Monday, 29 July 2019

CAT (కామన్ అడ్మిషన్ టెస్ట్)-2019 విడుదల :పూర్తి వివరాలు



దేశం లోని ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్  మేనేజ్ మెంట్(ఐఐఎం) లు కూడా ముఖ్య మైనవి.ప్రస్తుతం దేశం లో మొత్తం 20  ఐఐఎం లు ఉన్నాయి.వీటిలో ప్రవేశానికి ప్రతి సంవత్సరం కామన్ అడ్మిషన్ టెస్ట్ (Common Admission Test) ఇవి నిర్వహిస్తాయి. ఇందులో ర్యాంక్ ను బట్టి ఆయా ఐఐఎం లలో  వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం లు మరియు ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్ లు పొందవచ్చు.అంతే కాదు దేశం లోని కొన్ని నాన్ ఐఐఎం సెంటర్ లలో కూడా అడ్మిషన్ పొందడానికి CAT స్కోరు ను పరిగణలోకి తీసుకుంటారు.ఐఐఎం లలో చదివినవారికి అద్భుతమైన ప్లేస్ మెంట్లు మంచి వేతనాలు గల ఉద్యోగాలు జాతీయ అంతర్జాతీయ కంపనీలలో లభిస్తాయి.నిన్న అంటే జూలై 28, 2019 రోజున CAT-2019 నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలు :

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభ తేదీ :.August 07, 2019(10.00AM) రోజున ఈ పరీక్షకు సంబంధించిన

రిజిస్ట్రేషన్ గడువు ముగింపు: September 18(5.00 PM) 2019 రోజున

హాల్ టికెట్ డౌన్ లోడ్ గడువు: అక్టోబర్ 23 నుండి నవంబర్ 24 వరకు.

పరీక్ష తేదీ:  నవంబర్ 24 , 2019 న 

రిజల్ట్ : జనవరి ,2020 రెండవ వారం   

అర్హత : యూజీసీ చేత గుర్తింపబడిన ఏదైనా యునివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పొంది ఉండాలి.
             జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి.
             SC ,ST మరియు వికలాంగ అభ్యర్థులు 45 % మార్కులతో పాస్ అయి ఉండాలి.
            ఇప్పుడు CBCS విధానం కావున అభ్యర్థులు ఆయా యునివర్సిటీ ఇచ్చిన CGPA ను శాతం లోకి
            మార్చి  రిగణిస్తారు.
రిజర్వేషన్:   ఐఐఎం లలో సీట్ల కేటాయింపు క్రింది  రిజర్వేషన్ ల ఆధారంగా జరుగుతుంది.
                     15% -SC అభ్యర్థులకు

                     7.5% ST- అభ్యర్థులకు

                     27% -ఇతర వెనుక బడిన (Other Backward Classes )“non-creamy” layer (NC-OBC)
                     అభ్యర్థులకు

                     10%  ఆర్థికంగా బలహీన వర్గాల (Economically Weaker Sections-EWS) అభ్యర్థులకు.
పరీక్ష విధానం :  కంప్యూటర్ ఆధారిత పరీక్ష

ఫీజు : SC, ST అభ్యర్థులకు & వికలాంగ అభ్యర్థులకు 950 రూపాయలు
           ఇతరులు అందరికీ 1900 రూపాయలు.

నోట్ : ఒక అభ్యర్థి అన్ని ఐఐఎం లకి ఒక్కసారి ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.


పరీక్షా కేంద్రాలు : దేశం లోని గుర్తింపు పొందిన 156 పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడును.

దేశం లోని ఐఐఎం లు: అవి ఆఫర్ చేసే కోర్సులు

      మరిన్ని వివరాలకు CAT website: www.iimcat.ac.in  సందర్శించగలరు.


0 comments:

Post a Comment