Wednesday, 10 April 2019

తెలుగు కవి శివారెడ్డి కి "సరస్వతీ సమ్మాన్"పురస్కారం


బిర్లా ఫౌండేషన్ వారు ప్రతీ ఏటా దేశం లోని అద్భుత రచనలు చేసిన కవులకు,రచయిత లకు అందజేసే "సరస్వతీ సమ్మాన్" అవార్డు 2018   సంవత్సరానికి గాను  ప్రముఖ తెలుగు కవి,రచయిత ,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత  శ్రీ డాక్టర్ కే.శివారెడ్డి ని వరించింది.ఆయన రాసి 2016 లో ప్రచురించిన "పక్కకు ఒత్తిగిలితే"అనే 104 కవితల సంపుటి కి ఈ అవార్డు వచ్చింది.13 మంది వివిధ భాషల నిపుణులతో కూడిన ఎంపిక కమిటీ ఆయనని ఎంపిక చేసింది.ఈ అవార్డు తో పాటు ఒక పతకం, ప్రశంసా పత్రంమఱియు 15 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు.1991 లో ప్రారంభించిన ఈ అవార్డును పొందిన తొలి తెలుగు వ్యక్తి శివారెడ్డి.ఇతడు జన్మించింది గుంటూరులో అయినప్పటికీ ,సుమారు 50 ఏళ్ల నుండి హైదరాబాద్ లో ఉంటూ ,వివేకా వర్దిని  కళాశాల లో అధ్యాపకుడు గా ,ప్రిన్సిపాల్ గా  చేసి రిటైర్ అయ్యారు. "సరస్వతీ సమ్మాన్"  అవార్డు పొందిన మొదటి వ్యక్తి హరివంశ రాయ్ బచ్చన్.

ప్రతిరోజూ సందర్శించండి
www.paatshaalaindia.blogspot.com

0 comments:

Post a Comment