రాష్ట్రంలో ని పాలీ టెక్నిక్ కళాశాలలో 2019-20 విద్యా సంవత్సరానికి పాలీటెక్నీక్ కళాశాల ల లో ప్రవేశాలకు ఈ నెల 14 నుండి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు,ఉన్నత విద్యా కమిషనర్ శ్రీ నవీన్ మిట్టల్ తెలి పారు.
ఈ సారీ విద్యార్థులు ఈ నెల 15-18 వ తేదీల మధ్య తమకు వీలైన తేదీలను ఎంచుకుని గంటకు ఒక స్లాట్ చొప్పున సమయాన్ని ఎంచుకుని ధ్రువపత్రాల వెరిఫికేషన్ కు హాజరు కావచ్చు. దీని షెడ్యూల్ ఇలా ఉంది.
14 వ తేదీ: ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ఫీ చెల్లింపు,స్లాట్ బుకింగ్
15 వ తేదీ నుండి 19: వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం
19 వ తేదీన:ఇచ్చిన ఆప్షన్ లను ఫ్రీజింగ్ చేయడం.
22 వ తేదీ :సీట్ల కేటాయింపు
23-25 వ తేదీ వరకు:ట్యూషన్ ఫీ చెల్లింపు,కళాశాల ల లో చేరుతామని వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్.
జూన్ 1 నుండి :కళాశాలలు ప్రారంభం.
గత ఏడాది ఈ రాంక్ కి ఎక్కడ సీట్ వచ్చిందో తెలిపే సమాచారాన్ని www.polycetts.nic.in వెబ్సైట్ లో ఉంచారు.
రాంక్ కార్డు,ఆధార్,టెన్త్ మెమో,4-10 స్టడీ సర్టిఫికెట్స్,టీసీ, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్, ధృవపత్రాల పరిశీలనకు తీసుకెళ్లాలి.
రాష్ట్రంలో ఈ సారి మొత్తం 162 పాలీటెక్నీక్ కళాశాల లలో అడ్మిషన్ లు ఇస్తారు.ఇందులో 56 ప్రభుత్వ,105 ప్రైవేట్ ,ఒకే ఒక ఎయిడెడ్ కళాశాల ఉన్నాయి.




0 comments:
Post a Comment