Saturday, 26 January 2019

సుప్రీం కోర్టు తీర్పు తో విశ్వ విద్యాలయాల్లో అద్యాపకుల భర్తీకి మార్గం సుగమం


అద్యాపకుల భర్తీ లలో యూనివర్సిటీ యే రిజర్వేషన్ లకు ప్రాతిపదిక గా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తిరస్కరించింది.గతం లో UGC నిబంధనల ప్రకారం,యూనివర్సిటీ ల  లో అద్యాపకుల భర్తీకి యూనివర్సిటీ మొత్తాన్ని రిజర్వేషన్ ల కు ప్రాతిపదికగా ఉండేది.అయితే ,దీన్ని సవాలు చేస్తూ BHU కి చెందిన వివేకానంద తివారీ అలహాబాద్ హైకోర్టు లో ,పిటిషన్ దాఖలు చేయగా , రిజర్వేషన్ లు అనేవి డిపార్టుమెంటు ప్రాతిపదికగా ఉండాలి   , అని  2015  ఏప్రిల్ 7 న తీర్పు ఇచ్చింది.  వేసింది.దీని పై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు లో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది.దీని పై సుప్రీం స్పందిస్తూ అలహా బాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.ఒక అద్యాపకుడు మరో సబ్జెక్టు లో పాఠాన్ని ఎలా బోధించడం వీలు కాదో ,అలాగే ,ఒక డిపార్టుమెంట్ లోని రిజర్వేషన్ ని ,మరొక డిపార్టుమెంట్ లో వర్తించడం వీలు కాదని తీర్పునిచ్చింది.దీనితో ఇన్నాళ్ళుగా  ఆగి పోయిన  , యూనివర్సిటీ అద్యాపకుల భర్తీ  ఇక తిరిగి ప్రారంభం కానుంది.త్వరలోనే మళ్ళీ ప్రక్రియ మొదలు కావచ్చు.అయితే దీని పై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ తీర్పువల్ల రిజర్వుడు అభ్యర్థులు నష్ట పోతారని అంటున్న్నారు.ఎందుకంటే ఒక దేపార్టు మెంటు లో ఒకే పోస్టు ఖాళీగా ఉన్నప్పుడు ,అది ఓపెన్ కేటగిరీ అయితే మిగితా ,కేటగిరీ అభ్యర్హులు నష్టపోతారని అంటున్నారు. 

0 comments:

Post a Comment