2018 టైగర్ సెన్సస్ రిపోర్ట్ ను ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు.జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ మరియు కేంద్ర పర్యావరణ -అటవీ శాఖలు సంయుక్తంగా పులుల సంఖ్యను లెక్కించాయి.2006 నుండి ప్రతీ నాలుగేళ్లకోకసారి ఈ లెక్కింపు జరుపుతున్నారు.
దీని ప్రకారం దేశంలో పులుల సంఖ్యలో 33 శాతం పెరుగుదల కనిపించింది. 2014 లో లెక్కించిన లెక్కల ప్రకారం 2,226 నుండి 2,967 కి పెరిగినట్లు ఈ రిపోర్ట్ ద్వారా తెలిసింది.
ఇక రాష్ట్రాల విషయానికి వస్తే మధ్య ప్రదేశ్ గరిష్టంగ 526 ,పులులను కల్గి ఉండగా , కర్ణాటక 524 పులా సంఖ్యతో రెండో స్థానం లో నిలిచింది. మిజోరాం,చత్తిస్ గడ్ లలో కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల లో పులుల సంఖ్య పెరిగినట్లు ఈ రిపోర్ట్ వెల్లడించింది.
ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2014 లో 68 పులులు ఉండగా ప్రస్తుతం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ కల్సి 74 పులులు ఉన్నాయి.
2014 లో తెలంగాణా లో 20 పులులు (అమ్రాబాద్ 17, కవ్వాల్ 3) ప్రస్తుతంతెలంగాణా లో 26 పులులు (అమ్రాబాద్ 14, కవ్వాల్ లో 12 ) ఉన్నట్లు గా తేలింది.
ఆంధ్రప్రదేశ్ లో 48 పులులు ఉన్నాయి.తెలంగాణా లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్,కవ్వాల్ టైగర్ రిజర్వ్ ల లో పులులు సంరక్షించ బడుతున్నాయి.
ఏది ఏమైనా దేశం లోని అన్ని రాష్ట్రాల కృషి వల్ల పులి వంటి వన్య ప్రాణుల సంఖ్య పెరగడం మనిషికి ప్రకృతి సంరక్షణ పై కొంత సానుకూల దృక్పథం ఏర్పడిందని చెప్ప వచ్చు.




0 comments:
Post a Comment