Saturday, 26 January 2019

ఆస్త్రేలియన్ ఓపెన్ విజేత నవోమీ ఒసాకా : నెంబర్ వన్ స్థానం కైవసం.


మొట్ట మొదటి ఆసియన్ గా చరిత్ర లిఖించిన నవోమీ:


ఆస్త్రేలియన్ ఓపెన్ మహిళ ల సింగిల్స్   ఫైనల్లో ,హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో చివరికి జపాన్ యువ సంచలనం నవోమీ ఒసాకా ,చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి ,పెట్రా క్విటోవా పై  చెమటోడ్చి నెగ్గింది.సుమారు రెండు గంటల 27 నిమిషాల   పాటు సాగిన ఫైనల్లో, ఒసాకా విజయం సాధించింది.ఆమె 7-6,5-7,6-4 స్కోరు తో విజయం సాధించింది.గత ఎద్కాది యూఎస్ ఓపెన్  ఫైనల్లో సెరీనా పై నెగ్గినప్పుడు ,ఎదో యాదృచ్చికంగా అలా జరిగి ఉంటుంది అని అనుకున్న వారికి ,ఈ విజయం తో ఒసాకా సమాధానం చెప్పినట్లయింది.దీంతో ఏటీపీ ర్యాంకింగ్స్ లో ఆమె ఒకటో ర్యాంకును సొంతం చేసుకుంది.ఈ ఘనత సాధించిన తొలి ఆసియన్ గా చరిత్ర సృష్టించింది.అంతేకాకుండా నెంబర్ వన్ ర్యాంకును చేరుకున్న అతి పిన్న వయస్కులలో రెండో వ్యక్తి ఒసాకా(21 ఏళ్ల 104 రోజులు ).గతం లో కరోలిన్ వోజ్నియాకి అతి చిన్న వయసులో ఈ ఫీట్ సాధించింది.(20 ఏళ్ల 92 రోజులు )  

మెన్స్ సింగిల్స్ ఫైనల్లో దిగ్గజాల పోరు.
పురుషుల సింగిల్స్ లో సెర్బియా స్టార్   నోవాక్ జేకోవిచ్ , స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ల మద్య ఈ రోజు జరుగబోవు ఫైనల్ చాలా రసవత్తరంగా జరగబోతుంది.

0 comments:

Post a Comment