Wednesday, 10 April 2019

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు తొలగిన అడ్డంకి:ఈ రోజు అర్ధరాత్రి నుండే నియామక పత్రాలు అందజేత


పంచాయతీ రాజ్ శాఖలో ,9355 జూనియర్ పంచాయితీ కార్యదర్శుల నియామకానికి మార్గం సుగమమం అయింది.2017 లో పంచాయతీ రాజ్ శాఖలో 9355 జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 2018 అక్టోబర్ 10 న పరీక్ష నిర్వహించారు, డిసెంబర్ లో ఫలితాలు వెల్లడించారు.అయితే పరీక్ష తుది కీ,రాంక్ లు మరియు మార్కుల జాబితా ప్రకటించ కుండానే తుది ఫలితాలు ప్రకటించడం తో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు దీని నియామకాల పై స్టే విధించి, నిపుణులతో విచారణ చేపట్టింది.ఈ విచారణలో ,పరీక్ష నిర్వహణ లో ఎలాంటి అవకతవకలు జరగలేద ని తేలడంతో ,మార్చి నెల లో కోర్టు స్టే ను ఎత్తి వేసింది.అయితే ఆ సమయానికి ఎమ్మెల్సీ, ఎన్నికల కోడ్, తర్వాత వెంటనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడం తో ప్రభుత్వం ఈ నియామకాలను చేపట్టలేకపోయింది.అయితే ఈ ఎన్నికల తర్వాత వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోడ్ రాబోతుండడం తో ,ప్రభుత్వం ఎన్నికల సంఘానికి అనుమతి కోసం విన్నవించగా ,రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం తో చర్చించి , ఈ ఉద్యోగాల నియామకానికి అనుమతి ని ఇచ్చింది.దీంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్,ఈ పరీక్ష లో ఎంపికైన అభ్యర్థుల కు నియామక పత్రాలను ఈ రోజు అర్ధరాత్రి నుండే ఇవ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత తమ అపాయింట్ మెంట్ ఆర్డర్ కాపీలను పొందవచ్చు.

ప్రతిరోజూ సందర్శించండి
www.paatshaalaindia.blogspot.com

0 comments:

Post a Comment