Sunday, 20 January 2019

ప్రతీ పౌరుడికీ నెల నెలా జీతం: త్వరలోనే ప్రారంభం..!ఏ రాష్ట్రంలో తెలుసా..?


సార్వత్రిక కనీస ఆదాయ పథకం (UBI-Universal Basic Income) అంటే ప్రతీ పౌరునికి ప్రతీ నెలా కొంత మొత్తం లో సొమ్మును అంద జేయడం ఈ పథకం ఉద్దేశ్యం. ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేయబోతున్న రాష్ట్రం సిక్కిం.దేశం లోని చిన్న రాష్ట్రాల లో ఒకటైన సిక్కిం ఆ రాష్ట్ర పౌరులకు అందరికీ పేద ధనిక తేడా లేకుండా కొంత ఆదాయాన్ని అంద జేస్తామని ప్రకటించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ ఛామ్లింగ్ ఈ మేరకు ఒక ప్రకటనలో భాగంగా ,ముందుగా ఒక ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టి,2022 సంవత్సరం వరకు రాష్ట్రం మొత్తం అమలు చేయనున్నామని తెలిపారు.సిక్కిం రాష్ట్ర జనాభా 6,10,577 కాగా ఈ పథకం ప్రకారం ఒక్కొక్క పౌరుడికీ ఎంత మొత్తంలో ప్రతీ నెలా ఇవ్వగలమో ఆర్థిక వేత్తలతో   సంప్రదింపులు జరుపుతోంది సిక్కిం ప్రభుత్వం.ప్రతీ పౌరుడూ ఆకలితో ,కనీస అవసరాల లేమితో ఇబ్బందులు పడకూడదనే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. చాలా చిన్న రాష్ట్రమైన సిక్కిం చాలా విషయాలలో పెద్ద రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.ఇప్పటికే ఈ రాష్ట్రంలో ప్రతీ పౌరుడికీ ఇల్లు నిర్మించి ఇచ్చింది.98% అక్షరాస్యత ను సాధించింది.దేశ సగటు పేదరికం 30% కాగా సిక్కిం లో 8 % మాత్రమే.ఈ UBI పథకం అమలు జరిగితే ప్రపంచంలో నే దీన్ని  అమలు చేసిన  ఏకైక రాష్ట్రం , సిక్కిం అవుతుంది. ఎన్నో ధనిక దేశాలు సైతం దీనినిమలు చేయడానికి వెనుక

0 comments:

Post a Comment