ఈ రోజు ఉదయం 9.27 నిమిషాలకు శ్రీహరి కోట లోని సతీష్ ధావన్ స్పేస్ లాంచ్ కేంద్రం నుండి భారత్ కి చెందిన రక్షణ సంబంధ ఉపగ్రహం EMISAT ను PSLV C-45 వాహక నౌక ద్వారా విజయవంతంగా ప్రవేశ పెట్టడం జరిగింది.దీనితో పాటు ఇతర దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను కూడా నిర్ణీత కక్ష్య లో ప్రవేశ పెట్టింది .EMISAT ను (ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్.బెంగళూరు) ISRO మరియు DRDO (డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. హైదరాబాద్)లు సంయుక్తంగా 'ప్రాజెక్ట్ కౌటిల్య' లో భాగంగా తయారు చేశాయి.EMISAT అనేది ఆకాశములో మన సైన్యానికి ఒక SPY లాంటి సాటిలైట్.ఇది శత్రు దేశ రాడార్లను గమనిస్తూ మన సైన్యానికి ఫోటోలను పంపుతుంది.ఇక మిగతా 28 శాటిలైట్ ల లో ఒక్క అమెరికా వే 20 శాటిలైట్ లు కాగా,
మిగిలిన వి లిథువేనియా-1,స్విట్జర్లాండ్-1,స్పెయిన్-1 చొప్పున శాటిలైట్ లు.EMISAT ను భూమినుండి 748 కి.మీ ల కక్ష్య లో మిగితా వాటిని 500.కి.మీ ఎత్తు గల కక్ష్య లో ప్రవేశ పెట్టింది.ఈ ప్రయోగానికి వాడిన వాహక నౌక పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికిల్(PSLV)C-45 .





0 comments:
Post a Comment