ఇంటర్వ్యూ షెడ్యూల్‌ ప్రకటిస్తామన్నారు.దీంతో ఎంతో మంది నిరుద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

0 comments:

Post a Comment