ప్రతీ ఏటా మన దేశం ఫిబ్రవరి 28 వ తేదీని NATIONAL SCIENCE DAY గా జరుపుకుంటుంది.ఎందుకో తెలుసా..?ఈ రోజుననే మన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త సర్ CV. రామన్ కాంతి విద్యుత్ ఫలితాన్ని( రామన్ ఎఫెక్ట్) కనుగొన్న రోజు కాబట్టి.ఈ సందర్బంగా రామన్ గురించిన కొంత సమాచారం.
సముద్రం నీలిరంగులో ఎందుకుంటుంది..?ఆకాశం నీలి రంగులోనే ఎందుకుంటుంది. పగలు నక్షత్రాలు ఎందుకు కనపడవు.? అసలు రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి..? ఎన్నో ప్రశ్నలు,మరెన్నో ఆసక్తికర అంశాలు..వీటన్నింటికీ సమాధానం సివి రామన్ కనుగొన్న సూత్రాలే ప్రామాణికం.
వైజ్ఞానిక రంగంలో నొబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా ఖండపు వ్యక్తి-సివి రామన్
దేశంలో రెండవ నోబెల్ పొందిన -సివి రామన్
భారతరత్న అందుకున్న తొలి శాస్త్రవేత్త-సివి రామన్
జననం: నవంబర్ 7, 1888 తమిళనాడు-తిరుచురాపల్లి
పూర్తి పేరు: చంద్రశేఖర్ వెంకట రామన్
తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్.
తండ్రి విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేయడం వల్ల రామన్ బాల్యం, విద్యాభ్యాసం విశాఖలోనే జరిగింది.
-రామన్ తన 13 వ ఏట ప్రెసిడెన్సీ కాలేజీలో 1902 లో ప్రవేశించి, 1904 లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకం పొందాడు.
1907 లో అదే కాలేజీ నుండి యం.ఏ. డిగ్రీని ఫిజిక్స్ లో డిస్టింక్షన్లో ఉత్తీర్ణుడయ్యాడు.
ఆ ఐసిఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ గా చేరాడు
ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్ తో పెళ్ళయింది.
ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి అక్కడికి వెళ్ళాడు. ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందారు. అలా అనుమతి పొందిన తరువాత పరిశోధనలపై ఉన్న ఆసక్తి వలన తెల్లవారుజామున ఐదున్నరకే ఐసిఎస్ కు రామణ్ వెళ్ళేవారు. వారాంతారాలు, సెలవులు ఇలా ఎలాంటి వెసులుబాటు దొరికినా ఎక్కువగా పరిశోధనలతోనే గడిపాడు. తన జీవిత కాలంలో సగభాగం పరిశోధనలకే కేటాయించాడంటే ఆయనకు పరిశోధనలపై ఎంత ప్రేమ దాగి ఉందో అర్థం చేసుకోచ్చు.తొలుత ధ్వని పై పరిశోధన చేసిన అతడు,తర్వాత కాంతి పై పరిశోధన ప్రారంభించాడు.
సముద్రంలో నీరు నీలి రంగులో ఎందుకుందంటూ సీ. వి. రామన్ చేసిన ప్రయోగం ఓ సంచలనం. ఈ ప్రయోగాల ఆధారంగానే ఆయనకు నొబెల్ బహుమతి వరించింది. అంతే కాదు భారతరత్న అవార్డు కూడా ఆయన ఖాతాలో చేరింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణం అని ఊహించారు. దీనిపై అతడు ఎన్నో పరిశోధనలు చేశాడు. అందుకు యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్.కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు.సముద్ర జలంలోని అణువులు సూర్యకాంతిని వివిధ వర్ణాలుగా విడదీసి వెదజల్లుతాయి. వివిధ వర్ణాలు వివిధ దశలలో వెల్లివిరుస్తాయి. నీలిరంగు కిరణాలు మాత్రం ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయి ప్రతిఫలిస్తాయి. అందువల్ల సముద్రం నీలి రంగులో ఉంటుందని రామన్ వివరించారు.
వీటిలో ఒక పరిశోధనా ఫలితానికే 1930 లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.
రామన్ జీవితంలో మరో మైలురాయి రామన్ ఎపెక్ట్ సిద్దాంతం. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని. దానివల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని తన సిద్దాంతాల ద్వారా రుజువు చేశారు రామన్.
సూర్యుని నుంచి వెలువడే తెలుపు వర్ణపు కాంతి వాయువులోని అణువులపై పడి, వాటి ప్రయాణ దిశను మార్చుకుంటాయని తన పరిశోధనల ద్వారా తెలుసుకున్న సి.వి. రామన్ ఓ సిద్ధాంతాన్ని సూత్రీకరించాడు. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని 1928 సంవత్సరం, ఫిబ్రవరి 28న రామన్ మొట్టమొదటిసారి ప్రకటించారు.
పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో చూపించాడు. అతను అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు ఆవిష్కరించడం జరిగింది. ఈ పరిశోధనను అభినందిస్తూ బ్రిటీష్ ప్రభుత్వం 1929 లో నైట్ హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా ధర చేయని పరికరాలతో ఆ విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులంతా రామన్ ను అభినందించారు.
1924 లో ఇంగ్లండ్ రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు.
1928 లో రామన్ కు సర్ బిరుదు దక్కింది
1947 లో ప్రతిష్ఠాత్మకమైన ఫ్రాంక్లిన్ మెడల్ లభించింది.
శాస్త్రరంగంలో రామన్ స్పెక్టో స్కోపీ ఆవిర్భావానికి 1954 లో భారతరత్న, 1957 లో లెనిన్ శాంతి బహుమతి లభించాయి
ఫిజిక్స్ రంగంలో రామన్ ఎఫెక్ట్ కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28 నే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. 1987 ఫిబ్రవరి నుండి ప్రతీ సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం అధికారకంగా జరుపుతోంది.
మనకి స్వాతంత్య్రం రాగానే రామన్ కు మొట్టమొదటి నేషనల్ ప్రొఫెసర్ గా ప్రభుత్వం నియమించి గౌరవించింది.
1948 లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ గా రిటైరయ్యారు.
రామన్ సుమారు 465 పరిశోధన పత్రాలను వెలువరించాడు. వాటిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు వారు సేకరించి భద్రపరిచారు.
1949 లో బెంగుళూరులో రామన్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ స్థాపించి, 1970 నవంబరు 27 న ఆయన మరణించే వరకూ, ఆ సంస్థలో పరిశోధనలు జరిపి, మన దేశంలో సైన్సు అభివృద్ధికి మార్గదర్శకు లయ్యారు.
1971 నవంబర్ 21 న సి.వి. రామన్ పోస్టేజి స్టాంపును భారత ప్రభుత్వం వెలువరించి ఆ మహా శాస్త్రజ్ఞుడిని గౌరవించింది.
రామన్ ఎఫెక్ట్ ఆసరా చేసుకుని అనేక దేశాల్లో శాస్త్రవేత్తలు ప్రయోగాలు, పరిశోధనలు చేశారు. దాదాపు 1800 పరిశోధన పత్రాలు ప్రచురించబడ్డాయి. 2500 రసాయనిక సమ్మేళనాలపై అధ్యయనం జరిగింది.
133 కోట్ల జనాభా ఉండి స్వాతంత్య్ర భారత చరిత్రలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇప్పటిదాకా నోబెల్ బహుమతి పొందగలిగింది ఒక్కరే అంటే భారత్ ప్రపంచ దేశాలతో ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సందర్బంగా అంత గొప్ప శాస్త్రవేత్త ను స్మరించడం ఎంతైనా అవసరం.




0 comments:
Post a Comment