అగ్ర వర్ణ పేదల లో ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన
ఉన్నారో వారికి విద్యా, ఉద్యోగాల్లో పది
శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు కు లోక్ సభ మంగళ వారం రాత్రి 10 గంటల సమయం లో 323-3 ఓట్ల తేడా తో ఆమోదం తెలిపింది.ఇది రాజ్యాంగ
సవరణ బిల్లు(124 వ).కాబట్టి ఈ బిల్లు కు 2/3 వంతు మెజారిటీ అవసరం కాగా ప్రభుత్వం
దీన్ని కూడా గట్టగలిగింది.కేంద్ర సామాజిక న్యాయ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ దీన్ని
లోక్ సభలో ప్రవేశ పెట్టారు.ఏ మతం వారైనా అగ్ర కులానికి చెంది (OC) సంవత్సరానికి 8
లక్షల లోపు ఆదాయం లేదా 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి గల అగ్రవర్ణాలు దీనికి అర్హులు.అయితే
దేశం లోని అగ్ర వర్ణాలలో దాదాపు 99 % కుటుంబాలు ఈ కేటగిరీ కె చెందిన వారుగా
ఉన్నారు.పేదలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఆమోదం లభించడం
దేశ చరిత్రలో చిర స్థాయిగా నిలిచి పోతుందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.అయితే ఇది
సుప్రీం కోర్టు లో న్యాయ సమీక్ష లో నిలవదని పలు ప్రతి పక్షాలు వాదిస్తునాయి.



0 comments:
Post a Comment