Monday, 21 January 2019

డిగ్రీ లో ఆన్ లైన్ కోర్సులు : వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు


  • శ్రీకారం చుట్ట నున్న కళాశాల విద్యా శాఖ 

  • 2019-2020 విద్యా సంవత్సరం నుండి అమలు

  • సిలబస్ రూపకల్పనలో అంబేడ్కర్ వర్సిటీ తో ఒప్పందం

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ కళాశాల విద్యాశాఖ ,త్వరలోనే డిగ్రీ లో ఆన్ లైన్ కోర్సులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.ఈ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేయబోతున్న ట్లు కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.ఇది కేంద్ర ప్రభుత్వ పథకమైన SWAYAM( Study Webs of Active learning for Young Aspiring Minds)  పథకం లో
భాగమైన MOOCS(Massive Open Online Courses )
విధానంలో అందించ బోతున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా ముందుగా సివిల్ సర్వీస్ పరీక్ష కు సన్నద్ధం కావడానికి తోడ్పడే సబ్జెక్టు లను ముందు గా చేర్చబోతున్నారు.ముఖ్యంగా జాగ్రఫీ,సైకాలజీ,పబ్లిక్అడ్మినిస్ట్రేషన్,జియాలజీ,సోషియాలజీ,లిటరేచర్ సబ్జెక్ట్ లను ముందుగా ఆన్ లైన్ ద్వారా అందించ బోతున్నారు.దీనివల్ల ఒక విద్యార్థి ,తన రెగులర్ డిగ్రీ సబ్జెక్ట్ ల కు అదనంగా పై సబ్జెక్టు లలో ఏదైనా ఒకటి గానీ అంతకన్నా ఎక్కువ సబ్జెక్టు లను ఆన్ లైన్ లో నేర్చుకుని,ఆన్ లైన్ లో పరీక్ష ఉత్తీర్ణత సాధిస్తే,తన రెగులర్ సబ్జెక్టు మెమో లో ఈ ఆన్ లైన్ సబ్జెక్టు మార్కులు కూడా కలిపి సర్టిఫిగ్ట్ వస్తుంది.ఈ విధానాన్ని అమలు చేయడానికి ఇప్పటికే ,సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్  లకు JNTUH లో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది.

0 comments:

Post a Comment